అష్టదిక్పాలకులు అంటే ఎవరు ? ఎవరు ఏ దిక్కుకు కాపలా ఉంటారు

0
743

తూర్పు ,పడమర ,ఉత్తరం ,దక్షిణం దిక్కులు ఎన్ని అనే ప్రశ్న వస్తే చిన్నపిల్లలు కూడా ఈ నాలుగు దిక్కుల గురించి చెబుతారు. నాలుగు దిక్కుల తో పాటుగా నాలుగు మూలాలు కూడా ఉంటాయి. మొత్తం కలిపి అష్ట దిక్కులు ఉంటాయి ఈ ఎనిమిది దిక్కులకు పాలకులు ఎవరో తెలుసుకుందాం.

octogenariansనాలుగు ప్రధాన దిక్కులతో పాటు.. నాలుగు దిక్కుల మూలలకు కాపలాగా ఉండే వారినే అష్టదిక్పాలకులు అంటారు. వీరిలో తూర్పు దిక్కుకు ఇంద్రుడు, దక్షిణ దిక్కుకు యముడు, పడమర దిక్కుకు వరుణుడు, ఉత్తర దిక్కుకు కుబేరుడు అధిపతిగా ఉంటారు. వీరితో పాటు.. ఆగ్నేయానికి అధిపతిగా అగ్నిదేవుడు, నైరుతి దిక్కుకు అధిపతిగా నిర్భతి, వాయువ్య దిక్కుకు వాయుదేవుడు, ఈశాన్య దిక్కుకు ఈశానుడు అధిపతులుగా ఉంటారు. వీరినే అష్టదిక్పాలకులు అంటారు.

octogenariansవీరికి భార్యలు కూడా ఉన్నారు. వీరి పేర్లను కూడా చూద్దాం. ఇంద్రుని భార్య శచీదేవి, అగ్నిదేవుని భార్య స్వాహాదేవి, యముని భార్య శ్యామలాదేవి, నిర్భతి భార్య దీర్ఘాదేవి, వరుణుని సతీమణి కాళికాదేవి, వాయుదేవుని భార్య అంజనాదేవి, కుబేరుని భార్య చిత్రరేఖాదేవి, ఈశానుని భార్య పార్వతీదేవి.