నర్మదా నది మధ్యలో ఓం ఆకారం లో ఉండే కొండా ఎక్కడ ఉందొ తెలుసా ?

0
2284

శివుడు లింగరూపంలో దర్శనం ఇస్తుంటాడు. జ్యోతిర్లింగం అంటే శివుడిని లింగ రూపంలో ఆరాధించే చోటు అని చెబుతారు. శివుడు తన ఆత్మ శక్తిని లింగరూపంలో నింపి మన దేశంలో 12 చోట్ల స్వయంభువుగా వెలిశాడని పురాణం. వాటినే ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే అన్ని నదులు తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంటే, ఇక్కడ ఉన్న నర్మదానది మాత్రం పడమరకు ప్రవహించి అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది. జ్యోతిర్లింగ మధ్యన చిన్న చీలిక ఉంది. ఈ చీలిక ద్వారా అభిషేక జలం నర్మదా నదిలో కలసి నదిని పవిత్రం చేస్తుందని చరిత్ర చెబుతుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Dwadasa Jyotirlinga Temple

మధ్యప్రదేశ్ రాష్ట్రం, నర్మదా నదీతీరంలో ఒక కొండప్రదేశంలో ఓంకారేశ్వర శివలింగ క్షేత్రం ఉంది. ప్రస్తుతం కొన్ని కారణాల వలన మూలవిరాట్టుకు అభిషేకం అనేది జరగడం లేదని చెబుతున్నారు. మూలవిరాట్టుకు ఎదురుగా మరొక శివలింగం ప్రతిష్టించారు. ఈ శివలింగానికి అభిషేకాలు జరుగుచున్నవి. ఇక్కడి జ్యోతిర్లింగానికి మధ్యన చిన్న చీలిక ఉంది. ఈ చీలిక ద్వారా అభిషేక జలం నర్మదా నదిలో కలసి నర్మదా నదిని పవిత్రం చేస్తుందని ఆలయ చరిత్ర చెబుతుంది.

Dwadasa Jyotirlinga Temple

ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, నర్మదా నది మధ్యలో ఉన్న ఒక కొండ ఓం ఆకారం లో ఉంది. దీనికి ఒక పురాణం ఉంది, పూర్వం మాంధాత అనే శివభక్తుడు ఈ కొండమీద కూర్చొని శివుని కోసం తపస్సు చేసాడట. అప్పుడు శివుడూ అతడి భక్తికి మెచ్చి ప్రత్యేక్షమై ఇక్కడే అతడి కోరికను మన్నించి స్వయంభువుగా వెలిశాడని పురాణం. ఓం అనే అక్షరం శివుని ప్రణవనాదానికి సంకేతం కావడం వల్ల, ఈ కొండ ఓం ఆకారంలో ఉండటం వలన భక్తులు ఈ కొండచుట్టు ప్రదక్షిణ చేసి వస్తుంటారు.

Dwadasa Jyotirlinga Temple

ఇక్కడే పంచముఖ వినాయకుడి ఆలయం ఉంది. ఇక గర్భగుడిలో చిన్న శివలింగం ఉంది. ఈ శివలింగం చుట్టూ ఎల్లప్పుడూ బొట్లు బొట్లుగా నీరు ఊరుతూ ఉంటుంది. ఇలా గర్భగుడిలో పానవట్టంలో ఊరిన నీటిని భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. ఇంకా ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఇక్కడి ఆలయ గదులలో ఒక గదిలో తెల్లటి దుప్పటితో పరిచిన పరుపు, ఒక మంచం ఉంటుంది. అయితే ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఆంజనేయుడు శయన భంగిమలో దర్శనం ఇస్తుంటాడు.

Dwadasa Jyotirlinga Temple

ఇలా ఎన్నో ఆశ్చర్యకర అద్భుత విశేషాలు ఉన్న ఈ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించడానికి ఎప్పుడు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.