సహారా ఎడారిలో కన్ను గురించి రహస్యం ఏంటో తెలుసా ?

సహారా అంటే అరబ్బీ భాషలో అతిపెద్ద ఎడారి అని అర్థం. గణాంకాల ప్రకారం అంటార్కిటికా తరువాత ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద ఎడారి.ఈ ఎడారి వైశాల్యం 9,000,000 చదరపు కి.మీ (3,500,000 చదరపు మైళ్ళు) వైశాల్యంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలంత పెద్దది, ఆస్ట్రేలియా కంటే పెద్దది. ఈ ఎడారి ఉత్తర ఆఫ్రికా ఖండంలో ఎర్ర సముద్రం నుండి మధ్యధరా సముద్రతీర ప్రాంతం వరకు, అట్లాంటిక్ మహాసముద్రం పొలిమేర వరకు ఉంది.

సహారా ఎడారిఇప్పుడంటే సహారా ప్రపంచంలోనే పెద్ద ఎడారి. కానీ గతంలో రకరకాల సముద్ర జంతువులకు ఆవాసం. పెద్ద పెద్ద క్యాట్‌ఫిష్‌లు, సముద్ర పాములకు నిలయం. ఆ ఎడారిలో కొన్నేళ్లుగా పరిశోధన చేస్తున్న సైంటిస్టులు ఈ విషయం వెల్లడించారు. 1999, 2003, 2009ల్లో సహారాలో పరిశోధన చేసి ఇప్పుడున్న ఆఫ్రికా మధ్యలో సముద్రం ఉండేదని చెప్పారు. పక్కనున్న సముద్రంతో ప్రస్తుత నైజీరియా కింద కలిసేదని వివరించారు.సుమారు 50 మీటర్ల లోతు, 3 వేల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉండేదన్నారు. ఒకటిన్నర మీటర్ల క్యాట్‌ ఫిష్‌లు, 12 మీటర్ల సీ స్నేక్‌లు, 1.3 మీటర్ల పిక్నొడోంట్స్‌ (బాన్‌ ఫిష్‌ లాంటివి) అందులో ఉండేవని చెప్పారు. ఆ సముద్రాన్ని మ్యాప్‌ కూడా వేశారు.

సహారా ఎడారిసైంటిస్టుల అంచనా ప్రకారం ఆఫ్రికా చుట్టూ, మధ్యలోనూ సముద్రం ఉండేది. సముద్రంలోకి నీరు రావడం, పోవడం జరుగుతుండేది. అలా పాత నీరు పోతూ, కొత్త నీరు వస్తుంటే కొత్తరకం జీవులు పుట్టుకొస్తుంటాయి. నీళ్లలో ఉన్న జంతువులూ ఎక్కువ బరువు, పొడవు పెరిగే చాన్స్‌ ఉంది. దీన్నే ఐలాండ్ జెయింటిజమ్ అంటారు. ఆ ప్రకారమే ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద జంతువులు, సముద్ర జీవులు ఉన్నాయని అంచనా వేశారు. ఇప్పుడున్న మాలి దేశం 5 నుంచి 10 కోట్ల ఏళ్ల క్రితం సముద్ర తీరంతో ప్యూర్టొరికోలా ఉండేదని చెప్పారు. ప్రస్తుత మాలిలో ఇసుక కింద సముద్రపు ఆనవాళ్లు కప్పి ఉన్నాయని, కనుగొనాలంటే చాలా శ్రమించాల్సి ఉందని వివరించారు. అక్కడి ప్రజలు కూడా తమకు సముద్రపు జంతువుల అవశేషాలు కనిపించాయని చెప్పారన్నారు.

Sahara Desertఈ ఎడారిలో ఒక రహస్యం కూడా ఉంది ఇక్కడ ఒక పెద్ద కన్ను ఉంటుంది. ఎడారికి కన్నెంటి అని అనుకుంటున్నారా అవును మీరు విన్నది నిజమే ఇది మనిషి కన్ను ఆకారంలో ఉంటుంది .ఈ అద్భుతమైన కళాకృతి అంతరిక్షంలో నుంచి చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సహారా ఎడారిలో కన్ను గురించి అనేక రహస్యాలు ఉన్నాయి. ఈ కన్ను సుమారు 50 కిలోమీటర్లు ఉంటుంది దీన్ని ఎవరు ఎప్పుడు తయారు చేసారు అనే విషయం ఎవ్వరు కనుక్కోలేకపోయారు. దీన్ని మనుషులు తయారు చేసారు అనుకుంటే ఆ సమయంలో మనుషుల వద్ద ఇంత టెక్నాలజీ ఉందా? కొంత మంది ఇది కచ్చితంగా ఎలియన్ల పనే అని చెబుతున్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR