సూర్యోదయాన్నే ఆపేసిన సతీ సుమతీ కథ తెలుసా!

కొన్ని పురాణాల్లో పతివ్రతలు గురించి గొప్పగా చెప్పారు. అందులో మనకు ఎక్కువగా వినపడే పేరు సుమతి. ఆమె కథ తెలుసుకుందాం. పూర్వం ప్రతిష్టానపురంలో కౌశికుడు అనే బ్రాహ్మణుడు వుండేవాడు. అతని అదృష్టం కొద్దీ సుమతి భార్యగా లభించింది. కౌశికుడు ఎంత కోపిష్టివాడో.. అతని భార్య అయిన సుమతి అంత శాంత స్వభావం కలది. వాడు నిత్యం బయట తిరుగుతూ, ఇతర స్త్రీల పట్ల అధికంగా వ్యమోహం కలిగి ఉండేవాడు. దానికి విరుద్ధంగా సుమతీ మహాపతివ్రత. కౌశికుడు ఎక్కువగా చెడు తిరుగుళ్లు తిరగడంతో కుష్టురోగం తెచ్చుకుంటాడు. అయినప్పటికీ సుమతి మాత్రం అతనిని వదలకుండా దైవంలాగే సేవ చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతుంటుంది.

సతీ సుమతీఇలా వుండగా… కౌశికుడు ఒకనాడు వేశ్యకాంతను చూస్తాడు. తనను ఆమె దగ్గరకు తీసుకునివెళ్లాల్సిందిగా నిత్యం తన భార్యను వేధించేవాడు. దాంతో సుమతి ఒకరోజు వేశ్య దగ్గరకు వెళ్లి వేశ్యను ఒప్పిస్తుంది. అప్పుడు సుమతి తన భర్తను భుజాలపై ఎక్కించుకుని వేశ్య ఇంటిని తీసుకుపోతుండగా… దారిలో ఒకచోట కౌశికుని కాలు చీకటిలో ఒకరికి తగులుతుంది. అయితే కాలు తగిలిన వ్యక్తి ఒక మాండ్యముని.

సతీ సుమతీమాండ్యమునికి కౌశికుడి కాలు తగలడంతో మాండ్యముని కోపంతో.. ‘‘నన్ను బాధించిన నీ శరీరం సూర్యోదయం అయ్యేలోపు వెయ్యి ముక్కలు అవ్వాలి’’ అని శపిస్తాడు. అక్కడే వున్న సుమతి, మాండ్యముని శాపం విని.. ‘‘నా భర్త చనిపోకుండా వుండాలంటే అసలు సూర్యోదయమే కాకుండా ఆగిపోవలెను’’ అని కోరుకుంటుంది. ఆమె కోరిక నెరవేరి సూర్యోదయం కాకుండా అలాగే వుండిపోతుంది. లోకమంతటా ఒక్కసారిగా తలక్రిందులు అయిపోతుంది.

సతీ సుమతీఅప్పుడు బ్రహ్మాది దేవతలు ‘‘తల్లీ! సూర్యోదయం కాకపోవడం వల్ల లోకాలన్ని తల్లడిల్లుతున్నాయి. నీ భర్త చనిపోకుండా మేము అతనిని రక్షించి, ఆరోగ్యవంతుణ్ణి, సుగుణవంతుణ్ణి చేస్తాం’’ అని చెబుతారు. దాంతో సుమతి తన శాపాన్ని ఉపసంహరించుకుని.. సూర్యోదయం కావాల్సిందిగా అనుమతించింది.

సతీ సుమతీఅలా సూర్యోదయం కాగానే కౌశికుడు మరణిస్తాడు. వెంటనే అనసూయ అక్కడికి చేరుకుని అతనిని పునర్జీవితున్ని చేస్తుంది. దాంతో అతడు నవమన్మథుడుగా మారి.. భార్యతో కలిసి బ్రహ్మాదిదేవతలను స్తుతించడం మొదలుపెట్టాడు. పాతివ్రత్యము అంతటి శక్తివంతమైంది’’.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR