శివుడు శీర్షాసన భంగిమలో దర్శనమిచ్చే ఆలయం ఎక్కడ ఉండదో తెలుసా ?

పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్ధం ఉంది. శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపాలు. ఢమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక. అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన పులి చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆశీనంపైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతనూ సూచిస్తాయి. ఆయన పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు, నందీశ్వరుడు సత్సాంగత్యానికి, నంది ధర్మదేవతకు, మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక. కానీ శివాలయాల్లో శివుని రూపానికి పూజలు చేయరు.

తల క్రిందులుగా తపస్సు చేసే శివుని విగ్రహంశివుడిని లింగ రూపంలో పూజిస్తారనేది అందరికి తెలిసిందే. దాదాపు దేశంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాల్లో మహేశ్వరుడును లింగ రూపంలోనే పూజిస్తారు. ఈ ప్రపంచంలో ఎక్కడైనా శివుడిని పూజించేది ఒక్క శివలింగ రూపంలోనే !. శివలింగ రూపంలో కాకుండా శివుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఒక క్షేత్రం ఉందని ఎవరికైనా తెలుసా! అంతే కాకుండా ఆ గుడిలో శివుడు తలకిందులుగా తపస్సు చేస్తూ దర్శనమిచ్చి భక్తులచేత పూజించబడతాడు. ఆ పుణ్యక్షేత్రం ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో యనమదుర్రు అనే గ్రామంలో ఉంది.

తల క్రిందులుగా తపస్సు చేసే శివుని విగ్రహంఈ దేవాలయం పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమవరంకు కేవలం 5 కి.మీ దూరంలో ఉండటం విశేషం. ఈ గ్రామంలో వెలసిన శక్తీశ్వరాలయం చాలా విశిష్టమైనది. ఇక్కడ శివుడు శీర్షాసన భంగిమలో విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. శక్తి పీఠంలో శివుడు, పార్వతిదేవి మరియు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ముగ్గురు కలసి ఏకపీఠం మీద ఉండటం ఇక్కడి విశిష్టత. అలాగే పార్వతి దేవి మూడు నెలల పసికందు అయిన బాల సుబ్రహ్మణ్యేశ్వరస్వామినీ ఒడిలో లాలిస్తూ కొలువై ఉండటం మరో ప్రత్యేకత…. శివుడు తలక్రిందులుగా కొలువై ఉండటానికి గల కారణం ఏమిటో తెలుసుకుందాం. పూర్వం యముడు పాలిస్తున్న రాజ్యంలో శంబురా అనే రాక్షసుడు ప్రజలను, మునులను చాలా ఇబ్బంది పెడుతుంటాడు. ఈ ఇబ్బందులు పడలేక ప్రజలు, మునులు ఈ రాక్షసుడిని ఒక్క యముడు మాత్రమే చంపగలడు అని యముడి దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్నీ చెబుతారు.

తల క్రిందులుగా తపస్సు చేసే శివుని విగ్రహంశంబురా రాక్షసుడితో ఇంతకు ముందే యుద్ధంలో ఓడిపోయిన యముడు మరొక సారి అతనితో పోరాడే శక్తి నివ్వమని శివుడికి తపస్సు చేస్తాడు. ఆ సమయంలో శివుడు లోకకళ్యాణం కోసం తీవ్ర తపస్సులో ఉంటాడు. దానితో యముని తపస్సు చూసి పార్వతి దేవి ప్రత్యక్షం అవుతుంది. యముడు జరిగిన విషయాన్ని పార్వతి దేవికి చెబుతాడు. అప్పుడు పార్వతి యమధర్మరాజుకు ఒక ఆయుధాన్ని ఇవ్వడం తో శంబురా రాక్షసుడిని చంపుతాడు… దానితో ఆ రాక్షసుడి నుండి ప్రజలకు విముక్తి కలుగుతుంది.

తల క్రిందులుగా తపస్సు చేసే శివుని విగ్రహంఅప్పటి నుండి ఆ ప్రాంతానికి యమపురి గా పేరు వచ్చింది కాల క్రమేణా అది యనమదుర్రు గా మారిపోయింది. శంబురా రాక్షసుడు చనిపోయినా యమపురికి భవిష్యత్తులో ఎటువంటి ఆపద రాకుండా అక్కడే ఉండాలని యముడు శివుడిని మరొక సారి ప్రార్దిస్తాడు. అప్పటికి ఇంకా తపస్సులోనే ఉన్న శివుడు అదే రూపంలొ కుటుంబ సమేతంగా యమపురిలో వెలిసాడని ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్న కథ. ఈ గుడిలోకి వెళితే దీర్ఘకాలరోగాలు నయం అవుతాయని స్థలపురాణంలో పేర్కొన్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR