అభిషేకాల్లోకి పరమేశ్వరుడుకి అత్యంత ప్రీతికరమైనది ఏంటి

0
1134

పరమశివుడు అభిషేక ప్రియుడు అనేది జగమెరిగిన సత్యం. అందుకే బోళా శంకరునికి ఎన్నో రకాల అభిషేకాలు చేస్తూ ఉంటాం. మరి అన్ని అభిషేకాల్లోకి పరమేశ్వరుడుకి అత్యంత ప్రీతికరమైన అభిషేకం పాలతో చేసేదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అయితే చాలా మందికి శివలింగానికి పాలతోనే అభిషేకం ఎందుకు చేస్తారనే అనుమానం వుంటుంది. ఇందుకు కారణాలు లేకపోలేదు.

shiva abhishekamమహాశివరాత్రి రోజు సముద్ర మథనం ద్వారా ఉద్భవించిన విషాన్ని మహాశివుడు తన కంఠంలో దాచుకోవడంతో శివుడికి నీలకంఠుడు అని పేరు వచ్చింది. ఆ సమయంలో భగభగ మండిపోతున్న శివుడి గొంతును ఉపశమింపజేయడానికి దేవతలు పాలు పోయడంతో శివుడు శాంతించాడని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

shiva abhishekamమరో కారణం ఏమిటంటే శివరాత్రి రోజు, మహాశివుడు తాండవం ఆడతాడని భక్తుల అపార నమ్మకం. తాండవం చేయడం అంటే, విశ్వాన్ని సృష్టించేది. ఇది విశ్వాన్ని ప్రళయంతో అంతం కూడా చేస్తుంది. అందుకే తాండవం ఆడుతూ ఉగ్రంగా ఉండే శివుడిని శాంతింపజేయడానికి పాలను ఎంచుకున్నారు.

shiva abhishekam

ఎందుకంటే పాలు అనేది సాత్విక ఆహారం. కాబట్టి ఆయనకు పాలతో అభిషేకం చేస్తారు. అంతేకాకుండా పాలతో పాటు తేనెను కూడా అభిషేకాల్లో ఉపయోగిస్తారు. అందుచేత పాలతో అభిషేకం చేసిన వారికి ఈతిబాధలు వుండవని.. దారిద్ర్యం తొలగిపోతుందని చెబుతారు.