మనం నిద్రకు ఉపక్రమించేటపుడు ఎలాంటి నియమాలు పాటించాలి తెలుసా ?

0
700

పూర్వకాలం నుండి కూడా మన పెద్దలు మనకి చాలా నియమాలు నిష్టలు, ఆచారాలు అలాగే కొన్ని సంప్రదాయాలను అలవరిచారు .. వీటికోసం ఎన్నో పురాణాలూ, స్మృతులు సైతం తయారుచేసి భావితరాలకు అందచేశారు.. అయితే ప్రస్తుత రోజుల్లో ఇలాంటివి పాటించే వారు తక్కువే అయినప్పటికీ.. మన పెద్దలు పెట్టిన కొన్ని నియమాలను తెలుసుకోవటం మనకు మంచిదే.. ఎందుకంటే పెద్దలు చెప్పే ఎలాంటి ఆచారాలు నియమ నిష్ఠల వెనుకైనా ఉండే కారణం ఒక్కటే.. మనం బావుండాలి అని.. అలంటి కొన్ని నియమాల్లో శయన నియమాలు కూడా ఉన్నాయి… మరి మనం నిద్రకు ఉపక్రమించేటపుడు ఎలాంటి నియమాలు పాటించాలి.. ఏ పనులు చేయాలి.. ఏయే పనులు చేయకూడదు తెల్సుకుందాం..

Sleepingఎవరుకూడా ఎప్పుడైనా.. నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాల్లో గని, నిర్జన గృహంలో కానీ ఒంటరిగా పడుకోకూడదు… అలాగే దేవాలయం లోను మరియు స్మశానవాటికలోను పడుకోకూడదు అని మనుస్మృతిలో చెప్పబడింది. అలాగే ఎవరైనా పడుకోని నిద్రలో ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు అని విష్ణుస్మృతిలో చెప్పబడింది.. అయితే విద్యార్థులు, పని మిగిలిఉన్న వారు మరియు ద్వారపాలకులు అధిక సమయం నిద్రపోతున్నపుడు వీరిని మేల్కొలపవచ్చును అని చాణక్య నీతి తెలుపుతుంది..

Rahasyavaaniఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం బ్రహ్మా ముహూర్తంలో నిద్ర లేవాలి అని దేవీ భాగవతము లో చెప్పబడింది.. పూర్తిగా చీకటి గదిలో నిద్రించకూడదని పద్మ పురాణములో ప్రస్తావింపబడింది.

తడి పాదములతో నిద్రించకూడదని, పొడి పాదాలతో నిద్రించాలని అత్రి స్మృతిలో చెప్పబడింది.

ఇక విరిగిన పడకలు అంటే విరిగిన మంచాలపై గాని.. అలాగే ఎంగిలి మొహంతో పడుకోవడం నిషేధం అని మహాభారతం తెల్పుతుంది. నగ్నంగా, వివస్త్రలులై పడుకోకూడదని గౌతముని ధర్మ సూత్రంలో చెప్పబడింది.

Rahasyavaaniతూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించినచొ విద్య, పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించినచొ ప్రబల చింత, ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించినచొ హాని, మృత్యువు , ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించినచో ధనము,ఆయువు ప్రాప్తిస్తుంది అని ఆచార మయూఖ్ లో తెలిపారు.

ఎపుడు కూడా పగటిపూట నిద్రించరాదు.. పగటిపూట నిద్ర రోగహేతువు,మరియు ఆయుక్షీణత కలుగచేస్తుంది. పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు అని బ్రహ్మా వైవర్తపురాణంలో పేర్కొనబడింది. అలాగే సూర్యాస్తమయానికి ఒక ప్రహారం అంటే సుమారు మూడు గంటల తరువాతనే పడుకోవాలిట.

Rahasyavaaniఇంకా పడకపై ఎడమవైపు పడుకోవడం వలన స్వస్థత లభిస్తుందట .దక్షిణ దిశలో పాదములు పెట్టి ఎపుడు నిద్రించకూడదు.. ఎందుకంటే అక్కడ యముడు మరియు దుష్ట గ్రహముల నివాసము వుంటారట. శాస్త్రీయంగా చుస్తే దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. దీనివల్ల మెదడుకు రక్త సరఫరా మందగిస్తుంది. దీంతో మతిమరుపు, మృత్యువు లేదా అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడుతాయిట.

Rahasyavaani
గుండెపై చేయి వేసుకుని కానీ, కాలుపై కాలు వేసుకుని కానీ నిద్రించ రాదు. అలాగే పడక మీద త్రాగడం- తినడం లాంటివి చేయకూడదు. పడుకొని పుస్తక పఠనం చేయకూడదట… ఎందుకంటే పడుకొని చదవడం వలన నేత్ర జ్యోతి మసకబారుతుందట.

Rahasyavaaniఇలా శయన నియమాలను అనుసరించేవారు యశస్వి, నిరోగి,మరియు దీర్ఘాయుష్మంతుడు అవుతారు అని మన పూర్వికులచే చెప్పబడ్డ కొన్ని పురాణాల్లో పేర్కొనబడింది..

 

SHARE