Home Unknown facts ఆంధ్ర మహావిష్ణు దేవాలయం గురించి ఆశ్చర్యకర విషయాలు

ఆంధ్ర మహావిష్ణు దేవాలయం గురించి ఆశ్చర్యకర విషయాలు

0

శ్రీ మహావిష్ణువుని వైష్ణవులు ఎక్కువగా ఆరాధిస్తుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విష్ణువు ఆలయాల్లో ఈ ఆలయానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ వెలసిన విష్ణుమూర్తిని కొన్ని రకాల పేర్లతో పిలుస్తుంటారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆలయ విశేషాలు ఏంటనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం.

Andhra MahaVishnuఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా, విజయవాడకు సుమారు 65 కీ.మీ. దూరంలో గంటసాల మండపంలో, దివిసీమలో కృష్ణనది తీరాన శ్రీకాకుళం అనే గ్రామంలో ఆంధ్ర మహావిష్ణువు ఆలయం ఉంది. ఇది చాలా ప్రాచీన ఆలయం. ఇక్కడ ఉన్న విష్ణువుని ఆంధ్ర బాషా ప్రియుడి అని అంటారు. ఆ విష్ణువుని తొలుత బ్రహ్మయే ప్రతిష్టించి పూజించాడు. ఇచట ప్రతిష్టించబడిన శ్రీ మహావిష్ణువు శ్రీకాకుళేశ్వరుడన్న పేరుతో ప్రఖ్యాతి గాంచాడు. ఇక ఈ స్వామివారిని ఆంధ్రవిష్ణువు, ఆంధ్రనాయకుడు మొదలగు పేర్లతో పిలిచారని పురాణాలూ చెబుతున్నాయి.

ఇక్కడి ఐదు అంతస్థుల ఎత్తయిన రాజగోపుర స్తంభం మీదగల శాసనం ద్వారా ఈ గోపురమును చోళరాజైన అనంత దండపాలుడు శాలివాహనాశకం 1081 లో నిర్మించాడని తెలియుచున్నది. ఆ తరువాత శ్రీ కృష్ణదేవరాయలు క్రీ.శ. 1519 లో ఎచటకు వచ్చి ఇక్కడ ఉన్న మండపం దగ్గర కూర్చొని స్వామిని స్మరిస్తూ ఎముకతమాల్యద గ్రంథాన్ని రచించాడని తెలియుచున్నది. అందుకే ఆ మండపాన్ని ఆముక్తమాల్యద మండపంగా పిలుస్తున్నారు.

శ్రీకాకుళేశ్వరాలయం ఆలయం మూడు భాగాలుగా ఉంటుంది. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే పూర్వం ఎప్పుడో వెలిగించిన హోమగుండంలోని అగ్నిహోత్రం ఇప్పటికి అలాగే సంరక్షించబడటం ఆలయంలో కనిపిస్తుంది. ఈ శ్రీకాకుళ క్షేత్రం సాక్షాత్తు బ్రహ్మదేవుని ప్రయత్నం మేరకే ఉధ్బవించిందని ఒక పురాణ కథనం. శ్రీనాథుడు మొదలైన ఎందరో కవులు తమ కావ్యములతో ఈ క్షేత్రం గురించి, ఈ స్వామి యొక్క మహత్యం గురించి గొప్పగా వర్ణిస్తూ వ్రాసారు.

ఇక వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీకాకుళేశ్వరస్వామిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే పుణ్యలోక ప్రాప్తి లభిస్తుందని చెబుతారు. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో వైశాఖమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో భక్తులు భారీగా ఈ ఆలయానికి తరలి వస్తారు.

Exit mobile version