ఇంద్రుడు శరీరాన్ని సూచి చేసుకున్న క్షేతం ఎక్కడ ఉందొ తెలుసా

భారతదేశం ఎన్నో పురాతన పుణ్యక్షేత్రాలకు నెలవు. మనదేశంలోని తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లాలో’ సుచీంద్రంలో ఉన్న ధనుమలయన్ ఆలయం మూలవిరాట్టు రూపం మరెక్కడా మనకు కనిపించదు. ఒకే విగ్రహంలో శివుడు, విష్ణువు, బ్రహ్మ దేవుళ్లను మలిచిన తీరు అబ్బుర పరుస్తుంది. సుచీంద్రం దత్తాత్రేయ క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఆది శంకరాచార్యలు ఈ శుచీంద్ర పుణ్యక్షేత్రాన్ని సందర్శిచినప్పుడు పరమశివుడి తాండవ నృత్యాన్ని ప్రత్యక్షంగా చూశాడని చెబుతారు. లింగాకారంలో కనిపించే త్రిమూర్తుల క్షేత్రం సుచీంద్రం. తమిళనాడు కన్యాకుమారికి పన్నెండు కిలో మీటర్ల దూరంలో సుచీంద్ర క్షేత్రం ఉంది.

suchindram kshethramఇంద్రుడు శుచి అయిన ప్రదేశం కాబట్టి సుచీంద్రం అయింది. ఇక్కడ శివుడు త్రిమూర్తి స్వరూపంలో దర్శనమిస్తాడు. అనసూయాదేవి త్రిమూర్తులను పసి పాపాలను చేసి ఉయ్యాలలో ఊగించి లక్ష్మీ, సరస్వతి పార్వతీదేవిలకు కనువిప్పు కల్గించింది ఇక్కడే. శైవులకూ వైష్ణవులకూ కూడా దర్శనీయ క్షేత్రం సుచీంద్రం. గర్భ గుడిలో పెద్ద శివలింగం ప్రక్కనే విష్ణుమూర్తి ఉంటారు. ఏప్రిల్, మే నెలలలో ఒకసారి డిసెంబర్, జనవరిలో ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి. పెద్ద జలాశయం ఒకటి మనకు ఆలయం ముందే కనిపించి ఆశ్చర్య పరుస్తుంది. ఇక్కడి అలంకార మండపం ఎన్నదగినది. నాలుగు పెద్ద రాతి స్తంభాలు వాటికి అనుబంధ స్తంభాలతో ఒకఏక రాతి నిర్మితం ఉంటుంది. మరి రెండు స్థంభాలకు ముప్ఫై మూడు చిన్న స్తంభాలు కలిసి ఉంటాయి. ఇంకో రెండు స్థంభాలకు ఇరవై అయిదు చిన్న స్తంభాలు జత చేయబడి ఉంటాయి. ఇవన్నీ సంగీత స్తంభాలే. ఏ స్తంభాన్ని మీటినా సంగీత స్వరం వినిపించటం ప్రత్యేకత. ప్రతి చిన్న స్థంభం ఒక్కొక్క రకమైన సంగీత ధ్వని చేయటం ఆకర్షణీయంగా విశేషంగా ఉంటుంది. ఆలయం బయట పద్దెనిమిది అడుగుల ఎత్తు రాతి హనుమంతుని విగ్రహం విశ్వ రూప సందర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది.134 అడుగుల గోపురం చాలా దూరానికి కనిపిస్తుంది. ముఖ ద్వారమే ఇరవై నాలుగు అడుగుల ఎత్తుగా శిల్ప శోభితంగా ఉంటుంది.

suchindram kshethramత్రిమూర్తులు ఒకే లింగరూపంలో ఆవిర్భవించడం ఈ క్షేత్రం ప్రత్యేకత. లింగం పైభాగాన విష్ణుమూర్తి మధ్యభాగంలో శివుడు క్రిందిభాగంలో బ్రహ్మదేవుడు ఉన్నారని స్థలపురాణం చెబుతోంది. అహల్య విషయంలో గౌతమమహర్షి శాపానికి గురైన దేవేంద్రుడు, ఇక్కడి త్రిమూర్తులను ఆశ్రయించి శాపవిమోచనాన్ని పొందాడని అంటారు. ఇంతటి మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో 18 అడుగుల హనుమంతుడి విగ్రహం కొలువై ఉంటుంది. ఇంతటి భారీ రూపాన్ని కొంచెం దూరం నుంచే పూర్తిగా చూడగలుగుతాం. సాధారణంగా హనుమంతుడి అనుగ్రహాన్ని పొందాలనుకునే వాళ్లు ఆయనకి సిందూర అభిషేకం చేయిస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా ఈ క్షేత్రంలో స్వామివారి తోకకు స్వయంగా ‘వెన్నపూస’ రాస్తుంటారు. ఈ ఆచారం రామాయణ కాలంతో ముడిపడివుందని ఇక్కడి వాళ్లు చెబుతుంటారు.

suchindram kshethramసీతాన్వేషణ చేస్తూ లంకా నగరంలో అడుగుపెట్టిన హనుమంతుడు, కావాలనే రావణ సైన్యానికి పట్టుబడతాడు. రావణుడి ఆదేశం మేరకు ఆయన సైనికులు హనుమంతుడి తోకకు నిప్పుపెడతారు. ఆ సంఘటనని తనకి అనుకూలంగా మార్చుకున్న హనుమంతుడు తన తోకకి గల మంటను అక్కడి భవనాలకు అంటించి వాళ్లని భయభ్రాంతులకు గురిచేస్తాడు. ఆ సంఘటనలో హనుమంతుడి తోక చాలావరకూ కాలిపోతుంది. ఆ బాధ నుంచి ఆయనకి ఉపశమనం కలగాలనే ఉద్దేశంతోనే ఇక్కడి స్వామి తోకకి వెన్నపూస రాస్తున్నట్టుగా చెబుతారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం వెనుక గల అర్థం ఇదేనని అంటారు.

suchindram kshethramఈ విధంగా హనుమంతుడి తోకకి వెన్నపూస రాస్తూ ఆయనకి ఉపశమనం కలిగించడం వల్ల, ఆ స్వామి ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. యజ్ఞోపవీతధారణ ప్రాముఖ్యం గురించి వివరించిన ఋషులలో అత్రి ఒకరు. యజ్ఞోపవీతానికి మూడు ముడులు వేయటం వెనుకగల ప్రాము ఖ్యాన్నీ, ఆ మూడు ముడులూ బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు, ఆ ముడులే ‘ఓమ్’ శబ్దంలోని మూడు అక్షరాలు అ,ఉ,మలకు ప్రతీకలనీ అత్రి వివరిం చాడు. ఋగ్వేదంలోని 5వ మండలానికి ద్రష్టగా అత్రి మహామునిని పేర్కొంటారు. ఈ మండలంలో భూమి గురించిన వర్ణన ఉంది. సప్తర్షి మండలంలోని ఏడు నక్షత్రాలలో ఒకటి అత్రి. ఉర్సా మేజర్ నక్షత్రమండలంలోని ఏడు నక్షత్రాలలో ఇది నాలుగోది. దీనినే ‘డెల్టా’ అని అంటారు.

suchindram kshethramఅత్రి మహాముని ఆశ్రమం చిత్రకూట పర్వతంలో ఉన్నట్లు అక్కడి స్థల పురాణం చెప్తోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలలో ఉన్న చిత్రకూట పర్వతం 25 డిగ్రీలు ఉత్తరంలో ఉంది. అయితే, మరొక చోట, అత్రి ఆశ్రమం ఆలీఘర్ ప్రాంతంలో, అత్రావళి పర్వత ప్రాంతంలో ఉన్నట్లుగా ఉంది. అది 28 డిగ్రీల 1 నిమిషం 16 సెకన్లు, 78 డిగ్రీలు 16 నిమిషాలు, 52 సెకన్లుగా ఉంది. ఈ పర్వతశ్రేణి పేరుకూడా ‘అత్రావళి’ అని ఉండటం గమనించాలి!! అత్రి మహర్షి బ్రహ్మమానస పుత్రుడు. నవ ప్రజాపతులలో ఒకడు. కర్దమ ప్రజాపతి కుమార్తె, పతివ్రతలలో ఒకరైన అనసూయకు భర్త. అత్రి మహర్షి ఋగ్వేదంలోని 5వ మండలం ద్రష్ట. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు. బ్రహ్మవిష్ణు మహేశ్వరుల అవతారాలుగా పేరుగాంచిన ఆ ముగ్గురు: 1. దత్త, 2. దుర్వాస 3.సోమ. దత్తుడినే ‘దత్తాత్రేయ’ అనీ, దుర్వాస మహామునినే ‘కృష్ణాత్రేయ’ అనీ, సోముడినే ‘చంద్రాత్రేయ’ అనీ అంటారు. ఈ సోమేశ్వరుడు స్థాపించినదే ‘సోమేశ్వర జ్యోతిర్లింగం’. ఈ దంపతులు కన్యాకుమారి వద్దఉన్న ‘సుచీంద్ర ఆశ్రమం’లో ఉండేవారని అంటారు.

suchindram kshethramఅయితే, మరికొందరి అభిప్రాయంలో – లక్నో నగరానికి 13 కిలోమీటర్ల దూరంలో సతీ అనసూయ ఆశ్రమం ఉంది. అదే అత్రి, అనసూయ, వారి ముగ్గురు కుమారులు తపస్సు చేసిన ప్రాంతమని అంటారు. అక్కడే, అనసూయ తపోఫలం వల్ల మందాకిని నది జన్మించిందంటారు. ‘మందాకిని’ అనేది గంగకుగల అనేక నామధేయాల్లో ఒకటి అన్నది తెలిసిందే!

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR