శూర్పణఖ రాక్షసస్త్రీ గా జన్మించడానికి గల కారణం

రావణుడు సీతను ఎత్తుకుపోవడానికి కారణం శూర్పణఖ. ఈ విషయం అందరికి తెలుసు. కానీ శూర్పణఖ గురించి తెలుసుకోవలసిన విషయాలు చాలానే ఉన్నాయి. శూర్పణఖ అసలు పేరు మీనాక్షి. పుట్టినప్పుడు చేపకన్నులు కలిగి ఉందని ఆ పేరు పెట్టారు. కేకసి, విశ్రావసుల కుమార్తె ఈమె. రావణ, కుంభకర్ణ, విభీషణ, ఖర దూషణలకు సోదరి. మారీచ, సుబాహులకు మేనకోడలు. అంటే తాటకి ఈమెకు అమ్మమ్మ.
Surpanakha
విద్యజ్జిహ్యుడనే రాక్షసుడు ఈమెను వివాహం చేసుకున్నాడు. వీడు కాలకేయ వంశానికి చెందినవాడు. రావణాసురుడు లోకాలన్నిటినీ జయించే ఉత్సాహంలో ఒకసారి కాలకేయులతో పోరాడుతూ పొరపాటున విద్యుజ్జిహ్వుడినీ వధించాడు. అప్పటికి శూర్పణఖ గర్భవతి. భర్త మరణంతో దు:ఖితమదియైన శూర్పణఖను రావణుడు ‘తెలియక తప్పు జరిగిపోయిందని’ ఓదార్చాడు. కానీ ఆమె తన భర్త వియోగంలో మునిగిపోయింది.
Surpanakha
చెల్లెను ఆ విధంగా చూడలేని రావణుడు మనసు కుదుటపడటానికి ఖరుడు, దూషణుడు, త్రిశరుడు అనేవాళ్ళను తోడిచ్చి దండకారణ్యంలో విహరించమని పంపేశాడు. అప్పటి నుంచి ఒంటరైన ఆమె లంకకు, దండకారణ్యానికి మధ్య తిరుగుతూ కాలం వెల్లదీస్తుంది.
Surpanakha
యుద్ధంలో రావణ సంహారమే రామాయణమైతే, శ్రీరాముడు రఘవీరుడైంది రాక్షస సంహారంతోనే ఇదంతా శూర్పణఖ వల్లే జరిగింది. ఒక్క సారిగా , సుబాహు తప్ప మిగతా వారి మరణానికి కారణమైంది. అంతేకాదు వారి అభివృద్ధికి కూడా తోడ్పడింది ఆమే. ఎలా అంటే విభీషణస్తు ధర్మాత్మా అంటూ మొట్టమొదటి సారిగా రాముడి వద్ద విభీషణుడి పేరును ప్రస్తావించి, ఆయనపై శ్రీరామునికి సదాభిప్రాయం కలిగించింది కూడా ఈ మీనాక్షే.
Surpanakha
దండకారణ్యంలో నరవాసన తగలి పరుగెత్తుకొచ్చిన ఈమె, రాముడి దర్శనంతో ఆకలిని సైతం మరిచిపోయి, కామ వికారిగా మారి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని చేయందుకోవాలని ఆశించింది. అందుకు సీతను చంపడానికి కూడా సిద్ధపడింది. శూర్పణఖను రాక్షస స్త్రీగా వాల్మీకి వర్ణించినా, కంబ రామాయణంలో మాత్రం ఆమెను అందగత్తెగా చిత్రీకరించారు. సీతను చంపడానికి ఉద్యుక్తురాలవుతోన్న శూర్పణఖను తన అన్న శ్రీరాముడి ఆఙ్ఞ‌తో లక్ష్మణుడు ముక్కు, చెవులు కోసి వదిలిపెట్టాడు. అయితే ఈ శూర్పణఖ పూర్వ జన్మలో ఓ గంధర్వ కన్య. వైకుంఠంలో శేషతల్పంపై పవళించిన శ్రీహరిని చూడటానికి ఓ రోజు ఈమె ప్రయత్నించింది. ఈ సమయంలో ఆదిశేషుడు తన పడగలతో మహావిష్ణువును కనిపించకుండా మూసేశాడు. దీనికి ఆగ్రహించిన ఆ గంధర్వ కాంత శేషుడి చెవులు, ముక్కుమీద పొడించింది.
Surpanakha
ఆమె చేసిన పనికి లక్ష్మీదేవి ఆగ్రహం వ్యక్తం చేయగా, లక్ష్మీతో ఆమె వాగ్వాదానికి దిగింది. ఇంతలో ఆమె భర్త అక్కడకు వచ్చి భార్యను కసురుకుని భూలోకంలో రాక్షసిగా జన్మించమని శపించాడు. దీంతో ఆమె లక్ష్మీదేవిని కూడా శపించింది. కాలాంతరంలో నా కారణంగా నీకు భర్తతో వియోగం సంభవిస్తుందని శాపం ఇచ్చింది. ఆ గంధర్వాంగనే శూర్పణఖ.. ఆదిశేషుడే లక్ష్మణుడు. అలాగే తన భర్తను రావణుడు సంహరించాడనే కోపంతోనే రాక్షసనాశనం గావించింది. అంటే భారతంలో శకుని కోపం లాంటిది శూర్పణఖ ఆక్రోశం. చిన్న పాత్రే అయినా రామయణం మొత్తానికి ప్రధానంగా నిలిచింది. ఈమె వల్లనే విభిషణుడు తప్ప మిగిలిన రావణుడి వంశం నాశనమైంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,740,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR