Home Unknown facts జోగినులు నివసించే ఈ ఆలయం ఎక్కడ ఉంది? వారి గురించి ఆశ్చర్యకర నిజాలు

జోగినులు నివసించే ఈ ఆలయం ఎక్కడ ఉంది? వారి గురించి ఆశ్చర్యకర నిజాలు

0

గ్రామంలో అంటువ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు భవిష్యత్తులో ఏదో ప్రమాదం పొంచి ఉందని భావించి దీన్ని ఎదుర్కోడానికి గ్రామంలో నిమ్న కులానికి చెందిన కన్యకు దేవుళ్లతో వివాహం జరిపేవారు. వీరినే జోగినులుగా పిలిచేవారు. మరి జోగినులు నివసించే ఈ ఆలయం ఎక్కడ ఉంది? జోగిని వ్యవస్థ ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Devadasi Lived Once

మన దేశంలో దేవదాసీలను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పిలుస్తుంటారు. అయితే పూర్వం, ఏదైనా గ్రామానికి అరిష్టం జరిగినప్పుడు గ్రామదేవతకు మొక్కు బడి చెల్లించడానికి పెళ్లికాని ఆడపిల్లను గ్రామానికి దత్తత ఇచ్చేవారు. ఈవిధంగా పుట్టుకువచ్చిన సంప్రదాయమే జోగిని వ్యవస్థ. ఈ ఆచారం దాదాపుగా రెండు వేల ఏళ్ళ క్రితం మొదలైందని చెబుతారు.

ఇలా ఒకే కుటుంబానికి చెందిన ఆడపిల్లను జోగినులుగా మార్చేవారు. ఇక రానురానుగా జోగిని అంటే గుడిలో దేవుడి ఉత్సవం జరిగినప్పుడు నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్ళికాకుండా జోగినిని వేశ్యగా మార్చివేశారు. ఇలా ఎన్నో అకృత్యాలు జోగిని వ్యవస్థలోకి వచ్చి జోగినిలుగా ఉండే అమ్మాయిల జీవితం చాలా హీనంగా ఉండటంతో చివరకు ప్రభుత్వం దేవదాసి వ్యవస్థని రద్దు చేసింది.

ఇక ఒకప్పుడు పూర్వం ఈ ఆలయంలో జోగినీలు నివసించేవారని చెబుతారు. ఈ ఆలయం మహారాష్ట్ర లోని బేలాంజిల్లా లో ఒక కొండపైన ఉంది. ఈ ఆలయాన్ని ఎల్లమ్మ ఆలయం అని అంటారు. అయితే గ్రామదేవతగా పూజలను అందుకుంటున్న ఎల్లమ్మ రేణుకాదేవి యొక్క మరొక అవతారం అని భావిస్తారు. తక్కువ జాతికి చెందిన దళితులు ఈ అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు. మన తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, మహారాష్ట్ర లో కూడా ఈ అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తారు.

అయితే పూర్వం ఈ ఆలయంలో దేవదాసీలు అని పిలువబడే స్త్రీలు జీవిస్తూ ఉండేవారు. ఇక తమ కుటుంబంలో జన్మించే ఆడ పిల్లలను ఈ దేవతకు భక్తితో సమర్పిస్తారు. దేవదాసి అంటే దేవుడ్ని వివాహం చేసుకుంటుంది. కానీ కాలక్రమేణా ఈ వ్యవస్థ దిగజారిపోవడంతో ప్రభుత్వం ఈ ఆచారాన్ని నిషేదించింది.

ఇక ఈ ఆలయంలో సంవత్సరానికి ఒకసారి ఒక జాతర ఘనంగా జరుగుతుంది. దాదాపుగా 10 లక్షల మంది భక్తులు ఈ జాతరలో పాల్గొంటారు. ఒకప్పుడు ఈ జాతర సమయంలోనే తమ పిల్లలను దేవదాసీలుగా మార్చే ప్రక్రియ జరిగేదని చెబుతారు

Exit mobile version