తిరుమల కొండకి ఒక్కో యుగంలో ఒక్కో పేరు ఉండేదా ?

తెలుగు వారి ఇలవేల్పు తిరుమలేశుడు. సంవత్సరం పొడవున తిరుమలలో భక్తుల రద్దీ కనపడుతూనే ఉంటుంది. ఇంతకీ తిరుమల వెంకటేశ్వర స్వామివారి విశిష్టత ఏంటో తెలుసుకుందాం.

వేం – పాపము
కట – తీసేయడం
శ్వరుడు – తొలగించేటటు వంటివాడు.

Venkateswara swamyకలియుగంలో ఎవరికీ భగవంతునికి పాదాల యందు మనస్సు నిలబడదు. కలి యొక్క ప్రభావం వల్ల భౌతిక సుఖాల వైపు ఎక్కువ మోజు ఉంటుంది. మనస్సుని నిగ్రహించడం అంత సులభం కాదు. చాలా పాపాలు చేస్తూ ఉంటాం. ఈ పాపాలు చేసేటటు వంటి వారిని ఉద్ధరించడానికి పరమాత్మ “శ్రీ వేంకటేశ్వరుడు” గా ఆవిర్భవించారు. ఆ పాపాల్ని తీసేయగలిగే శక్తి ఆ భగవంతునికే ఉంది.

ఇక తిరుమల కొండకి వస్తే, సాక్షాత్తు వేదాలే ఆ కొండకి రాళ్ళు అయ్యాయి. ఒక్కొక్క యుగం లో ఒక్కో అవతారం ఎత్తి ఆయన ధర్మాన్ని రక్షించాడు.

Thirumalaకృత యుగం – నరసింహావతారం,

త్రేతా యుగం – శ్రీరాముడుగా,

ద్వాపరి యుగం లో – శ్రీ కృష్ణుడుగా,&

కలియుగం లో శ్రీ వేంకటేశ్వరుడుగా అవతరించాడు.

మిగిలిన అవతారారలో చేసినట్లుగా కలియుగం లో స్వామి దుష్ట సంహారం ఏమి చెయ్యలేదు. కత్తి పట్టి ఎవ్వరిని సంహరించలేదు. ఆయన చాలా కాలం వరకు నోరు విప్పి మాట్లాడేవారు. తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చి మాట్లాడ్డం మానేశారు.

Tirumalaకాబట్టి ఆ వేంకటాచల క్షేత్రం పరమపావనమైనటువంటి క్షేత్రం. తిరుమల కొండ సామాన్యమైన కొండేమీ కాదు. ఆ కొండకి, శ్రీ వేంకటేశ్వరునికి ఒక గొప్ప సంబంధం ఉంది. తిరుముల కొండకి ఒక్కో యుగం ఒక్కో పేరు ఉండేది.

కృత యుగం లో – వృషా చలం,

త్రేతా యుగం లో – అంజనా చలం

Venkateswara swamyతరువాత కలియుగం లో – వేంకటా చలం అని పేరు వచ్చింది. యుగాలు మారిపోయినా ఆ కొండ అలాగే ఉంది. ఈ కొండ శ్రీ మహావిష్ణువు యొక్క క్రీడాద్రి.. తిరుమల చాల పవిత్రమైనటు వంటి స్థలం అని చాలా పురాణాలూ చెబుతున్నాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR