జగ్గీ వాసుదేవ్ గారు సద్గురు ఎలా అయ్యారో తెలుసా?

భారతదేశంలో 100 మంది ప్రముఖ వ్యక్తుల్లో ఒకరు, మతాలకు అతీతంగా అందరికి సహాయం చేసేందుకు ఈషా ఫౌండేషన్ స్థాపించిన గొప్ప వ్యక్తి, దేశ అభివృద్ధి కోసం యువత ముందుకు రావడానికి ఎన్నో పథకాలను, కార్యక్రమాలను చేపట్టి తన ప్రసంగాలతో అందరిని ఆలోచించేలా చేసే ఒపీనియన్ మేకర్, ప్రజలను ప్రభావితం చేసే భారతదేశంలో ఉన్న 50 మంది గురువులలో ఒకరు సద్గురు జగ్గీ వాసుదేవ్ గారు. మరి చిన్నతనంలోనే యోగ నేర్చుకున్న ఆయన వ్యాపారాన్ని వదిలేసి ఎందుకు ఈశా ఫౌండేషన్ అనే సంస్థ ని స్థాపించారు? ఈ సంస్థ చేసిన పనులు ఏంటి? సద్గురు గురించి మరిన్ని విషయాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
sadguru
కర్ణాటక రాష్ట్రం, మైసూర్ లో  సుశీల, డాక్టర్ వాసుదేవ్ దంపతులకు 1957 సెప్టెంబర్ 3 వ తేదీన సద్గురు జగ్గీ వాసుదేవ్ గారు జన్మించారు.  ఆయన పుట్టిన తరువాత పిల్లవాడి భవిష్యత్తు ఎలా ఉంటుందని జ్యోతిష్యుడిని అడుగగా మంచి భవిష్యత్తు ఉందని చెప్పడంతో ఆయనకి జగదీష్ అని పేరుని పెట్టారు. జగదీష్ అంటే జగత్తుకు ఈశ్వరుడు అని అర్ధం. ఇక చిన్నతనం నుండే ప్రకృతి అంటే చాలా ఇష్టం ఉన్న ఆయన అడవులకి వెళ్లి వస్తుండేవారు. ఇలా తనకి 11 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మల్లాడి హళ్ళి శ్రీ రాఘవేంద్ర స్వామి పరిచయం అవ్వగా ఆయన తనకి కొన్ని యోగాసనాలను నేర్పించాడు. ఆ యోగాసనాలను రోజు క్రమం తప్పకుండ చేస్తుండేవారు. అలా రోజు చేయడం వలనే తనలో లోతైన అనుభవాలకు దారి తీసింది. ఇక చదువు విషయానికి వస్తే, మైసూర్ యూనివర్సిటీ లో ఇంగ్లిష్ లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన ఇంగ్లిష్, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం భాషల్లో బాగా మాట్లాడగలరు.
sadguru
సద్గురు గారికి  బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం ఉండేది. తన స్నేహితులతో కలసి కాలేజీ రోజుల్లో కొండ ప్రాంతాలకి బైక్ పైన వెళ్లేవారు. ఒక సందర్భంలో భారత్ – నేపాల్ సరిహద్దులో వెళుతుండగా పాస్ పోర్ట్ లేని కారణంగా ఆయనకి అటు వైపు వెళ్ళడానికి అనుమతించలేదు. ఇక కాలేజీ అయిపోయిన తరువాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలని భావించి తన స్నేహితులతో కలసి పౌల్ట్రీ ఫాం, ఇటుకల తయారీ వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. ఇలా సంతోషంగా వ్యాపారాన్ని చేస్తుండగా ఒకసారి ఎప్పటిలానే తన బైక్ పైన చాముండి కొండపైకి వెళ్లి ఒక రాయి మీద కూర్చొని ఉండగా ఆయనలో ఒక్కసారిగా ఆధ్యాత్మిక అనుభవం కలిగింది. అంటే నేను ఏదో, నేను కానిది ఏదో నాకు అర్ధం కాలేదు, అంత నేనే అనిపించింది. ఈ అనుభవంతో సద్గురు గారు వ్యాపారాలన్నిటిని స్నేహితులకి వదిలేసి తనలో కలిగిన ఆధ్యాత్మిక లోతును తెలుసుకోవడానికి ఒక సంవత్సరం వివిధ ప్రదేశాలను తిరిగి, తన మనసులోని భవనాలను అందరికి చెప్పడం కోసం యోగాని బోధించాలనే నిర్ణయం తీసుకున్నారు.
sadguru
ఈ విధంగా 1983 వ సంవత్సరం మైసూర్ లో తన మొదటి యోగ క్లాసుని ప్రారంభించారు. ఇక 1992 లో మతాలకు అతీతంగా, ఎలాంటి లాభాన్ని కోరుకోకుండా, స్వచ్చంధంగా ఈశా ఫౌండేషన్‌ ని తమిళనాడు లోని కోయంబత్తూర్ లో స్థాపించారు. సద్గురు గారు చేపట్టిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల విషయానికి వస్తే, గ్రామీణ పునరభివృద్ధి కార్యక్రమం, ప్రాజెక్ట్ గ్రీన్ హాండ్స్, ఈశా విద్య, ఈశా యోగ. ఈశా అనే పదానికి అర్ధం ఏంటంటే, దివ్యమైన నిరాకార స్వరూపం.
sadguru
గ్రామీణాభివృద్ధి కార్యక్రమం అంటే, తమిళనాడు లో చాలా చోట్ల ఈశా స్కూల్స్ ని ప్రారంభించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ఎన్నో ప్రభుత్వ పాఠశాలలను వీరి సంస్థ దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నది. ఇక ఇన్నర్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే, మనిషి లో ఉన్న శక్తిని బయటకి తీసుకురావడమే ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రధాన ఉద్దేశం. ఇంకా ఇందులో 21 నిమిషాల పాటు శ్వాసపై ధ్యాస ఉంచే శాంభవి మహాముద్ర క్రియ కూడా ఉంటుంది. సద్గురు గారు అడవులను పెంచేందుకు తీసుకువచ్చిన కార్యక్రమమే ప్రాజెక్ట్ గ్రీన్ హాండ్స్. ఈ కార్యక్రమం ద్వారా ఆయన తమిళనాడులో 12 కోట్ల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమం, ఇంట్లో నాటే మొక్కలు, పంట పొలాల దగ్గర నాటే మొక్కలు, విద్యార్థులు నాటే మొక్కలు అంటూ మూడు విధాలుగా అమలుచేస్తున్నారు. ఇప్పటికి విద్యార్థులకి పర్యావరణం మీద అవగాహన కల్పించి వారిచే దాదాపుగా 30 లక్షల మొక్కలని నాటించారు.
sadguru
ప్రాజెక్ట్ గ్రీన్ హాండ్స్ కార్యక్రమాన్ని గుర్తించిన కేంద్రప్రభుత్వం వీరి సంస్థకి ఇందిరాగాంధీ పర్యవరణ పురస్కారాన్ని అందించింది. ఈశా విద్య ద్వారా గ్రామాల్లో వీరు పెట్టిన స్కూళ్లల్లో 60 శాతం మంది విద్యార్థులు ఉచితంగా చదువుకుంటున్నారు. ఇది ఇలా ఉంటె ఈశా సెంటర్ విషయానికి వస్తే, అంతర్జాతీయ ఈశా యోగ కేంద్రం తమిళనాడు లోని కోయంబత్తూర్ దగ్గర ఉన్న వెల్లంగిరి పర్వతం మీద ఉన్నది. పూర్వము శివుడు ఇక్కడ సంచరించారని, మునులు, సిద్దులు, యోగులు ఇక్కడ తపస్సు చూసుకునేవారని అందుకే సద్గురు గారు ఇలాంటి ప్రశాంత వాతావరణంలో కేంద్రాన్ని ఏర్పాటుచేశారని చెబుతారు. ఇక్కడ ఉన్న పర్వతాలు మానస సరోవరం దగ్గర ఉన్న పర్వతాల మాదిరిగా ఉంటాయని అందుకే ఈ ప్రాంతాన్ని దక్షిణ భారత కైలాస పర్వతం అని అంటరాని చెబుతారు. ఇక్కడ 150 ఎకరాలలో విస్తీర్ణంలో ఉండగా ఇక్కడ ధ్యాన లింగం ఒక అద్భుతం అని చెప్పవచ్చు.  ఇక్కడ 113 అడుగుల ఎత్తైన శివుడు విగ్రహం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ విగ్రహాన్ని ఆదియోగి అని పిలుస్తారు. ఇక్కడ పదివేలమంది కుర్చునేవిధంగా ఆడిటోరియం అనేది ఉంది. అయితెహ్ నలుపు రంగులో ఉండే బారి విగ్రమైన ఆదియోగికి సుమారు ప్రతి సంవత్సరం ఒకసారి రెండు లక్షల ఎనిమిది రుద్రాక్షలతో మాలను వేస్తుంటారు.
sadguru
సద్గురు జగ్గీ వాసుదేవ్ గారు నదుల ని కాపాడాలంటూ ర్యాలీ ఫర్ రివర్స్ అనే కార్యక్రమంతో ముందుకు వచ్చారు. ఈ ఉద్యమ ఉద్దేశం ఏంటంటే, నదులలో కొన్ని కారణాల వలన నీరు అనేది తగ్గిపోతుందని, రాబోయే రోజుల్ అంటే 2030 వరకు నదిలో నీటి ప్రవాహం సగానికి పైగా తగ్గిపోయే అవకాశం ఉందని, ఇప్పటికే చాల చిన్న నదులు అంతరించిపోగా, కొన్ని నదులు మాత్రం వర్షాకాలం వరకే పరిమితం అయ్యాయని, నదులు కాలుష్యం అవ్వకుండా, నదిలో నీరు పూర్తి స్థాయిలో ప్రవహించాలంటూ ఆయన 16 రాష్ట్రాలలో 7 వేల కిలోమీటర్లు నదుల కోసం ర్యాలీ తీయడమే ఈ ఉద్యమ ఉద్దేశం.
sadguru
ఇక సద్గురు గారు ఏర్పాటు చేసిన ఈశా ఫౌండేషన్ 250 కేంద్రాలతో 90 లక్షల మంది వాలెంటరీలతో దాదాపు గ పది దేశాల్లో విస్తరించి ఉంది. ఆయన చేస్తున్న సామాజిక సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకు 2017 లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందించింది. ఇంకా ఆయన 2001 లో ఐక్యరాజ్య సమితి ప్రపంచ శాంతి సమావేశాలలో ప్రసంగించారు. ఇంకా ప్రపంచ ఆర్థిక సమావేశాల్లో నాలుగు సార్లు ప్రసంగించారు.
sadguru
మనుషులకి ఆధ్యాత్మికత వైపు ముక్తి మార్గాన్ని చూపిస్తూ, ఆయన ప్రసంగాలతో యువతలో ఆలోచన విధానాన్ని పెంచుతూ, ఎలాంటి లాభాన్ని ఆలోచించకుండా ఎన్నో సేవ కార్యక్రమాలను చేస్తున్న గొప్ప ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ గారు.
sadguru

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR