శివుడు వినాయకుడిని పూజించడం వెనుక కారణం ఏంటి?

త్రిమూర్తులలో ఒకరు పరమశివుడు అయన కైలాస అధిపతి. ఈయనను శంకరుడు, త్రినేత్రుడు, లయకారుడు, అర్ధనాదీశ్వరుడు ఇలా అనేక రకాల పేర్లతో కొలుస్తారు. హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి. అన్నికార్యములకూ, పూజలకూ ప్రధమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు వినాయకుడు. ఈయనను గణనాయకుడు, గణపతి, గణేశుడు మరియు అన్ని అడ్డంకులు తొలగించు వాడు విఘ్నేశ్వరుడు అంటూ అనేక రకాలుగా కొలుస్తారు. మరి శివుడు వినాయకుడిని ఎందుకు పూజించాడనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ganapthiఒకసారి శివుడు తన గణాలను తీసుకొని ఒక రాక్షసుడిని సంహరించడానికి బయలుదేరుతుండగా అయన వెళ్లే దారిలో అడుగడుగునా అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. ప్రతి పనిలోనూ విఘ్నలూ ఏర్పడుతున్నాయి. అయినా సరే శివుడు వాటిని పట్టించుకోకుండా తన వాహనమైన నంది పైన వెళుతుండగా ఒక్కసారిగా నంది కూడా ముందుకు అడుగువేయలేక ఆగిపోయాడు. అప్పడు శివుడు ఇంతకముందు ఎప్పుడు ఇలా అవ్వలేదని తన కన్నులను మూసుకోగా మనోనేత్రంలో బాలగణపతి నవ్వుతు కనపడ్డాడు. అప్పుడు శివుడికి గుర్తుకు వచ్చినది, పూర్వం గజరూపం గల ఒక రాక్షసుడు శివుడి కోసమై ఘోర తపస్సు చేయగా అప్పుడు ఆ రాక్షసుడి భక్తికి మెచ్చిన ఆ పరమశివుడు ప్రత్యేక్షమై ఏ వరం కావాలో అని అడుగగా ఆ రాక్షసుడు దేవా నీవు నా ఉదరం నందు ఎల్లప్పుడూ ఉండాలి అని అడగడంతో తధాస్తు అని చెప్పి శివుడు ఆ రాక్షసుడి ఉదరం నందు ఉండిపోతాడు.

ganapthiఇది తెలిసిన పార్వతి దేవి దీనికి పరిష్కార మార్గం చూపమంటూ శ్రీమహావిష్ణువు ప్రార్ధించగా అప్పుడు శ్రీమహావిష్ణువు నందిని గంగి రెద్దుల అలంకరించి, దేవతలందరు సంగీత వాయిద్యాలు పట్టుకొని గజాసురిడి దగ్గరికి వెళ్లి ఆ రాక్షసుడి ముందు వాయించగా అది విన్న గజాసురుడు ఆశ్చర్యానికి గురై పరవశించి మీకు ఎం వరం కావాలో చెప్పమని అడుగగా, అప్పుడు మారువేషంలో ఉన్న విష్ణువు, నీ ఉదరంలో ఉన్న శివుడు కావాలంటూ బదులివ్వగా వచ్చినది శ్రీమహావిష్ణువు అని తెలుసుకొని ఇక అంతం తప్పదు అని భావించి నా తలని బ్రహ్మాది దేవతలంతా, త్రిలోకాలు కూడా పూజించేలా చేయాలనీ ప్రార్ధించగా, అప్పుడు గంగి రెద్దు రూపంలో ఉన్న నంది తన కొమ్ములతో గజాసురుడి ఉదరాన్ని చీల్చేస్తుంది. అప్పుడు ఆ మరమశివుడు బయటికి వచ్చి కైలాసానికి బయలుదేరుతాడు.

ganapthiఇక విషయం తెలిసిన పార్వతీదేవి సంతోషించి అభ్యంగన స్నానం చేయాలనీ తలచి నలుగు పిండితో ఒక బొమ్మని చేసి ఆ బొమ్మకి ప్రాణం పోసి ద్వారానికి కాపలాగా ఉంటూ ఎవరిని కూడా లోపలికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకు అని చెప్పి స్నానం చేయడానికి వెళుతుంది. కైలాసానికి చేరుకున్న శివుడిని లోపలకి రాకుండా ద్వారం వద్ద ఆ శిశువు అడ్డుకొనగా ఆవేశంతో శివుడు తన త్రిశూలంతో ఆ శిశువు తలని ఖండిస్తాడు. ఇలా లోపలికి వెళ్లిన తరువాత కొద్దిసేపటికి శివుడిని చుసిన పార్వతి ద్వారం వద్ద శిశువుని చూసి పట్టరాని దుఃఖంతో విలపించగా, అప్పుడు శివుడూ కలత చెంది గజ సూరిని తలని ఆ బాలునికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అని నామకరణం చేసాడు.

ganapthiఅయితే గణపతికి ఏనుగు తల అతికించి తిరిగి బ్రతికించిన సమయంలో, దేవతలు, ఋషులు, సాధారణ మనుషులు ఏ పూజలు, వ్రతాలు, శుభకార్యాలు చేసిన మొదటి పూజ నీకె, నూతనంగా ఎవరు ఏ పనిని తల పెట్టిన ముందుగా నిన్ను తలచుకొని నీకు పూజ చేయనిదే ఆ కార్యం నిర్విఘ్నంగా పూర్తి కాదు, అందుకు త్రిమూర్తులమైన మేమూ అతీతులం కాదు అని వరాన్ని ఇస్తాడు.

ganapthiఅయితే రాక్షసుడిని సంహరించడానికి బయలుదేరే ముందు శివుడు ఆ తొందరలో గణపతిని కలసి వెళ్లే పని గురించి చెప్పకుండా వెళ్లడంతో దారిలో ఇలాంటి ఆటంకాలు ఎదురయ్యాయని అప్పుడు గ్రహించి తిరిగి వెనక్కు వెళ్లి గణపతిని పూజించి, తనకి ఏ విఘ్నలూ లేకుండా విజయం సాధించేలా చూడమని గణపతికి చెప్పి తిరిగి వచ్చి యుద్ధం చేసి విజయాన్ని సాధిస్తాడు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,740,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR