కరోనా గురించి బ్రహ్మం గారు ముందే చెప్పారా ?

బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి  ప్రతి ఒక్కరూ ఏదొక సందర్భంలో వినే వుంటారు.. బ్రహ్మం గారు తనకు ఉన్న అపారమైన మేధస్సును ఉపయోగించి..  భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ముందే తెలియజేశాడు. అందులో కొన్ని సంఘటనలు నిజమయ్యాయి. మరికొన్ని సంఘటనలు నిజం కాలేదు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో బ్రహ్మంగారి చెప్పిన కాలజ్ఞానంలో ఏమేమి జరిగాయి ఇంకా ఎం జరుగబోతున్నాయి తెల్సుకుందాం..

Brhamn Garuబ్రహ్మం గారి అవతారాన్ని బట్టి  అందరూ ఆయనను ఆధ్యాత్మికవేత్త అనుకునేవారట. కానీ ఆయన హేతువాదిగా ఉండేవారట. అంతేకాదు సంఘసంస్కర్త అని చరిత్రకారులు చెబుతున్నారు. క్రీ.శ1608 నుండి 1693 మధ్య జీవించిన ఈయన కాలజ్ణానాన్ని బోధించిన యోగిగా  మంచి పేరు తెచ్చుకున్నారని చరిత్ర ద్వారా తెలుసుస్తోంది. అయితే ప్రస్తుతం బ్రహ్మంగారి ప్రస్తావన మరోసారి తెరమీదకు వచ్చింది..  ప్రపంచంలో ఎక్కడ ఏ వింత చోటు చేసుకున్నా.. అది బ్రహ్మంగారు ఆనాడే చెప్పారని వింటుంటాం..  అందులో కరోనా వైరస్ కూడా ఒక్కటి. అయితే ఇంతటితో ఈ భయంకరమైన పరిస్థితులు ఆగిపోవని బ్రహ్మంగారు చెప్పారట.  మరిన్నో పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పారట.

Kasiబ్రహ్మంగారి కాలజ్ణానం ప్రకారం ఇప్పటివరకు జరిగిన విషయాలు  పరిశీలిస్తే… కాశీలోని దేవాలయం నలభై రోజులు పాడుపడుతుంది అని చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే 1910-12 మధ్యలో గంగానదికి భారీ వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీని వల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు భక్తులెవ్వరూ వెళ్లలేదు.

రాచరికాలు, రాజుల పాలన నశించిపోతాయి. మన దేశంలో రాచరిక వ్యవస్థ అనేది ఉండదు. ఒక అంబ పదారేళ్లు రాజ్యాధికారం దక్కించుకుంటుంది. అని చెప్పారు బ్రహ్మగారు.. ఆ విధంగానే ఇందిరాగాంధీ 16 సంవత్సరాల కాలంలో మన దేశ ప్రధానిగా పని చేశారు. అలాగే బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి అని కూడా చెప్పారు. . ప్రస్తుతం ఉన్న బ్రహ్మాణులకు తెలియదు కానీ.. వందేళ్ల క్రితం బ్రాహ్మాణులకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. ఇప్పుడు ఎక్కడా అగ్రహారాలు లేవు.

Indira Gandhiవ్యభిచారిణుల వల్ల చాలా మంది భయంకర రోగాలకు గురవుతారు. వావీ వరసలు లేకుండా మనుషులు పశువుల్లా ప్రవర్తిస్తారు అని కాలజ్ఞానం లో చెప్పారు బ్రహ్మం గారు.. దీనికి ఉదాహరణే ఎయిడ్స్..  ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ ఎయిడ్స్ వ్యాధికి మందే అనేదే దొరకలేదు. ఈ వ్యాధి వచ్చి లక్షలాది మంది చనిపోయారు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు కూడా దారి తీశాయి. తీస్తున్నాయి.

Aidsబ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఓ పద్యం ఉంది.

ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను

లక్షలాది ప్రజలు సచ్చేరయ

కోరంకియను జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరయ అని..

బ్రహ్మంగారు భారత దేశానికీ ఈశాన్య దిక్కున ఉన్న చైనాలో పుట్టే ఈ కరోనా వైరస్ భూతాన్ని ఆనాడే ఊహించి చెప్పారని చాలా మంది చెబుతున్నారు.

Corona Virusఇక  రాబోయే రోజుల్లో జరిగే వాటి గురించి బ్రహ్మంగారు తన కాలజ్ణానంలో ఇంకా చాలా విషయాలు చెప్పారు. అందులో ముఖ్యమైనది ఏంటంటే.. మన తెలుగు రాష్ట్రాల్లోని క్రిష్ణా నది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను తాకుతుందట. ఒకవేళ జల ప్రళయం వచ్చి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే క్రిష్ణా నది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది.

Krishna Riverక్రిష్ణా నది మధ్యలో ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కంటి చూపు పోతుందట. అలాగే పర్వతానికి ఒక మొసలి వస్తుంది.  8 రోజులు ఉండి, భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతు లాగా అరిచి మాయమవుతుందట. అలాగే కర్నూలు జిల్లా ఆదోని మండలంలో కప్ప కోడై కూస్తుందని చెప్పారట. అలా జరిగితే ఎన్నో వినాశనాలు జరుగుతాయట. ఇక  శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్లు దొర్లిపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతారట. పగిలిన రాతిముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని చెప్పారు. కర్నాటకలో కామాక్షమ్మ విగ్రహం నుండి రక్తం కారుతుందట. కలియుగంలో 5 వేల సంవత్సరాలు పూర్తయ్యేసరికి కాశీలో గంగ కనబడదట. ఇలా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రస్తుతం వైరల్ గ మారింది..

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,670,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR