సప్తఋషులకి గుహలో జ్యోతికి బదులు నరసింహస్వామి మూర్తి కనిపించిన అద్భుత ఆలయం

0
5881

శ్రీ లక్ష్మి నరసింహస్వామి చిన్న కొండపైన ఇచట వెలిసాడు. అందుకే ఈ కొండని నరసింహకొండ అని పిలుస్తుంటారు. కశ్యప మహర్షి లోక కళ్యాణం కోసం యజ్ఞం చేస్తున్నప్పుడు యాగ ప్రధానంగాలయిన త్రేతాగ్నులను 3 ప్రదేశాలలో ప్రతిష్టించాడు. అందులో మూడవది ఈ వేదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం అని చెబుతారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

lakshminarasimhaఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, నెల్లూరు జిల్లా, నెల్లూరు పట్టణమునకు వాయువ్య దిశగా కొన్ని కిలోమీటర్ల దూరంలో వేదగిరి అనే గ్రామం కలదు. ఈ గ్రామమునందు నరసింహకొండ అను పిలువబడు కొండపైన వెలసిన దివ్యక్షేత్రం శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం. ఈ దేవస్థానం చాలా పురాతనమైనది. ఈ దేవాలయం ఇక్కడ ఉన్న చిన్న కొండపైన ఉండటం వలన ఈ కొండని నరసింహకొండ అని పిలుస్తారు. ఈ కారణంగానే ఈ కొండ దిగువ భాగాన ఉన్న ఉరికి నరసింహకొండ అనే పేరు వచ్చినది. పూర్వం ఈ స్వామి చెంత వేదపఠనం జరుగుతూ ఉండేది అందువలన దీనిని వేదగిరి, వేదాద్రి అని అంటారు.

lakshminarasimhaపురాణానికి వస్తే, సప్త మహర్షులు ఈ కొండపైనా యజ్ఞం చేసినట్లు బ్రహ్మపురాణం వల్ల తెలుస్తుంది. సప్తఋషుల ఆధ్వర్యంలో జరిగిన యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేయగానే యాగానంతరం ఆ హోమ గుండాల నుంచి వెడలిన ఒక తేజో జ్యోతి కొంచెం దూరం ప్రయాణించి ఒక గుహలోకి ప్రవేశించింది. ఆ జ్యోతిని వెంబడించి చూడగా మహర్షులందరికి గుహలో జ్యోతి కనిపించలేదు. జ్యోతికి బదులుగా నరసింహస్వామి మూర్తి కనిపించింది. వారందరు సంతోషించి ఆ ప్రతిమను అచటనే ప్రతిష్టించారు. అదియే నేటి వేదగిరి గుహలోని మూలవిరాట్టు అయినా శ్రీ నరసింహస్వామి వారు.

lakshminarasimhaవేదగిరి లక్ష్మి నరసింహస్వామి దేవాలయం నరసింహులుకొండ అనే శిఖరం పైన క్రీ.శ. 870 – 915 మధ్య పల్లవ రాజు నరసింహవర్మ ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. వేదగిరికి దక్షిణాన ఉన్న అప్పటి 7 హోమగుండాలు నేడు 7 కోనేరులుగా నిలిచి ఉన్నాయి.

lakshminarasimhaఈ ఆలయ ముఖద్వారా గాలిగోపురం చాలా సుందరమైనది. ఈ ఆలయం కొండపైన ఉండటం వలన గోపురం చాలా దూరం నుండి కనబడును. ఈ ఆలయంలో స్వామివారికి నిత్యపూజలతో పాటు, పర్వదినాలలో విశేష పూజలు జరుగును. వైశాఖ మాసం నందు 11 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

lakshminarasimha