శివుడు లింగోద్బవ స్వామిగా పూజలందుకుంటున్న అద్భుత ఆలయం గురించి తెలుసా ?

0
6856

శివుడు లింగరూపంలో దర్శనం ఇస్తాడని మనకి తెలుసు అయితే ఇక్కడ వెలసిన లింగానికి ఒక ప్రత్యేకత అనేది ఉంది. అదేంటంటే శివలింగం పైన బ్రహ్మ, విష్ణువు రూపాలు మనకి దర్శనం ఇస్తాయి. మరి అరుదైన ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

shivalingamఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా లోని చందోలు గ్రామంలో లింగోద్భవ స్వామి ఆలయం ఉంది. ఇది చాలా ప్రాచీన ఆలయంగా ప్రాచుర్యం పొందినది. ఈ ఆలయం క్రీ.శ. 1073 లో నిర్మించినట్లు తెలియుచున్నది. ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉండి, గర్భాలయం, అంతరాలయం, మండపం అను మూడు భాగాలుగా నిర్మితమై ఉన్నది.

shivalingam ఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, బ్రహ్మ, విష్ణువులు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నప్పుడు శివుడు వారి మధ్య తేజోలింగంగా వెలిశాడని చెబుతారు. ఇక ఈ ఆలయం లో ఉన్న ధ్వజస్తంభం పక్కన 11 అడుగుల ఎత్తు, నాలుగున్నర అడుగుల వెడల్పు గల నల్లరాతి శివలింగం ఉంది. దీనినే లింగోద్భవ శివలింగం అని అంటారు. స్థల పురాణానికి నిదర్శనంగా ఈ మహాలింగం పైన హంసరూపంలో బ్రహ్మ క్రింది భాగాన వరాహరూపంలో విష్ణువు రూపాలు కనిపిస్తాయి.

shivalingamఅయితే ఈ లింగోద్బవ శివలింగాన్ని క్రీ.శ. 1806 లో శ్రీ రాజా, వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు గారు ఒకప్పుడు ఈ శివలింగాన్ని తీసుకు వెళ్లి చేబ్రోలు గ్రామంలో ప్రతిష్టించాలని ఆనుకున్నారంటా కానీ వారు ఎంత ప్రయతించిన ఆ శివలింగం రాకపోవడంతో అచటనే ఉంచారంటా.

shivalingam ఇక ఈ ఆలయంలోని గర్భగుడిలో శ్రీ లింగోద్భవ మూర్తి, మండపంలో ఎడమ భాగాన పార్వతి అమ్మవారు, కుడిభాగాన వీరభద్రుడు ఈశాన్య భాగాన మహిషాసుర మర్దని మొదలగు దేవత మూర్తులు మనకి దర్శనం ఇస్తారు. ఇక్కడ నిత్య పూజలతో పాటు అర్చనలు, ప్రత్యేక పూజలు జరుగును.

shivalingam ఇలా అరుదైన శివలింగం ఉన్న ఈ ఆలయానికి మహాశివరాత్రి సమయంలో ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ లింగోద్బవ స్వామిని దర్శనం చేసుకొని తరిస్తారు.

shivalingam