Home Unknown facts ప్రపంచంలోనే శివుడి యొక్క రెండవ ఎత్తైన విగ్రహం ఉన్న అద్భుత ఆలయం గురించి తెలుసా...

ప్రపంచంలోనే శివుడి యొక్క రెండవ ఎత్తైన విగ్రహం ఉన్న అద్భుత ఆలయం గురించి తెలుసా ?

0

శివ భక్తుడైన రావణుడు ఆత్మలింగాన్ని భద్రపరిచిన పెట్టెపైన కట్టిన వస్త్రం పడిన చోటు వెలసిన క్షేత్రం ఇది అని చెబుతారు. కన్నడ భాషలో మురుడు అంటే వస్త్రం. మరి ఆత్మలింగం భద్రపరిచిన వస్త్రం ఈ ప్రదేశంలో ఎందుకు పడింది? ఈ ఆలయ స్థలపురాణం ఏంటి? ఈ ఆలయంలో ఉన్న విశేషం ఏంటనే మరిన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Sri Marundeeswarar Temple

కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో అరేబియా సముద్రానికి ఆనుకొని శ్రీమురుడేశ్వర స్వామి ఆలయం ఉంది. దీనిని భక్తులు మురుడేశ్వర ఆలయం అని కూడా అంటారు. మూడువైపులా అరేబియా సముద్రం ఆవరించి ఉండగా,కందుక అనబడే పర్వతం మీద ఈ ఆలయం ఉన్నదీ. ఈ దేవాలయ గాలిగోపురం 23 అంతస్థులతో అలరారుతున్నది. ఇక్కడ 123 అడుగుల ఎత్తు కలిగిన ఈ సుందర విగ్రహాన్ని చెక్కడానికి 2 సంవత్సరాల సమయం పట్టిందట. ఈ విగ్రహం ప్రపంచంలోనే శివుడి యొక్క రెండవ ఎత్తైన విగ్రహం అని చెబుతారు. ఇక్కడి గాలి గోపురం ప్రపంచంలో కెల్లా చాలా పెద్దది. ఈ విగ్రహానికి మరో ప్రత్యేకత కూడా ఉన్నదీ అది ఏంటి అంటే సూర్యరశ్మి పడినప్పుడు ఈ విగ్రహం ధగధగ మెరిసిపోతూ ఉంటుందంటా.

మరి ఈ ఆలయానికి ఆ పేరు ఎందుకు వచ్చినది అంటే, కైలాసం నుండి శివుని ఆత్మలింగాన్ని తీసుకొని లంకకు తిరిగివస్తున్న రావణాసురిడి ప్రయత్నానికి భూకైలాస్ వద్ద విఘ్నం కలిగి, ఆ ఆత్మలింగం భూకైలాస్ లోనే భూస్థాపితమైనది. భూమిలో దిగబడిపోయిన ఆ శివలింగాన్ని పైకి లాగటానికి ఎంత ప్రయతించినా అది రాకపోవడంతో నిరాశ చెందిన రావణుడు శివలింగాన్ని భద్రపరిచిన పెట్టెను చిన్నాభిన్నం చేసి దూరంగా విసిరేసాడు. పెట్టెని చుట్టడానికి ఉపయోగించిన వస్రం పడ్డ ఆ ప్రదేశాన్ని మురుద్వేర్ అనే పేరు వచ్చింది. కన్నడ భాషలో మురుడు అంటే వస్రం అందుకే ఈ క్షేత్రం మురుడేశ్వర్ గా పిలువబడింది.

ఇంతటి గొప్ప దేవాలయం మరియు పెద్ద శివుని విగ్రహం ఉన్నదీ కనుకే ఇది మంచి పర్యాటక కేంద్రంగా భక్తులతో కిటకిట లాడుతుంది.

Exit mobile version