భక్తుని కోసం శివుడు వైద్యుని రూపంలో దర్శనమిచ్చిన అద్భుత ఆలయం

మన హిందూ సంప్రదాయంలో జ్యోతిష్యం అంటే నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఇక నాడి జ్యోతిష్యం గురించి వాస్తవాలు ఇప్పటికి అందరికి ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇదే విషయం పైన కొందరు పండితులు ఏం అంటున్నారు అంటే, నాడీజ్యోతిశ్యం అనేది నూటికి నూరు శాతం నిజమని నాడి శాస్రంలోని రహస్యాలు అసత్యం కాదని వారు చెబుతున్నారు. మరి నాడీజ్యోతిష్కులు ఉండే ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

nadijoshyamతమిళనాడు రాష్ట్రంలోని, నాగపట్నం జిల్లాలో, వైదీశ్వరన్ కోయిల్ అనే రైల్వేస్తైషన్ కు సమీపంలో వైదీశ్వరన్ ఆలయం ఉంది. ఈ దేవాలయం ఉత్తర తమిళనాడు వారికీ చాలా ముఖ్యమైన పవిత్ర స్థలం. ఈ ఆలయంలోనే స్వామివారిని వైదీశ్వరన్ అని, అమ్మవారిని బాలాంబల్ అని పిలుస్తుంటారు.

nadijoshyamఈ ఆలయం చాలా పెద్ద నిర్మాణం. ఇక్కడి శిల్ప సౌందర్యం చాల గొప్పగా ఉంటుంది. తమిళులందరికి శీర్కాలి చాలా పవిత్రమయిన యాత్రా స్థలం. సంబందర్ అనే వాగ్దేయకారుడు ఈ శీర్కాళిలోనే జన్మించాడు. అయన కేవలం పదహారు సవంత్సరాలు మాత్రమే జీవించాడు. అయితే ఈ సంబందర్ పసి పిల్లాడిగా ఉన్నపుడు ఒక రోజు అయన తల్లితండ్రులు  ఆ ఆలయం వద్ద ఉన్న పుషరిణిలో స్థానానికి వచ్చి, పసియావాడిని ఒడ్డున ఒక చోట పడుకోబెట్టి స్నానం చేస్తుండగా పిల్లవాడు విపరీతమైన ఆకలితో ఏడవటం ప్రారంబించాడట.

nadijoshyamఅదే సమయములో ఆకాశ మార్గమున వెళ్తున్న పార్వతి పరమేశ్వరులు పసివాడి ఏడుపు విని కిందకు వచ్చారంటా. అప్పుడు పార్వతీదేవి స్వయంగా ఆ బాలుడికి తన పాలు ఇచ్చి ఒక తల్లిగా ఆ పిల్లవాని ఆకలి తీర్చిందంటా. ఆలా ఆ పసివాడు పెరిగి పెద్దవాడవుతూ, అమిత జ్ఞానవంతుడై, చిన్న తనం నుండే గొప్ప శివ భక్తుడై, శివతత్వాన్ని అందరికి ప్రబోధిస్తూ కేవలం పదగారు సంవత్సరాలు మాత్రమే జీవించి తనువూ చాలించాడట. అయితే ఆ పదహారు సంవత్సరాలలోనే అయన అనేక వేల కీర్తనలు రచించాడు. అంత చిన్న వయసులోనే అయన అంతగొప్ప జ్ఞానాన్ని సంపాదించాడు కనుకే ఆయనను తిరుజ్ఞాన సంబందర్ అని అంటారు.

nadijoshyamఇక ఆలయ స్థల పురాణానికి వస్తే, పూర్వము ఒక ముని తనకు పెద్ద జబ్బు చేయగా, పరమేశ్వరుని గూర్చి భక్తితో తపస్సు చేయగా, శంకరుడు ఒక వైద్యుని రూపములో ప్రత్యక్షమై, అతని జబ్బు నయం చేసాడని స్థల పురాణం తెలియచేస్తుంది. అందువల్ల ఈ ప్రాంతం వారు ఇంట్లో ఎవరికీ ఏ జబ్బు చేసిన ఈ వైదీశ్వరుని ఆలయానికి వచ్చి మొక్కుకుంటారు. శ్రీరాముడు జటాయువుకు ఇచ్చటనే దహన సంస్కారాలు చేసినట్లు తెలుస్తుంది. అయితే నవగ్రహ దేవతామూర్తులైన బుధుడు, కేతువుకు ఇచట విడివిడిగా ఆలయాలు కన్పించుట ఒక విశేషంగా చెబుతారు. ఇలా ఆది దంపతులైన పార్వతీపరమేశ్వరులు వెలసిన ఈ ఆలయం తమిళనాడులోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటిగా విరాజిల్లుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,580,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR