వేములవాడ రాజన్నని దర్శించిన తరువాత భక్తులు తప్పకుండ దర్శించే ప్రాచీన ఆలయం

0
5727

శివుడు కొలువై ఉన్న ప్రసిద్ద పుణ్యక్షేత్రాలలో వేములవాడ కూడా ఒకటిగా చెబుతారు. వేములవాడ లో వెలసిన ఈ రాజన్న దర్శనం తరువాత ఎక్కువ మంది దర్శించే ఆలయమే భీమేశ్వరాలయం. మరి ఇక్కడ కొలువై ఉన్న ఆ స్వామి వారు? ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకతలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Bheemeshwaralayamతెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, వేములవాడ మండలంలో శ్రీ భీమేశ్వరాలయం ఉన్నదీ. ఇది చాలా ప్రాచీన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం క్రీ.శ. 850 నుండి 985 వరకు పరిపాలించిన రెండవ యుద్ధ మల్లుని కుమారుడైన బుద్దిగ భూపతిచే నిర్మించబడినది అని తెలుయుచున్నది. ఇక వేములవాడలో రాజరాజేశ్వరాలయం తరువాత ఎక్కువ మంది దర్శించే ఆలయం ఈ భీమేశ్వరాలయం.

Bheemeshwaralayamఇక పురాణానికి వస్తే, వేములవాడ భీమకవిగా ప్రసిద్ధి చెందిన కవి పండితుడు ఈ స్వామివారి అనుగ్రహంతోనే జన్మించి, ఈ స్వామివారి అనుగ్రహంతోనే భీమకవి అనేక గ్రంథాలు రచించాడు. ఈయన ఆంధ్ర కవిశేఖరుడు అనే బిరుదు కూడా పొందాడు. ఈ ఆలయము ఆవరణలో పెద్ద మర్రి చెట్టు కలదు. ఈ వృక్షం చాలా పురాతనమైనది. ఈ వృక్షం క్రింద వటసావిత్రి వ్రతం జరుపుతారు. ఇలా ఇలా ఇది ఎన్నో ఏళ్ల నుండి జరుగుతుంది.

Bheemeshwaralayamఅయితే తూర్పుముఖంగా ఉన్న ఈ ఆలయమునందు భీమేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ రాతి స్థంబాలు గల మండపము తరువాత ఉన్నతమైన ఒక వేదిక మీద దాదాపు మూడు అడుగుల ఎత్తు గల పెద్ద శివలింగం ప్రతిష్టించబడి ఉంది. అదే భీమేశ్వర శివలింగముగా భక్తులచే పూజించబడుచున్నది. ఇక భీమేశ్వర ఆలయానికి ముందు అంజనేయస్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఉన్న ప్రతి విగ్రహం మీద భక్తులు బియ్యం చల్లుచుంటారు. ఇది జైన మతంలోని ఒక ఆచారము.

Bheemeshwaralayamఇక్కడే బద్దిపోచమ్మ అనే అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ అమ్మవారు గ్రామదేవతగా ఇక్కడి భక్తులచే ఆరాధనలు అందుకొనుచున్నది. ఈ అమ్మవారికి ప్రత్యేకంగా మాఘబహుళ అమావాస్య రోజున గొప్ప ఉత్సవము జరుపుతారు.

Bheemeshwaralayam
ఈ భీమేశ్వరాలయం లో నిత్యం ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్రం నిరంతరం శ్రావ్యముగా, భక్తజనులకు ఆలయం నలుమూలాల నుండి వినిపించబడును. ఇలా ఎంతో ప్రసిద్ధమైన ఈ దేవాలయానికి వేములవాడ రాజన్న దర్శించిన తరువాత భక్తులు తప్పకుండ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.

Bheemeshwaralayam