షుగర్ పేషెంట్లుకు కొబ్బరి వలన ప్రయోజనమా కాదా ?

ఒక్కసారి షుగర్ వచ్చిందంటే చాలు పరిమితులు పెరిగిపోతుంటాయి. అది తినకూడదు. ఇది తినకూడదు అని డాక్టర్లు సూచిస్తుంటారు. ఎక్కువగా తీపి పదార్థాలు తినకూడదంటారు. అన్నం ఎక్కువగా తినకూడదంటారు. మద్యం తాగకూడదు. నాన్ వెజ్ ఎక్కువగా తినకూడదు. ఇలా పలు రకాల పరిమితులు వాళ్లకు ఉంటాయి. ఎందుకంటే షుగర్ ఉన్నవాళ్లు క్రమం తప్పకుండా వాళ్ల షుగర్ లేవల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవాల్సి ఉంటుంది. లేదంటే చాలా కష్టం.

Coconut Beneficial For Diabetes Patientsఅందుకే సాధారణంగా ఎవరికైనా షుగర్ వ్యాధి రాగానే ఏదైనా తినాలంటే చాలా అనుమానాలుంటాయి. పండ్లు తిందామంటే ఏవి తినాలో, ఏవి తినకూడదోనన్న సందేహాలు వస్తుంటాయి. అలాగే కొబ్బరి విషయంలో కూడా పలు అనుమానాలు ఉంటాయి. కొబ్బరి నీళ్లు సహజంగా తీయ్యగా ఉంటాయి. దీంతో షుగర్ వ్యాధి గ్రస్తులు కొబ్బరి నీటిని తాగవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంది. కొంతమంది కొబ్బరి నీరు తియ్యగా ఉంటుంది కనుక రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందని త్రాగడానికి భయపడుతుంటారు.

Coconut Beneficial For Diabetes Patientsఅయితే అలాంటివన్ని కేవలం అపోహలే అంటున్నారు పరిశోధకులు. కొబ్బరి నీళ్లు తాగేవారిలో షుగర్ లెవల్స్ పెరగడానికి బదులుగా.. తగ్గుతాయని వారు స్పష్టం చేస్తున్నారు. కొబ్బరి నీళ్లలో ఉండే కేవలం మూడు గ్రాముల పీచు పదార్థం, సులువుగా జీర్ణమయ్యే ఆరు గ్రాముల పిండి పదార్థం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని.. మధుమేహ వ్యాధిగ్రస్తులు నిరభ్యంతరంగా కొబ్బరినీళ్లు తీసుకోవచ్చని పరిశోధకులు సలహా ఇస్తున్నారు.

Coconut Beneficial For Diabetes Patientsఇన్సులిన్‌కి స్పందించే గుణాన్ని మెరుగుపరచి రక్తంలో చక్కెరను తగ్గించే మెగ్నీషియం విరివిగా ఉన్నందువల్ల టైప్-2 డయాబెటీస్, ప్రీ-డయాబెటిక్స్ ఉన్నవారు కొబ్బరినీళ్లు తీసుకుంటే మంచిదని వారంటున్నారు. కొబ్బరి నీళ్ళే కాదు కొబ్బరి కూడా ధైర్యంగా తినేయొచ్చు అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. కొబ్బరిని చూస్తే ఎవ్వరికైనా నోరూరుతుంది. కొందరైతే దాన్ని అలాగే.. పచ్చిదాన్నే తినేస్తారు. ఇంకొందరు పచ్చి కొబ్బరితో వంటకాలు కూడా చేస్తారు. పచ్చి కొబ్బరి చట్నీ కూడా చేస్తారు.

Coconut Beneficial For Diabetes Patientsఅయితే.. కొబ్బరిని ఎక్కువగా తీసుకుంటే గుండె సమస్యలు వస్తాయని.. కొబ్బరి వల్ల ఎక్కువగా కొవ్వు వస్తుందని చాలామంది అంటుంటారు. కానీ.. అది నిజం కాదు. అపోహ మాత్రమే. షుగర్ ఉన్నవాళ్లు కూడా కొబ్బరిని నిరభ్యంతరంగా తినొచ్చు. ఎందుకంటే.. కొబ్బరిలో చాలా పోషకాలు ఉంటాయి. అలాగే.. కొబ్బరిలో ఉండే ఔషధ గుణాలు.. షుగర్ లేవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. కొబ్బరిలో ఎక్కువగా పైబర్ ఉంటుంది. అది షుగర్ లేవల్స్ ను కంట్రోల్ లో ఉంచడానికి ఉపయోగపడుతుంది.

Coconut Beneficial For Diabetes Patientsఅలాగే.. కొబ్బరిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు.. పైగా గుండె జబ్బులు తగ్గుతాయి. దీంట్లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండి.. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. గోధుమలు, అన్నం, జొన్నలు లాంటి వాటికన్నా కూడా కొబ్బరిలో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. అలాగే.. కొబ్బరిని తీసుకోగానే శక్తి వస్తుంది. నీరసంగా ఉన్నవాళ్లు వెంటనే యాక్టివ్ అయిపోతారు. దీంట్లో ఉండే ఔషధ గుణాలు బ్యాక్టీరియాతో పోరాడి వాటిని నాశనం చేస్తాయి.

Coconut Beneficial For Diabetes Patientsకొబ్బరిలో అధికంగా మాంగనీస్ ఉంటుంది. అది ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఇందులో ఉండే రాగి, ఐరన్ఎ ర్రకర్తకణాల వృద్ధికి సాయపడుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చాలా రోగాలను నయం చేస్తాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవాళ్లు కొబ్బరిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,450,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR