కరివేపాకు టీ మిగతా అన్నీ టీలకన్నా ఇదే బెస్ట్?

కరివేపాకుతో మనకు విడదీయరాని అనుబంధం ఉంది. భారతీయుల వంటకాల్లో పూర్వకాలం నుంచి కరివేపాకుకు విశిష్ట స్థానం ఉంది. దక్షిణ భారత వంటల్లో ముఖ్యంగా తెలుగింటి కూరల్లో కరివేపాకుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అద్భుతమైన సువాసన, రుచి కరివేపాకు సొంతం. అందుకే తెలుగింటి కూరల్లో కరివేపాకు లేకుండా ఏ కూర కూడా ఉండదంటే ఆశ్చర్యం లేదు. కూరల్లో తాలింపుగా ఉపయోగిస్తుంటారు. కరివేపాకును పొడిగా చేసుకుని నెయ్యితో కలుపుకుని అన్నం తింటే ఆ రుచే వేరు. లేదా కరివేపాకు పచ్చడి ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది.

curry leaf teaకరివేపాకుకున్న ఘాటైన పరిమళం వల్ల వంటకానికి ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది. కరివేపాకుకి ఉన్న పాప్యులారిటీ దాని ఫ్లేవర్ నుండి మాత్రమే రాలేదు, దానికి ఉన్న అమూల్యమైన హెల్త్ బెనిఫిట్స్ నుండి వచ్చింది. కరివేపాకులో విటమిన్ ఏ, విటమిన్ బీ, విటమిన్ సీ, విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్స్, కాపర్, ఐరన్, ఫైబర్ మాత్రమే కాక ఇంకా ఎన్నో ఎస్సెషియల్ న్యూట్రియెంట్స్ ఉన్నాయి. కరివేపాకు తినడం కారణంగా మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. ఇది వంటల్లో వాడుకోవడానికె కాదు.. టీ రూపంలో కూడా తాగవచ్చు.

curry leaf teaకరివేపాకుతో తయారు చేసిన టీ రోజూ తాగితే అనేక ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతిరోజు కరివేపాకు టీని తాగాలని వారు సూచిస్తున్నారు. సౌత్ ఇండియాలో కరివేపాకుల టీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. అమాటకొస్తే ఇప్పుడు దేశంలో చాలా మంది దీన్ని తాగుతున్నారు. దీన్ని తయారుచేయడం చాలా తేలిక. కరివేపాకు మనకు అన్ని చోట్లా లభిస్తుంది. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సులువు.

lemon and honey mixముందుగా 25 నుంచి 30 కరివేపాకులను తీసుకొని.. శుభ్రంగా కడగండి.. తరువాత ఓ గిన్నెలో ఓ కప్పు నీరు తీసుకుని బాగా వేడి చేయండి..మంట ఆర్పేసి.. ఆ వేడి నీటిలో కడిగిన కరివేపాకుల్ని వేయండి.. ఆకులన్నీ ఆ వేడి వేడి నీటిలో మునిగేలా చేయండి.. నీటి రంగు మారడాన్ని గమనించండి.. అనంతరం ఆ నీటిని కప్పులోకి ఫిల్టర్ చేయండి. ఈ నీటిలో తేనే, బెల్లం కలిపి తాగవచ్చు.. బెల్లం కంటే నల్లబెల్లం కలుపుకుని తాగితే అధిక ప్రయోజనం.. అంతేకాదు ఆ నీటిలో తేనే, నిమ్మరసం, కలిపి కూడా తాగవచ్చు.

skin problemsకరివేపాకు ఆకులతో టీ తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకున్నాం కదా ఇప్పుడు దానివలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా తెలుసుకుందాం. కరివేపాకు టీ తాగడం వల్ల మూత్రాశయం బాగా పనిచేస్తుంది. పొట్టలో గ్యాస్, మూత్ర విరేచనాల సమస్య నయమవుతుంది. కరివేపాకుల్లో తేలికపాటి భేదిమందు లక్షణాలతో పాటు జీర్ణ ఎంజైములుంటాయి ఇవి మీ శరీరంలోని ప్రేగు కదలికల్ని మెరుగుపర్చడంతో జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది. కరివేపాకు టీ తాగడం వల్ల కడుపులోని సమస్యలు దూరమవుతాయి. కరివేపాకులో ఉండే అరోమా..నరాల్ని రిలాక్స్ చేసి ఒత్తిడిని తగ్గిస్తుంది. రోజంతా అలసిపోయినవారు కరివేపాకు టీ తీసుకుంటే వెంటనే రిలాక్స్ అవుతారు.

stressఇక మధుమేహం సమస్య ఉన్నవారికి కరివేపాకు టీ ఓ దివ్యమైన ఔషధమే. మన శరీరంలోని సుగర్ లెవెల్స్‌ను పెంచకుండా నియంత్రిస్తుంది. గర్భిణీ స్త్రీలకు కరివేపాకు టీ చాలా మంచిది. నీరసం, వికారం వంటి సమస్యల్నించి తక్షణం ఉపశమనం లభిస్తుంది. విరేచనాలతో బాధపడుతున్నా సరే కరివేపాకు టీ బెస్ట్ మెడిసిన్‌గా పనిచేస్తుంది. ఇక అన్నింటికీ మించి కరివేపాకు ఒక బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అని చాలా మందికి తెలియదు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫెనోలిక్స్ కారణంగా చర్మాన్ని నాశనం చేసే ఫ్రీ రాడికల్స్ అంతమవుతాయి. ఆరోగ్యంగా ఉంటుంది చర్మం. చర్మంపై మంట లేదా ఇన్‌ఫెక్షన్ రాకుండా కరివేపాకు టీ సహాయపడుతుంది. కరివేపాకుల్లో ఫెనోలిక్స్, యాంటీఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి. ఇవి అడ్డమైన చర్మ వ్యాధులు రాకుండా చేస్తాయి. చర్మ కణాలు పాడవకుండా కాపాడతాయి. కాన్సర్‌ను అడ్డుకుంటాయి. బాడీలో వేడిని తగ్గిస్తాయి.

pregnant womenగర్భిణులకు కరివేపాకు టీ బాగా ఉపయోగపడుతుంది. నీరసం, వికారం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం అందిస్తుంది. క్యాన్సర్ మహమ్మారి ఫ్రీ రాడికల్స్ కారణంగా వస్తుం ది. అయితే కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ కణాలను నాశనం చేసే శక్తి ఉంటుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR