Home Unknown facts దెవ్రహ బాబా గారి జన్మ రహస్యం ఏంటో మీకు తెలుసా ?

దెవ్రహ బాబా గారి జన్మ రహస్యం ఏంటో మీకు తెలుసా ?

0

పుట్టిన ప్రతి జీవి ఏదొక రోజు గిట్టక తప్పదు. ఈ సృష్టిలో మరణం లేకుండా జీవించడం అనేది అసాధ్యం అని అంటారు. కానీ కొందరి జీవితాల్లో ఉన్న సత్యాన్ని చూస్తే అది ఎలాసాధ్యం అయిందనే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాంటి ఆశ్చర్యమే దెవ్రహ బాబా జీవితం. అసలు ఈయన ఎవరు? ఎక్కడ ఎప్పుడు జన్మించాడు అనే దానికి సరైన ఆధారాలు లేవు కానీ కొన్ని వివరాల ప్రకారం ఈ బాబా వయసు 250 సంవత్సరాలు అని? కొందరి అభిప్రాయం ప్రకారం ఏకంగా 900 సంవత్సరాలు ఉండవచ్చనే వాదన ఉంది. మరి అసలు దెవ్రహ బాబా ఎవరు? అయన వెలుగులోకి ఎలా వచ్చారు? ఆయన లోకానికి చూపించిన మహిమలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

భారతదేశంలో ప్రముఖ సిద్ద యోగులలో దెవ్రహ బాబా కూడా ఒకరు. ఈయన యమున నది ఒడ్డున నివసిస్తుండేవారు. ఈ బాబా దర్శనానికి ఆ కాలంలో రోజుకు మూడు వేలకు మందికి పైగా భక్తులు వస్తుండేవారట. అందులో కొందరు కేవలం దర్శనం కోసం వస్తే, కొందరు వారి జీవితాల్లో జరగబోయే వాటిని తెలుసుకోవాలనే ఆసక్తితో వచ్చేవారట. ఈ బాబా పుట్టుక గురించి సరైన ఆధారాలు లేవు అందుకే ఈయనను అందరు ఏజ్ లెస్ బాబా అని పిలుస్తుంటారు. ఈ బాబా ఏజ్ లెస్ బాబా గా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. అయితే భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్. రాజేంద్రప్రసాద్ గారు తన ఆటో బయోగ్రఫీ లో దెవ్రహ బాబా గురించి వ్రాసారు. అయితే రాజేంద్రప్రసాద్ గారి తండ్రి తన చిన్నతనంలో బాబా గారి ఆశీర్వాదం తీసుకున్నాడని అంటే ఇది జరిగిన 70 సంవత్సరాలకి ఆయన తన బయోగ్రఫీ లో వ్రాసారు. తన తండ్రి బాబా ఆశీర్వాదం తీసుకున్న సమయంలో బాబా గారు అప్పటికే వృద్యాప్యం లో ఉన్నారని దాదాపుగా ఆ సమయంలోనే బాబాకి 150 సంవత్సరాలు ఉండవచ్చని వ్రాసారు.

ఇక ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి జరిగే కుంభమేళా ఉత్సవానికి కొన్ని కోట్లమంది వస్తుంటారు. ఆ సమయంలో ఎక్కడెక్కడి నుండి సాధువులు, అఘోరాలు వచ్చి వెళుతుంటారు. అయితే ఇలా 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ కుంభమేళకు 12 సార్లు దెవ్రహ బాబా వచ్చారని చెబుతారు. ఈ లెక్కన చూసిన బాబా గారి వయసు 150 కి పైగానే ఉంటుందని చెబుతారు. దెవ్రహ బాబా గారు చివరి సరిగా 1989 వ సంవత్సరంలో అలహాబాద్ లో జరిగిన కుంభమేళకు వచ్చారని చెబుతారు. ఇక ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, ఈ స్వామి వారు ఎలాంటి ఆహారం తీసుకోరు. రోజు యోగ, మెడిటేషన్ లాంటివి చేస్తుంటారు. కుండలిని శక్తిలో సప్తచక్రాలు తెలిసిన ఆయన 42 సంవత్సరాల కఠోర తపస్సు తో అన్ని రకాల సిద్ధులను సంపాదించారు. ఇక ఈ గురూజీ నీటి లోపల ఉంది 30 నిమిషాలకు పైగా సాధన చేసేవారట.

దెవ్రహ బాబా గారు ఒంటి మీద జింక చర్మం తప్ప మరెలాంటి దుస్తులను కూడా ధరించరు. ఈ స్వామివారి గురించి తెలిసిన భక్తులు ఆయన దర్శనం కోసం పెద్ద సంఖ్యలో ఆయన దగ్గరికి వచ్చేవారు. ఈయన తన దగ్గరికి వచ్చిన వారితో వారి బాషలోనే మాట్లాడటం విచిత్రమైతే, వారికీ జరగబోయే విషయాల గురించి కూడా వివరించేవారు. ఇలా మన దేశంలో ఆయన ఆశీర్వాదం తీసుకున్న వారిలో ముఖ్యమైన వారు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్, డాక్టర్ రాజేంద్రప్రసాద్, అటల్ బీహార్ వాజ్ పేయ్ ఇలా ఎందరో ఈ స్వామివారి దర్శనం కోసం వచ్చేవారు. ఈ బాబా తన కాలిని వచ్చిన భక్తుల తల మీద పెట్టి ఆశీర్వదిస్తుండేవారు. ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచం నలుమూలల నుండి వచ్చి స్వామివారు చెప్పే విషయాలను తెలుసుకొని ఆశీర్వాదం తీసుకునేవారు. ఇతర దేశాల నుండి వచ్చిన భక్తులతో ఆయన వారి బాషలోనే మాట్లాడేవారు.

ఇక ఇందిరాగాంధీ గారు ఈ బాబా ఆశీర్వాదం కోసం ఎక్కువగా వస్తుండేవారట. ఎమర్జెన్సీ సమయంలో, ఓడిపోయి తిరిగి మళ్ళి అధిక మెజారిటీతో ఇందిరాగాంధీ గారి గెలుపుకు ఒకరకంగా బాబా గారు ఆమెకి జరగబోయే విషయాలను ముందే చెప్పేవారని అందుకే ఇందిరాగాంధీ గారు బాబా గారు అంటే ఎక్కువగా నమ్మెదని కొందరు చెబుతారు. కొన్ని వివరాల ప్రకారం ఈ స్వామివారు 30 సంవత్సరాలు స్మశానంలో, 50 సంవత్సరాలు అమరుకంటక్ లో, 90 సంవత్సరాలు సరయు నది ఒడ్డున తప్పసు చేసాడని, నేపాల్, చైనా, మానస సరోవర్, టిబెట్ వంటి ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాలు అక్కడే నివసిస్తూ తపస్సు చేసాడని చెబుతారు. పురాణాల గురించి, ఉపనిషత్తుల గురించి పూర్తి అవగాహనా అనేది ఈ స్వామికి ఉంది.

ఇక ఆయన చూపించిన మహిమల విషయానికి వస్తే, ఒకసారి బాబా గారు రాంనగర్ ప్రాంతంలో ఉండగా ఆయన దర్శనం కోసం అతడు తన కుటుంబంతో బాబా దగ్గరికి వచ్చారు. అతడికి చిన్న కూతురు ఉంది కానీ ఆమె మూగది. బాబా గారు ఆ అమ్మాయికి ఒక అరటిపండు ఇచ్చి తినమని చెప్పి, కాసేపట్లో మీరు వెళ్లే మార్గంలో భయంకర తుఫాను రాబోతుంది త్వరగా ఇక్కడి నుండి మీ ఇంటికి చేరుకోండి అని హెచ్చరించాడట. అప్పుడు అతడు ఆకాశం లో ఎలాంటి మార్పు లేదు తుఫాన్ ఏంటా అని తన కుటుంబాన్ని తీసుకొని ఒక పడవలో గంగ నది ధాటి ఇంటికి చేరుకున్నాకా నిజంగానే అక్కడ తుఫాన్ వచ్చినదట, ఇక కొన్ని రోజులకే ఆ ముగా అమ్మాయికి మాటలు కూడా వచ్చాయట.

ఇంకా ఒక పోలీస్ అధికారి తన కూతురికి ఎన్ని సంబంధాలు చూసిన కూడా పెళ్లి జరగట్లే అని బాధపడుతూ ఒక రోజు బాబా గారి దగ్గరకి తన పిస్తోల్ తో వచ్చారట. వచ్చిన ఆ పోలీస్ అధికారి ఏ విషయం చెప్పకముందే తన మనసులో ఉద్దేశాన్ని తెలుసుకొని ని కూతురు పెళ్లి త్వరలోనే జరుగుతుంది. అవును నీవు తెచ్చుకున్న తుపాకీ నిజమైనదా లేదా బొమ్మ తుపాకిన అని అడుగగా అప్పుడు వెంటనే ఆ పోలీస్ బొమ్మది నేను ఎందుకు తీసుకువస్తాను ఇది నిజమైన తుపాకీ అంటూ బదులిచ్చాడట.అప్పుడు బాబ్ గారు అవునా ఒకేసారి తుపాకిని పేల్చి చూడు అని చెప్పగా ఆ పోలీస్ అధికారి ఎంత ప్రయత్నించినా అది పేలకపోవడంతో స్వామి ని క్షమించమని అడుగగా, మనం ఎప్పుడు కూడా మనకి ఉన్న శక్తులను చూసుకొని ధైర్యంగా ఉండరాదు ఇప్పుడు పేల్చి చూడు అనగా అప్పుడు ఆ తుపాకీ పనిచేసింది. ఇలా బాబా గారి ఆశీర్వాదం తీసుకున్న కొన్ని రోజుల్లోనే ఆ పోలీస్ అధికారి కూతురికి పెళ్లి జరిగిందట. ఇలాంటి ఎన్నో మహిమలు రాబోయే రోజులో జరిగే విషయాలను ఆయన చెప్పేవారు.

ఇలా ఇన్ని సంవత్సరాలైనా ఈ స్వామివారు బ్రతికే ఉన్నారని ప్రపంచానికి తెలియగ ఒక రష్యా కి చెందిన రిపోర్టర్ బాబా గారిని ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చి ఆయన చెప్పిన విషయాలు తెలుసుకొని భక్తుడిగా మారిపోయాడట. అయితే ఆ రిపోర్టర్ ఏమని అడిగారంటే,

మొదటి ప్రశ్న: మీ వయసు ఎంత ఉంటుంది? దానికి బాబా గారు చెప్పినా సమాధానం ఏంటంటే, నాకు వయసు అంటూ లేదు, నేను శ్రీకృష్ణుడి అనుగ్రహంతో యమున నదిలో జన్మించాను అని చెప్పారు.

రెండవ ప్రశ్న: యుగాంతం వస్తుంది అని అంటున్నారు? ఈ భూ ప్రపంచం నాశనం ఎప్పుడు అవుతుందా అని అడుగగా? అప్పుడు బాబా గారు అది సృష్టి రహస్యం దానికంటూ ఒక సమయం వస్తుంది, నేను మనిషి జీవితంలో జరిగే మంచి విషయాలు గురించి మాత్రమే చెబుతాను, దానికోసమే ఎప్పుడు ప్రార్థిస్తుంటాను అని చెప్పాడట. ఇలా సోవియెట్ యూనియన్ గురించి రష్యాలో జరిగె వాటి గురించి ఆ ఇంటర్వ్యూలో చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారంటా బాబా గారు.

ఇలా భారతదేశంలో ఉన్న ప్రముఖ సిద్ద యోగులలో ఒకడిగా చెప్పే దెవ్రహ బాబా ఎప్పుడు పుట్టాడో తెలియదు కానీ చరిత్ర ప్రకారం ఆయన 250 సంవత్సరాలు బ్రతికారని చెబుతారు. ఇలా చివరకు 1990 మే 19 వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని వ్రినధావన్ అనే ప్రాంతంలో జీవ సమాధి పొందారు. ఇప్పటికి ఆయన జీవసమాధి ఉన్న ప్రదేశానికి ఎందరో భక్తులు వచ్చి ఆ బాబా గారి సమాధిని దర్శిస్తారు. ఇది ఇలా ఉంటె అసలు ఒక యోగి సిద్ది పొంది ఎలాంటి ఆహారం లేకుండా ఇన్ని సంవత్సరాలు బ్రతికే అవకాశం ఉందా? అన్ని సిద్ధులను పొంది ఎన్నో విషయాలను ప్రజలకు చెప్పిన ఆయన నిజంగా అన్ని సంవత్సరాలు జీవించాడు అనడాకి కొన్ని బలమైన కారణాలు ఉండగా దీనివెనుక శక్తి ఏంటనేది ఎవరు కూడా తెలుసుకోలేకపోయారు. ఇప్పటికి దెవ్రహ బాబా గారి జన్మ రహస్యం అనేది ఒక మిస్టరీగానే ఉండిపోయింది.

Exit mobile version