ప్రెగ్నెన్సీ సమయంలో ప్రయాణం చేస్తే ఏం జరుగుతుంది?

0
740

మహిళలకు అమ్మ అవడం అనేది గొప్ప వరం. ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే ఆ ఇంట్లో ఒక పండగలా ఉంటుంది. కానీ ఈ సమయంలో చాలా సందేహాలు వస్తుంటాయి. ఏం తినాలి, ఏం తాగాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా అన్ని విషయాల్లో కంగారు పడుతుంటారు. ముఖ్యంగా గర్భం ధరించిన స్త్రీ ప్రయాణం చేయకూడదనీ, ప్రయాణం చేస్తే గర్భ విచ్ఛిత్తి అవుతుందన్న భయం చాలా మందిలో ఉంది.

pregnant womenగర్భవతి ప్రయాణం చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయన్న అభిప్రాయమూ ఎందరిలోనో ఉంది. కానీ, వర్తమాన సమాజంలో స్త్రీలు కూడా ఎంతో కీలకమైన ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి ప్రయాణాలు చేయడం తప్పదు. మరి ప్రెగ్నెన్సీ సమయంలో ప్రయాణం చేస్తే ఏం జరుగుతుంది? గర్భానికి ఏమైనా ప్రమాదం ఉందా? అనే విషయాలు తెలుసుకుందాం.

pregnant womenప్రెగెన్సీ సమయంలో కొన్ని కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ప్రయాణం అంటే కాబోయే తల్లికి కొంచెం ఆందోళనగా ఉంటుంది. ముఖ్యంగా గర్భం దాల్చినట్లు కన్ఫామ్ కాగానే ప్రయణాలను దూరం పెట్టాలని 5 నెలల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ దూర ప్రయాణాలు చేయకూడదని స్పష్టం చేస్తున్నారు.

pregnant womenగర్భవతిగా ఉండటం అన్నది ప్రయాణాలకు ఏమాత్రం అడ్డంకి కాదు. అయితే అవసరాన్ని బట్టి కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. ఇప్పుడున్న ఆహార అలవాట్ల వల్ల చాలా మందికి మిస్ క్యారేజ్ అయ్యే ప్రమాదం ఉంటోందని వివరిస్తున్నారు. కొన్ని సంద‌ర్భాల్లో ప్ర‌యాణాలు చేయ‌క‌పోవ‌డ‌మే మంచిది.

pregnant womenతలనొప్పిగా ఉన్నా, కడుపులో ఎటువంటి అసౌకర్యం కల్గినా ప్ర‌యాణాలు చేయ‌క‌పోవ‌డ‌మే మంచిది. ఎందుకంటే, అలాంటి స‌మ‌యంలో ప్ర‌యాణం మీకు మ‌రింత అసౌక‌ర్యాన్ని క‌లిగిస్తుంది. ఇక తప్పనిసరిగా ప్రయాణాలు చేయాల్సి వస్తే.. వాహనం సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రయాణ సమయంలో కచ్చితంగా వైద్య పరీక్షల రిపోర్టులు దగ్గర ఉంచుకోవాలని చెబుతున్నారు.