గర్భంతో ఉన్నవాళ్లు కుంకుమ పువ్వును ఏ నెలలో ఎంత తీసుకోవాలి?

కుంకుమ పువ్వు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యము. కుంకుమ పువ్వు రంగు పదార్ధంగాను, సువాసనకారిగాను అనేక తినుబండారాలు, తాంబూలంలోనూ వాడతారు. కుంకుమ పువ్వు నేత్ర వ్యాధులలోను, ముక్కు సంబంధమైన వ్యాధులలోను మందుగా పనిచేస్తుంది. యాభైకి పైబడుతున్నవారు ఆహారంలో కుంకుమపువ్వు తీసుకుంటే కంటికి మేలని వైద్యుల సూచన. ప్రతిదినం కుంకుమ పువ్వును, తేనెను తెల్లవారుఝామున సేవిస్తే ధాతుపుష్టికి, వీర్యవృద్ధికి పనిచేస్తుంది. కుంకుమ పువ్వు గంధంలా తయారుచేసి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గి, చర్మం సున్నితంగా ఆకర్షణీయంగా తయారవుతుంది. కుంకుమ పువ్వులో క్రోసిన్, క్రోసిటిన్, పిక్రో క్రోసిన్ మొదలైన గ్లూకోసైడులు ఉన్నాయి. వీటితో పాటు బీటా, గామా కెరోటిన్ లు, లైకోఫీనులు ఉన్నాయి.

కుంకుమ పువ్వుముఖ్యంగా కుంకుమ పువ్వు గర్భిణులు ఆహారంలో తీసుకుంటే పుట్టే బిడ్డ నల్లగానో, చామనఛాయతోనో కాక తెల్లగానో, ఎర్రగానో పుడతుందని విశ్వాసం. మరి నిజంగానే గర్భంతో ఉన్నప్పుడు కుంకుమపువ్వు తీసుకోవడం తల్లికీ, పుట్టబోయే బిడ్డకు ఆరోగ్యకరమా? గర్భవతిగా ఉన్నప్పుడు కుంకుమపువ్వు ఎప్పుడు తీసుకోవాలి? ఎంత తీసుకోవాలి? పుట్టబోయే బిడ్డపై ఏమైనా ప్రభావం చూపుతుందా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కుంకుమ పువ్వుప్రగ్నన్సీతో ఉన్నప్పుడు కుంకుమపువ్వు తీసుకోవడం మంచిదేనా అంటే మంచిదేనని చెబుతున్నారు నిపుణులు. గర్భవతిగా ఉన్నపుడు రెండో నెల నుండి ఐదో నెల వరకు వాంతులు, వేవిళ్ల కారణంగా ఆహారం తీసుకోవడానికి ఇష్టపడరు. అందుకని పాలలో కుంకుమపువ్వు కలిపి ఇవ్వడం వలన ఇష్టంగా తాగుతారు మరియు ఇది ఆకలిని పెంచుతుంది. ఇతర వైద్య విధాన డాక్టర్లు చెప్పినదాని ప్రకారం గర్భిణులు ఐదో నెల నుంచి కుంకుమ పువ్వు తీసుకోవచ్చు. అప్పటికే గర్భంలో శిశువు కదలడం ప్రాంభమవుతుంది, అలాగే గర్భం నిలబడుతుంది. కుంకుమ పువ్వు ని తక్కువ మోతాదులో గర్భిణులు సేవిస్తే, దానిలోని ఔషధ గుణాల వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి.

కుంకుమ పువ్వుకుంకుమపువ్వులోని ఔషధ గుణాలు జీర్ణ కోశాన్ని శుభ్రపరచడం , రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడం, ఆకలిని పెంచటంతో పాటు జీర్ణక్రియకు సహాయ పడతాయి. కుంకుమపువ్వులో ఉన్న క్రోసిన్, సఫ్రానల్‌ లకు రక్తపోటును నియంత్రించే లక్షణాలను కలిగి ఉన్నాయి. సాధారణంగా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు, పెరుగుతున్న బిడ్డ కోసం స్థలం కల్పించే ప్రక్రియ లో కండరాలు, ఎముకలు విస్తరిస్తాయి. దీని వల్ల కీళ్లలో, పొట్టలో నొప్పి, తిమ్మిరిగా అనిపించ వచ్చు. కుంకుమ పువ్వు లోని నొప్పిని నివారించే లక్షణాలు గర్భిణీ కి నొప్పులు , తిమ్మిర్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గర్భధారణ సమయంలో ఆందోళన, మిశ్రమ భావోద్వేగాలు కలగడం సహజం. యాంటీ-డిప్రెసెంట్ గా పిలవబడే కుంకుమపువ్వు మీ మానసిక స్థితిని ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది. గర్భిణుల్లో కొందరికి రాత్రి సరైన నిద్ర పట్టక అవస్థ పడుతుంటారు. పడుకోబోయే ముందు పాలతో కుంకుమ పువ్వు కొద్దిగా తీసుకుంటే, అందులో ఉండే ఉపశమన, హిప్నోటిక్ గుణం వల్ల హాయిగా నిద్ర పడుతుంది.

కుంకుమ పువ్వుఅయితే డ్రగ్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ చెప్పినదాని ప్రకారం, అధిక మొత్తంలో కుంకుమ పువ్వు తీసుకుంటే గర్భాశయం సంకోచించడం, థ్రోంబోసైటోపెనియా, రక్తస్రావం, గర్భస్రావం వంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. అందుకని ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఒక గ్లాస్ వేడిపాలలో చిటికెడు అంటే 10 గ్రాములకు మించకుండా కలిపి తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన రెండవ నెల నుండి కుంకుమపువ్వును తీసుకోవచ్చని నిపుణులు, పెద్దవాళ్ళు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్ లో నాసిరకం కుంకుమపువ్వు దొరుకుతున్నాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

కుంకుమ పువ్వుకుంకుమపువ్వు కషాయం చాలా చిక్కగా ఉంటుంది. దాన్ని ప్రజలు ఒత్తిడి తగ్గించుకోడానికి, బరువు తగ్గించుకోడానికి, స్వీట్స్ తినాలనే అతి వాంఛని తగ్గించుకోడానికి వాడతారు. అయితే, గర్భణిగా ఉన్నప్పుడు కషాయం సురక్షితమో కాదో చెప్పే శాస్త్రీయ పరిశోధనలు లేవు. అందువల్ల, క్రోసిన్, సఫ్రానల్ సమ్మేళనాలు అధికంగా ఉన్నందున కషాయాన్ని తీసుకోకపోవడమే మంచిది.

కుంకుమ పువ్వుఇక పిల్లలు అందంగా, ఎర్రగా పుడతారని అందుకే కుంకుమపువ్వు తీసుకోవాలని అంటుంటారు. అది అపోహ మాత్రమే అని, పిల్లలు పుట్టడం అనేది తల్లితండ్రుల జీన్స్ పై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా గర్భవతిగా ఉన్నప్పుడు కుంకుమపువ్వు తగిన మోతాదులో తీసుకోవడం ఆరోగ్యకరమే కాబట్టి వైద్యులను సంప్రదించి తగిన మోతాదులో తీసుకోవడం ఉత్తమం.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
591,000FollowersFollow
1,320,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR