ప్యాంటు వెనుక జేబులో పర్సు పెట్టడం ఇంత ప్రమాదమా?

చెడు అలవాట్లు ఆరోగ్యానికి హాని చేస్తాయని మనందరికీ తెలిసిందే. కానీ చెడు అలవాట్లు అంటే మందు తాగడం, సిగరెట్ కాల్చడం మాత్రమే అనుకుంటారు చాలా మంది. కానీ అవే కాదు మన ఆరోగ్యానికి హాని చేసే ఏ అలవాటు అయినా కూడా చెడు అలవాట్ల కిందకే వస్తాయి. నిజం చెప్పాలంటే అవి చెడ్డ అలవాట్లు అని కూడా మనకు తెలియదు. అలాంటి ఒక అలవాటే పర్స్ వెనుక జేబులో పెట్టుకుని నడవడం.

purse in back pocketమగవారంతా బయటకి వెళ్ళేప్పుడు ఖచ్చితంగా పట్టుకెళ్లే ముఖ్యమైన వస్తువు పర్సు. అందులో ఎక్కువ శాతం పర్సుని తమ ప్యాంటు వెనుక జేబులో పెట్టుకుంటారు. మొదట్లో అయితే పర్సుని సులువుగా తియ్యోచ్చని అలా పెట్టుకునేవారు. రానురానూ అదొక ఆనవాయితీలాగా అయిపోయింది. సెల్‌ఫోన్ వాడకం పెరిగాక ఫోన్ కూడా వెనుక జేబులోనే పెట్టేస్తున్నారు. అయితే ఇలా పర్సుని, సెల్‌ఫోన్‌ని వెనుక జేబులో పెట్టుకోవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి.

cell phoneపర్సు వెనుక జేబులో పెట్టుకోవడం వలన ఇబ్బంది ఉండదు. కానీ పర్స్ అలాగే ఉంచి కూర్చోవడం వలన మాత్రం వెన్నెముక కచ్చితంగా బెండ్ అవ్వాల్సి ఉంటుంది. దీనివలన వెన్నెముక వంగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సియాటిక్ నెర్వ్ నొప్పికి ఇది కూడా కారణంగా ఉంటుంది. ఇలా చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు పడవలసి ఉంటుంది. మనీ పర్స్ మరియు చిన్న చిన్న వస్తువులను వెనుక జేబులో ఉంచుకొని అలానే గంటల తరబడి కూర్చోవడం వలన, స్థాన భ్రంశం నుండి కదలని కారణంగా పొత్తికడుపు, వెన్నెముక మరియు నడుము నొప్పి సమస్యతో బాధపడవలసి వస్తోంది.

back painముఖ్యంగా న‌డుముపై తీవ్ర ఒత్తిడి ప‌డుతుంది. ఒత్తిడి ఎక్కువైతే ఖచ్చితంగా నడుమునొప్పి వస్తుంది. పర్సుని, ఫోన్‌ని అలా వెనుక జేబులో పెట్టుకుని కూర్చున్నప్పుడు రెండు పిరుదులు సమానంగా ఆనుకోవు. ఒకటి పైకీ, ఇంకొకటి కిందకీ ఉంటుంది. దీనివల్ల వెన్నుపూస ఒక వైపుకి వంగిపోతుంది. దీని వల్ల తొడ కండరాలు పట్టేస్తాయి. నరాలు పట్టి లాగినట్లు అనిపిస్తాయి. ఎక్కువకాలం అలాగే పెట్టుకుని ఉంటే సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. ఆఫీస్, సుదూర ప్రాంతాలకు వెళ్తున్నప్పడు, గంటలు గంటలు ఒకేచోట అలానే కూర్చున్నప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

back painఅలా వెనుక జేబులో పర్సు పెట్టుకోవడం వల్ల ఎక్కడైనా టక్కున కూర్చున్నాం అంటే దెబ్బ గట్టిగా తగులుతుంది. ఫోన్ అయితే గ్లాస్ పగిలే ప్రమాదం లేకపోలేదు. అంతేకాకుండా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. పర్సుని, ఫోన్‌ని జేబులో పెట్టుకుని బండి నడుపుతుంటే.., డ్రైవింగ్ చేసేప్పుడు మార్గ మధ్యంలో జేబులో నుంచి జారీ పడిపోయే ప్రమాదం కూడా ఉంది. అందరికీ తెలిసిన నష్టాలలో… మొదటిది దొంగల బెడద. వెనుక జేబులో పర్సు పెట్టుకుని తీరిగ్గా ఫోన్ మాట్లాడటమో, లేక మరేదైనా పనిలోనో ఉండిపోతే చాలు దొంగలు దర్జాగా దోచుకెళ్తారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,580,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR