వివాహం ఆలస్యం అవుతుందా? ఇవి కూడా కారణం కావొచ్చు!!!

మానవ జీవితంలో పెళ్లికి ఎంతో ఉన్నతమైన స్థానముంది. రెండు జీవితాలను ఒక్కటిగా చేసే మహత్కరమైన ఘట్టం. అయితే నేటి తరంలో చాలా మందికి వివాహం పెద్ద సమస్యగా మారింది. పెళ్లి ఆలస్యం కావడం, ఎన్ని సంబంధాలు చూసినా జాతకాలు కుదరక చెడిపోవడం జరుగుతున్నాయి.

jyotishyaవివాహమనేది ఒక్కొక్కరి వారి సాంప్రదాయ పద్ధతులలో నిర్వహిస్తూ ఉంటారు. అయితే పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని చెబుతూ ఉంటారు.
కొందరికి ఒక్కసారి పెళ్లి చూపులకు పెళ్లి కుదరడం జరుగుతుంది. మరికొందరికీ ఎన్ని సంబంధాలు వచ్చినా ఎన్ని రోజులకు పెళ్లి కుదరదు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా కూడా అమ్మాయిలు దొరకడం చాలా కష్టంగా ఉంది. దీంతోపాటు ప్రతి ఒక్క అమ్మాయి తనకు కాబోయే భర్త ఒక గొప్ప స్థాయిలో ఉండాలని భావించడం వల్ల ఎంతో మంది అబ్బాయిలకు పెళ్లి కుదరడంలేదు.

kuja doshaవాస్తు ప్రకారం మన ఇంటిలో కొన్ని మార్పులు చేయడం వల్ల వివాహ ఘడియలు దగ్గర పడతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వివాహం కాని అబ్బాయిల ఇంట్లో పడకగది ఎప్పుడు కూడా ఈశాన్య దిక్కున ఉండడంవల్ల వారికి వివాహం ఘడియలు దగ్గర పడతాయి.

marriageవారి ఇంట్లో అలాంటి అనుకూలత లేకపోతే దక్షిణం వైపు లేదా పడమర వైపు పడుకోవడం వల్ల వివాహం తొందరగా జరుగుతుంది. పడుకునేటప్పుడు వారి మంచం కింద ఇనుప వస్తువులు ఉండడంవల్ల వివాహంలో సమస్యలు ఎదురవుతాయి.

మన ఇంటి నైరుతి దిశలో పొరపాటున నీటి నిల్వ ఉన్న ట్యాంకులను పెట్టడం వల్ల వివాహం ఎప్పటికీ కుదరదు, అలాంటి నీటినిల్వ సామర్థ్యం ఉన్న వాటిని వీలైనంత వరకు నైరుతిదిశలోనుండి తీసేయడం మంచిది.

room bedకుజదోషంతో చాలా మంది అనేక సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఫలితంగా కొందరికి వివాహం ఆలస్యంగా జరుగుతుంది. అలాంటి వారు నవగ్రహాల కు వెళ్లి కుజ దోష నివారణ పూజలు లేదా హోమాలు చేయించడం వల్ల కుజ దోష నివారణ జరిగి వివాహం జరిగే అవకాశం ఉంటుంది.

అంతేకాకుండా రాహు కేతు పూజలు చేయించడం వల్ల వివాహం తొందరగా జరుగుతుంది. ఇలాంటి కొన్ని నియమాలను పాటించడం ద్వారా వివాహం తొందరగా జరిగి వారి జీవితం ఆనందమయంగా ఉంటుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR