ధర్మశాస్త పేరు కన్నా అయ్యప్పస్వామి పేరుకే విశేష ప్రాచుర్యం ఎందుకో తెలుసా ?

‘అయ్యప్ప’ హిందూ దేవుళ్లలో ఒకరు. ఈయనను హరిహరసుతుడని, ధర్మశాస్త, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య = విష్ణువు, అప్ప = శివుడు అని పేర్ల సంగమంతో ‘అయ్యప్ప’ నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. శబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే “కుళతుపుళ”లో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. “అచ్చన్ కోవిల్”లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు. శబరిమలై లో ఉన్న మూల విగ్రహం ధర్మశాస్త్ర స్వామిదా, అయ్యప్ప స్వామిదా అంటే అది ముమ్మాటికీ “ధర్మశాస్తా ది అయ్యప్ప స్వామిది కాదు” . ధర్మశాస్త పేరు కన్నా అయ్యప్పస్వామి పేరుకే విశేష ప్రాచుర్యం కలిగింది.

అయ్యప్పస్వామి ఈ భూలోకంలో ధర్మశాస్తా కు అనేక ఆలయాలు ఉన్నాయి, అనేక పేర్లతో” ధర్మశాస్తాన్ని” పిలవడం జరుగుతుంది. ” ధర్మశాస్తా శివపార్వతుల” సంరక్షణలో పెరిగి కైలాస నివాస “సరస్వతిదేవి” వద్ద విద్యాభ్యాసం చేసిన వాడు ధర్మశాస్.త ఇతనికి శివుని వలే” విభూతి రేఖలు జడలు, జటామండలం 10 చేతులు ఆయుధాలు సింహాసనం పూర్ణ పుష్కల భార్యలతో నిండు యవ్వనంతో వెలుగొందుతాడు”. ఈ భూలోకంలో ధర్మశాస్తా కు అనేక మంత్రాలు బీజాక్షరాలు మంత్రాలు తంత్రాలు అనేకం వాటితోపాటు” శివ పురాణం బ్రహ్మాండ పురాణం స్కాందపురాణం గణేశ పురాణం” వంటి మహా, పురాణాలలో వీరి గురించి ప్రస్తావన ఉంది.”

అయ్యప్పస్వామిభూతప్రేతాలకు పంచభూతాలకు ఆదినాయకుడు” ధర్మశాస్తా. ధర్మరక్షణ కోసం యుద్ధం చేసినప్పుడు ధర్మశాస్త సహకారం తప్పకుండా ఉంటుంది. ఇతడు అన్ని యుగాలలో ఉన్నాడు.” పంచభూతాలకు సూర్య చంద్రాది గ్రహాలకు ఇంద్రాది దేవతలకు” నిరంతరం తోడుంటాడు.

అయ్యప్పస్వామి ధర్మశాస్త భూలోకంలో అవతరించి మణికంఠుని గా పిలవబడ్డాడు అయ్యప్పగా భూలోక వాసులకు పరిచయమయ్యాడు, మహిషిని సంహరించాక ఇంతటి ఘన కార్యాన్ని సాధించాడు, కాబట్టే అయ్యప్ప గా ప్రాచుర్యం కలగడమే ధర్మం అని ధర్మానికి నాయకుడైన ధర్మశాస్తా భావించాడు. ఈ విషయాన్ని గురించి ఆదిశంకరులు లోకవీరం మహా పూజ్యం అనే నమస్కార శ్లోకాలలో” మణికంఠ మీతిక్యాతిo వందేహం శక్తి వందనం” అని స్పష్టంగా తెలియజేశారు. దీని అర్థం ఏమిటంటే? మణికంఠుడు గా ప్రసిద్ధి పొందిన “శక్తిస్వరూపిణి” యొక్క పుత్రునికి నమస్కరిస్తున్నాను, అని “ఆదిశంకరాచార్యులు” తెలిపారు.

అయ్యప్పస్వామిఅయ్యప్ప స్వామి భక్తులు మరొక ఒక విషయం తెలుసుకోవాలి అదేమిటంటే శబరిమలలో సంవత్సరకాలం పాటు ధర్మశాస్తా రూపంలో మూల విగ్రహం కనిపిస్తుంది మకర సంక్రాంతి రోజు ఆభరణాలు వేసిన తర్వాత ధర్మశాస్తా మణికంఠుని రూపంగా దర్శనభాగ్యం కల్పిస్తాడు. అప్పుడు ధర్మశాస్తా ఎదురుగా ఉన్న మేరుపర్వతంకాంచనాద్రి ,కాంతగిరికొండపై నుంచి “జ్యోతిరూపంలో ప్రకాశిస్తాడు” . మరుసటి రోజు నుంచే ధర్మశాస్తాగా దర్శనం ఇస్తాడు. ఇప్పుడు అయ్యప్ప రూపం కనిపించదు ధర్మశాస్తా రూపం అదే. “జ్యోతి” చూసిన తర్వాత “అయ్యప్ప స్వామి” దర్శనం చేసుకుంటే ఆ రూపం వారికి స్పష్టంగా కనిపిస్తుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,670,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR