ద్రౌపతి అయిదుగురిని వివాహం చేసుకోవడానికి పూర్వ జన్మ రహస్యమే కారణమా?

చాలామంది ద్రౌపది గూర్చి చాలా అసత్య వ్యాఖ్యాలు చేస్తుంటారు.. ద్రౌపది పంచ మహా పతివ్రతలలో ఒకరు.. మరి ఆమె ఎందుకు అయిదు మందిని వివాహం చేసుకోవలసి వచ్చిందో చాలా మందికి తెలియదు. సినిమాలలో దుర్యోధన పాత్ర దారి వ్యాఖ్యానాలు “పాంచాలి పంచ భర్త్రుక” అని విని.. మనం ఆమె గొప్పతనాన్ని అర్థం చేసుకోలేక పోతున్నాము..నిజానికి ద్రౌపది అయోనిజ.. ఆమె అందరిలాగా మాతృ గర్భంలో నుండి పుట్ట లేదు.. ద్రుపదుడు చేసిన యజ్ఞ ఫలంగా ఆమె జన్మించింది.. ఆమె పేరు కృష్ణ, ఏక వస్త్ర..

draupathiద్రౌపది పూర్వ జన్మలో ఒక కుష్టు వ్యాధిగ్రస్తునికి ధర్మ పత్ని..ఆమె పేరు నలయని.. భర్తకు అన్ని విధాల పరిచర్యలు చేసేది. ధర్మం తప్పకుండా జీవించేది…ఒకరోజు ఆమె తన భర్త అయిన ముద్గాల్యుడికి వడ్డించిన భోజనం పూర్తి కాగానే.. ఆమె భర్త యొక్క బొటన వ్రేలు.. అందులో ఊడి పడింది.. దానిని ఆమె పక్కకు తీసి వేసి .. ఆ శేషాహారాన్ని భుజించింది.. ఆమె పతి భక్తికి తపస్సుకు మెచ్చి..ఆమె భర్త ఏమి కావాలో కోరుకునుము అనగా.. పతి భిక్ష అని అయిదు మార్లు అనగా భర్త తథాస్తు అన్నాడు.. భర్త వర ప్రభావంతో ఆమె కోరుకున్నవి అన్ని జరిగాయి. ఆమె భర్త అయిదు రూపాలు ధరించి ఆమెను ఆనందింప చేసేవారు.. ఆ ఋషి ప్రాపంచిక సుఖాలను, ఆమెను వదలి తపస్సుకు వెల్లిపోతుండగా వెళ్ళవద్దని ఆమె ప్రాదేయ పడింది… చివరకు ఆమె కూడా శివుని గూర్చి తపస్సు చేయగా శివుని వర ఫలాన..మరు జన్మలో ఆమెకు పాండవులు అయిదుగురు పతులుగా లభించారు..

draupathiద్రుపద మహారాజు ద్రోణుడి మీద ప్రతీకారం తీర్చుకునేందుకు పుత్రసంతానం కోసం యజ్ఞం చేస్తాడు. యజ్ఞ ఫలంగా అగ్ని గుండం నుండి మొదట పుత్రుడు దృష్ట్యాద్రుమ్ జన్మిస్తాడు. తర్వాత ఆడసంతానం ద్రౌపతి జన్మిస్తుంది. ఆడపిల్లలు ఇష్టం లేని ద్రుపద మహారాజు తనను స్వీకరించడు. దేవతలకు కోపం వచ్చి అగ్ని రూపంలో తనను చుట్టుముడతారు. తప్పేది లేక స్వీకరిస్తాడు కానీ కోపంలో అడుగడుగునా అవమానాల పలు అవుతావని కూతురిని శపిస్తాడు. కొద్ది రోజులకు శ్రీకృష్ణుడు పాంచాల రాజ్యం మీదికి యుద్ధానికి వస్తాడు. శ్రీకృష్ణుని సుదర్శన చక్రం ద్రుపద మహారాజు మీదికి ఒదులుతాడు. ప్రాణసంకట పరిస్థితులలో ద్రౌపతి అడ్డు నిల్చుంటుంది. శ్రీకృష్ణుడు ద్రౌపతిని చూసి శాంతిస్తాడు. తన కూతురు ప్రేమ తెలుసుకొని అప్పటి నుండి ద్రుపద మహారాజు తనని అపురూపంగా చూసుకుంటాడు. కానీ తండ్రి శాపం వల్ల ఆమె జీవితాంతం అవమానాలు ఎదుర్కొంది.

draupathiమత్స్య యంత్రాన్ని చేధించిన అర్జునుడు ఆమెను తీసుకుని.. తల్లి దగ్గరికి వెళ్లి ఫలం తెచ్చాము అని చెప్పారు.. అన్య మనస్కురాలిగా ఉన్న కుంతి.. అందరూ సమంగా పంచుకోండి అని సెలవిచ్చింది..ఇది విని నిర్ఘాంత పోయిన అందరూ.. ఒక స్త్రీ అయిదుగురికి పత్నియా అని.. ధర్మం చేయవలసిందిగా వేదవ్యాసున్ని తలచుకోగా.. ఆయన ద్రౌపది పూర్వ జన్మ వృత్తాంతాన్ని వివరించారు.. ఆమె జన్మ వృత్తాంతం పూర్తిగా తెలియాలి అంటే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది..అయిదుగురు పతులు ఉన్న ఆమె పతివ్రతయా అని మీరు నవ్వ వచ్చు..

draupathiఆమె శివును వర బలాన ఒక పతిని సేవించిన తరువాత ఇంకో పతిని సమీపించే సమయానికి.. ఆమె పూర్వ జన్మ తపోబలం వలన.. ఆమె పాతివ్రత్యం, శీలం ఏ మాత్రం కోల్పోకుండా తిరిగి పొందగలుగుతుంది..

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR