Home Health పీరియడ్స్ త్వరగా ఆగిపోవటం డయాబెటిస్ కి కారణమా

పీరియడ్స్ త్వరగా ఆగిపోవటం డయాబెటిస్ కి కారణమా

0

ఒంటికి చిన్న గాయమైతేనే మనం ఓర్చుకోలేం. అలాంటిది నెలలో ఐదు రోజులు మాత్రం మహిళలకు ఇబ్బంది కలిగించడమే కాకుండా చికాకు పెట్టే అంశం నెలసరి. మహిళల్లో ఎంతో ముఖ్యమైన ఈ ప్రక్రియ క్రమపద్ధతిలో లేకపోయినట్లయితే ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొందరికి తీవ్ర రక్తస్రావం, కడుపునొప్పి లాంటి సైడ్ ఎఫెక్టులు ఇబ్బందిని కలిగిస్తాయి. కానీ రుతుస్రావం లేదా మోనోపాజ్ వల్ల మహిళలకు టైప్-2 డయాబెటిస్ కూడా వచ్చే ప్రమాదముందట.

periods the cause of diabetes40 ఏళ్లకు ముందే రుతుస్రావం ఆగిపోతే దాన్ని ఎర్లీ మోనోపాజ్ అని అంటారు. వైద్య అవసరాలకు అండాశయాలు తొలగించినట్లయితే అప్పుడు కూడా రుతుస్రావం ఆగిపోవచ్చు. అయితే ఇలా ఏ కారణంతో అయినా పీరియడ్స్ ఆగిపోయినట్లయితే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్ది ఆడవారిలో సెక్స్ హార్మోన్ ఈస్ట్రోజన్ స్థాయి తగ్గిపోతుంది. ఫలితంగా రుతుస్రావం సరిగ్గా కాకపోవచడం, సరైన సమయానికి అండం విడుదల కాకపోవడం లాంటివి సంభవిస్తాయి. ఈ దశనే మోనోపాజ్ అని అంటారు. మెనోపాజ్ కు సగటు వయసు 45 ఏళ్లు.

అలా కాకుండా మహిళల రుతుస్రావ ప్రకియ 40 ఏళ్లకు ముందే ఆగిపోయినట్లయితే టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం 4 రెట్లు ఎక్కువ ఉందని ఓ అధ్యయనంలో తేలింది.

ఒకవేళ ఇంతకుముందే మహిళలకు టైప్-2 డయాబెటిస్ ఉన్నట్లు నిర్దారణ అయినట్లయితే ఆమె ప్రీమెచ్యూర్ మోనోపాజ్ ను అనుభవించాల్సి ఉంటుంది. ఇందుకు కుటుంబ చరిత్ర, వయస్సు, ఉబకాయం లాంటివి కూడా ప్రధాన కారకాలుగా పరిగణిస్తారు.

 

Exit mobile version