డైటింగ్ ఎక్కువ కాలం చేయడం మంచిది కాదా?

మారుతున్న జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా అన్నీ వయసుల వారు ఎదుర్కున్న సమస్య అధిక బరువు.  ప్రధానంగా కరోనాతో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ , విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల కల్చర్ పెరగడంతో ఈ సమస్య మరింత అధికమైంది. వ్యాయామం లేక చాలా మంది ఊబకాయం బారిన పడుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఈ సమస్యతో బాధపడుతున్న మహిళలు, తమ శరీరాన్ని చురుకుగా, స్లిమ్‌గా ఉంచుకునేందుకు పాటించని చిట్కాలు లేవు. ఏం చేసినా బరువు తగ్గని వారు డైటింగ్‌లంటూ కడుపు మాడ్చుకోవటాన్ని కూడా మనం చూస్తుంటాం.
అసలు డైటింగ్ అంటే… పూర్తిగా తినకుండా కడుపును మాడ్చుకోవటం కాదు. సరైన ఆహార నియంత్రణ పాటిస్తూ, చిన్న చిన్న వ్యాయామాలను పాటించటమే డైటింగ్ అనేదానికి పూర్తి అర్థాన్నిస్తుంది. డైటింగ్ చేయడం వల్ల కేవలం శరీరం బరువు తగ్గటం మాత్రమే కాకుండా, అనవసరమైన క్యాలరీలు శరీరంలో పేరుకోనీయకుండా చేసుకున్న వారలం అవుతాము. ఎలాంటి వయస్సులోనైనా చురుకుగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి డైటింగ్ చాలా చక్కగా దోహదపడుతుంది. అయితే డైటింగ్ చేసేవారు ఎలాపడితే అలా ఆహార పదార్థాలను తీసుకోకుండా, ఓ పద్ధతి ప్రకారం తీసుకున్నట్లయితే శరీరం బరువును కంట్రోల్‌ పెట్టుకోవడం సాధ్యమవుతుంది.
అదికూడా బరువు తగ్గడానికి కొద్ది కాలం పాటు  డైట్ చేస్తే తప్పులేదు గానీ… ఏళ్ల తరబడి డైట్ పాటించడం అస్సలు మంచిది కాదంటున్నారు ఆరోగ్య  నిపుణులు. ఎందుకంటే డైటింగ్ అనేది శరీర బరువుని అదుపులో పెట్టుకోవడానికి కొంతకాలం చేస్తే సరిపోతుంది. కానీ అదే కంటిన్యూ చేస్తే కొన్ని సమస్యలు ఎదురవుతాయట. డైట్ చేసేవాళ్ళు ,ఇది తింటే ఎన్ని కేలరీలు పెరుగుతాం, అది తింటే ఆ కేలరీల ను ఎలా బర్న్ చెయ్యాలి, అని తెగ ఆలోచిస్తారు. అదే డైట్ అనేది లేకపోతే  ఆకలిగా అనిపించినప్పుడు, నచ్చింది తిని తృప్తి పొందవచ్చు.
అదీకాక కొన్ని సర్వేల ప్రకారం తిండి తినేవారికంటే… టెన్షన్ పడేవారే ఎక్కువగా బరువుపెరుగుతున్నారట. అందువల్ల డైటింగ్ టెన్షన్ నుండి బయట పడి హాయిగా తినేయడమే మంచిది. అన్ని రకాలూ తింటే ఆరోగ్యానికీ ఆటోమేటిక్ గా మంచి జరుగుతుంది. మనం బాగా తినాలి, కాకపోతే తిన్న తరువాత కస్టపడి పనిచేయాలి. అప్పుడే  మన శరీరంలో  అన్ని అవయవాలూ క్రమపద్ధతి లో పనిచేస్తాయి. అలా కాకుండా తిండి మానేసి… నీరసంగా  ఉంటే ఆరోగ్యం మరింత పాడవుతుంది.
కానీ డైటింగ్ చేసేవాళ్లు..ఏది తినాలన్న బరువు పెరిగిపోతామేమో, డాక్టర్ ఏం చెప్పారు… ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు. ఇది మానసికంగా ఏ మాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. డైటింగ్ చేసేవారికి ఎల్లప్పుడూ ఏం తినాలో, తినకూడదో అనే భావన మనసులో ఉంటుంది. కానీ మనసుకు తినాలనిపించినది తినేస్తేనే మంచిది. ఇలా నచ్చినవన్నీ తినేసేవాళ్లు… ఎప్పుడూ ఉత్సహం గా ఉంటారు. వాళ్లు తిండి పై కాకుండా ఇతర విషయాల పైన ఎక్కువగా దృష్టి పెట్టగలుగుతారు. అదే  డైట్ పాటించేవారికి తిండి మాత్రమే పెద్ద మేటర్ అయిపోతుంది.
ఐస్‌క్రీమ్ తినాలనుకున్నప్పుడు తినేశారంటే మనసులో,ఇక దానిపై కోరిక ఉండదు. అదే తినకపోతేమాత్రం తినాలనేభావన ఉండిపోతుంది. అది మనసును ఇబ్బంది పెడుతుంది. ఏ ఆహారం అయినా అంతే… తినాలనిపిస్తే, తినడమేమంచిది. డైట్ పాటించడం ఆపేసి  అన్ని రకాల ఆహారాలూ తినమంటున్నారు ఆరోగ్య నిపుణులు.
కాకపోతే శరీరానికి విటమిన్లు, మినరల్స్ అన్నింటిని అందేలా చేయమంటున్నారు. అందుకు గాను పళ్ళు కూరగాయలు, ఎక్కువగా తినాలని సూచిస్తున్నారు. తద్వారా అవే శరీరంలో  మెటబాలిజం సెట్ చేసి… బరువు పెరగకుండా చేస్తాయంటున్నారు. ఎంత తింటామో అంతగా ఒళ్ళు వంచి పనిచేస్తే మాత్రం ఎలాంటి సమస్యలు రావని తెలియచేస్తున్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR