Home Health పగటిపూట కునుకు ఆరోగ్యానికి మంచిది కాదా?

పగటిపూట కునుకు ఆరోగ్యానికి మంచిది కాదా?

0

ప్రతి మనిషికి నిద్ర చాలా ముఖ్యం. తిండి లేకున్నా శరీరం తట్టుకుంటుంది కానీ నిద్రలేకపోయినా, తగ్గినా శారీరక, మానసిక సమస్యలు పెరిగి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. అయితే చాలా మందికి పగటిపూట ఓ కునుకు తీసే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు ఉన్న ఉద్యోగస్తులయితే నానా ఇబ్బందులు పడుతుంటారు.

morning sleepనిజానికి పగటి పూట నిద్ర మంచిదా? కాదా? అనేది ఏళ్లుగా శాస్త్రవేత్తల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. ఎక్కువ సేపు నిద్రపోతే ప్రమాదమేనన్నది కొందరు పరిశోధకుల మాట. మరి పగటిపూట కునుకుతో ఆరోగ్యానికి మంచిదా? కాదా? అనేది తెలుసుకుందాం.

పగటి పూట ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, పని చేసే ముందు కాసేపు కునుకు తీస్తే మెదడు చురుగ్గా ఉంటుందని వర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌ పరిశోధకులు తెలిపారు. కునుకు వల్ల పనిలో ఏకాగ్రత వస్తుందని వెల్లడించారు.

అయితే పగటి పూట అర్థగంట నిద్రపోతే మంచిదే కానీ.. గంటలపాటు పగటిపూట నిద్రపోతే మాత్రం ఆరోగ్యానికి దెబ్బేనని నిపుణులు చెప్తున్నారు. రోజూ పగటి పూట గంట కంటే ఎక్కువ నిద్రపోయేవారిలో టైప్-2 డయాబెటిస్ ముప్పు 45శాతం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కొంచెం రిలాక్స్ అవడానికి చిన్న పవర్ నాప్ వేయండి కానీ ఎక్కువసేపు పడుకొని ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవద్దు.

 

Exit mobile version