Home Health వ్యాయామం చేసేముందు ఈ ఆహారం తీసుకుంటే చాల మంచింది

వ్యాయామం చేసేముందు ఈ ఆహారం తీసుకుంటే చాల మంచింది

0

బరువు తగ్గడానికి, ఫిట్‌గా ఉండడానికి ప్రతిరోజూ వ్యాయామం చేస్తుంటారు. అయితే ఆందరూ వర్కౌట్స్‌ తర్వాత తినే ఆహారంపైనే శ్రద్ధపెడుతుంటారు. కానీ వ్యాయామం చేసేముందు ఏం తినాలో చాలామందికి తెలియదు.

Weight Lossవర్కౌట్స్‌ చేసే ముందు మంచి స్నాక్స్‌ తీసుకుంటే కావాల్సిన శక్తి లభించడంతోపాటు రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అందులో ది బెస్ట్ స్నాక్ అంటే కొబ్బరి, బెల్లం. వర్కౌట్స్‌ చేసే ముందు కొబ్బరి, బెల్లం పొడితో చేసిన హెల్తీ స్నాక్స్‌ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

తురిమిన ముడి కొబ్బరి, బెల్లం మిశ్రమం తీసుకుంటే కావాల్సినంత శక్తి సమకూరుతుంది. దీనిని జలుబు తగ్గేందుకు, ఎనర్జీ, రోగనిరోధకశక్తి పెంచేందుకు, శస్త్రచికిత్స తర్వాత కోలుకునేందుకు, ఉష్ణమండల ఔషధంగా కూడా వాడుతారు.

దీన్ని శక్తివంతమైన, పోషకాలతో కూడిన అల్పాహారం లేదా ప్రీ వర్కౌట్‌ అల్పాహారంగా హెల్త్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఎందుకంటే డీసికేటెడ్ లేదా తురిమిన కొబ్బరిలో మాంగనీస్, కాఫర్‌ పుష్కలంగా ఉంటాయి.ఇందులో ఉండే డైటరీ ఫైబర్‌ ఎక్కువసేపు వ్యాయామం చేసేలా శక్తినిస్తుంది.

ఇక బెల్లం చర్మ సంరక్షణకు తోడ్పడుతుంది.

జుట్టు సంరక్షణకు ఉపయోగపడుతుంది.

రక్తాన్ని డిటాక్స్‌ చేస్తుంది.

ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, సెలీనియం, జింక్ లాంటి ఖనిజాలు శక్తిస్థాయిలను పెంచేందుకు సహాయపడుతాయి. వీటితో పాటు కావాలనుకుంటే వేరు శనగ కూడా యాడ్ చేసుకోవచ్చు.

 

Exit mobile version