భక్తులు దుర్గ, లక్ష్మి, సరస్వతి ఈ ముగ్గురమ్మలను కాళికామాతలోనే దర్శనం చేసుకొనే ఆలయం

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా పట్టణములో కాళీఘాట్ లో ప్రాచుర్యం పొందిన శ్రీ కాళికాదేవి ఆలయం ఉంది. ఈ ఆలయములో ఉన్న అమ్మవారి వలనే ఈ నగరానికి కలకత్తా అని పేరు వచ్చినది. మన దేశములోని ప్రతి వ్యక్తికి కూడా ఎప్పుడో ఒకసారి అయినా ఈ కలకత్తా కాళీమాత పేరు వినే ఉంటారు. ఈ అమ్మవారికి ప్రంపంచం నలుమూలల నుండి భక్తులు ఉన్నారు.

kaalimathaఈ కాళీమాత ఆలయం సుమారు 5 లేక 6 వ శతాబ్దం నుండి ఇచ్చట ప్రసిద్ధి పొందినట్లు తెలుస్తుంది. ఈ ఆలయం అనేది చాలా చిన్నగా ఉంటుంది. దీని చుట్టూ ఇళ్ళలాగా ఉండి లోపల ఆవరణలో ఈ ఆలయం ఉంటుంది. ఆలయములో అమ్మవారి పూర్తి సంపూర్ణ విగ్రహం అనేది ఉండదు. సుమారు మూడు అడుగులు ఉన్న శిరస్సు భాగం మాత్రం ప్రతిష్టించబడి ఉంటుంది. అంతేకాకుండా కలకత్తా కాళీ మాత పెద్ద కళ్ళతో,సుమారు 2 అడుగుల పొడవుగల నాలుక చాచి ఉంటుంది. కలకత్తా పట్టణానికి ఆరాధ్య దైవం అయినా కాళికామాత ఉన్న ఈ ఆలయం దేశములోని 51 శక్తి పీఠాలలో ఇది మూలాధారమైనది.

kaalimathaమరి ఈ కాళికామాత ఆలయం ఎలా వెలసింది అంటే, దక్షయజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్న సతీదేవి భౌతికకాయాన్ని పరమేశ్వరుడు రోషావేశంతో నలుమూలలా ప్రదర్శిస్తూ వెళ్తుంటే శ్రీ మహావిష్ణువు తన చక్రంతో ఈమె శరీరాన్ని 51 ముక్కలు చెయ్యగా అందులోని ఈ తల్లి పాదాగ్రం భగీరధీ తీరంలో పడిందనీ అక్కడే ఈ కాళీక్షేత్రం వెలసిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. గంగ సాగర సంగమం కొద్దీ దూరములో ఉన్న ఈ క్షేత్రములో కాళీమాతకి గొప్ప స్థానం లభించింది. ఇక్కడి భక్తులు దుర్గ, లక్ష్మి, సరస్వతి ఈ ముగ్గురమ్మలను ఈ కాళికామాతలోనే దర్శిస్తారు.

kaalimathaఈ విధంగా కాళీమాత ఆలయం కలకత్తా నగరంలో వెలిసి అక్కడ ఉన్న భక్తులందరికీ ఆరాధ్య దైవంగా నిలిచింది.

kaalimatha

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR