కార్తీక స్నానం ఎలా చేయాలి ? ఏ సమయంలో చేయాలి ?

కార్తీక మాసం అనగానే ఉపవాసాలు, దీపాలు, వనభోజనాలు గుర్తుకువస్తాయి. వీటితో పాటు కార్తీక స్నానం కూడా తలపులోకి వస్తుంది. కార్తీకమాసంలో ప్రాతఃకాలానే నిద్రలేచి నది, చెరువు, బావుల దగ్గర స్నానమాచరించి దీపారాధన చేస్తారు. ఈ పుణ్య స్నానం కార్తీక మాసం అంతా చేస్తే శుభం జరుగుతుందని విశ్వాసం.

కార్తీక స్నానంసూర్యడు ఉదయించకముందే, నక్షత్రాలు ఇంకా కనిపిస్తుండగానే కార్తీక మాసంలో, భూమి నుంచి వెలువడిన జలాలతో స్నానం చేయాలన్నది పెద్దల నియమం. ప్రతిరోజూ ప్రతి నెలా చేస్తున్న స్నానం కంటే కార్తీకమాసంలో చేసే స్నానాన్ని ఒక విశేషం ఉంది. సహజంగానే కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో వుంటాడు. సూర్యునికి ఇది నీచ స్థానం.

కార్తీక స్నానంఅంటే సూర్యుని ఉష్ణోగ్రత ఈ మాసం అంతా తక్కువగా వుంటుంది. చలికాలం ప్రారంభమవుతుంది. ఇది మనిషి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. మన జీర్ణశక్తి తగ్గుతుంది. చురుకుదనం తగ్గుతుంది, బద్ధకం పెరుగుతుంది. శరీరంలో నొప్పులు పెరుగుతాయి. నరాల బలహీనత వున్నవాళ్ళు చలికి ముడుచుకుని పడుకోవటంతో అవి ఇంకా పెరుగుతాయి. వీటన్నిటికీ దూరంగా వుండటంకోసమే, మన ఆరోగ్య రక్షణకోసమే ఈ నియమాలు ఆచరించే పద్ధతి పెట్టారు.

కార్తీక స్నానంతెల్లవారు ఝామున లేవటం వలన ఈ కాలంలో సహజంగా వచ్చే ఋగ్మతల నుంచి మనల్ని కాపాడుకోవచ్చు. నక్షత్రాలుండగానే స్నానం, దైవపూజ, వగైరాల వలన బద్ధకం వదిలి, శారీరకంగా ఉత్సాహంగా వుండటమే కాక, మానసికంగా కూడా చాలా ఉల్లాసంగా వుంటుంది. నదీ స్నానం చెయ్యాలంటే నది దాకా నడవాలి. దానితో శారీరక వ్యాయామం అవుతుంది. ప్రవహించే నదులలో సహజంగా వుండే ఔషధాలే కాకుండా నదీ పరీవాహక ప్రదేశాలలో వుండే ఓషధులను కూడా నదులు తమలో కలుపుకుని వస్తాయి. ఆ నీటిలో స్నానం చెయ్యటం ఆరోగ్యప్రదం.

కార్తీక స్నానంతెల్లవారుఝామున స్నానం చేసి నదిలో దీపాలు వదిలి ఆ దృశ్యాలను చూసి, ఆ సమయంలో భగవంతుని ధ్యానిస్తే మనసు ఎంతో సంతోషంతో, ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది. అంతేకాదు నవంబరు నాటికి వర్షాలు తగ్గిపోతాయి. నదుల ఉధృతి తగ్గి వాటిలోని మలినాలన్నీ అడుగుకి చేరుకుని నిర్మలమైన నీరు మాత్రమే ప్రవహిస్తుంటుంది. అటు సమృద్ధిగా, ఇటు స్వచ్ఛంగా ఉన్న నీటిలో స్నానం చేయాలంటే కార్తీక మాసమే అనువైన సమయం.

కార్తీక స్నానంకార్తీకమాసంలో నీటి మీద చంద్రుని కిరణాల ప్రభావం అధికంగా ఉంటుందంటారు. ఇలా చంద్రకిరణాలను సోకిన నీటితో స్నానం చేయడం వలన అనేక వ్యాధులు నయమవుతాయని చెబుతారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,600,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR