గ్రామదేవతగా పూజలు అందుకుంటున్న కట్టమైసమ్మ తల్లి ఆలయ విశేషాలు

0
3765

మన తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా ప్రతి గ్రామంలో గ్రామదేవత గా వెలసిన అమ్మవారి ఆలయం అనేది తప్పకుండ ఉంటుంది. అయితే ఒక్కో ప్రాంతంలో వెలసిన అమ్మవారిని ఒక్కో పేరుతో పిలిస్తు భక్తులు పూజలు చేస్తుంటారు. మరి కట్టమైసమ్మ తల్లి కొలువై ఉన్న ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

maisamma thalliతెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, కుత్బుల్లాపూర్ మండలం, సూరారంలో శ్రీ కట్టమైసమ్మ ఆలయం ఉంది. ఇక్కడి భక్తులు ఈ తల్లిని గ్రామదేవతగా కొలుస్తారు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వెలసిన కట్టమైసమ్మ తల్లికి ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జాతర నిర్వహిస్తారు.

maisamma thalliఈ జాతరకు తండోపతండాలుగా లక్షలాది ప్రజలు దేశ నలుమూలల నుండి తరలివచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఈ అమ్మవారిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోయి సుఖసంతోషాలతో జీవితం హాయిగా సాగుతుందని భక్తుల్లో బలమైన నమ్మకం. ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని మనసారా దర్శించుకొని భక్తులు తమ మొక్కులను తీర్చుకుంటారు. ఎంతో నిష్ఠతో అమ్మవారిని స్మరించడం వల్ల కోరికలు తీరుతాయని భక్తులు భావిస్తారు.

maisamma thalliఈ ఆలయానికి చుట్టూ పక్కల ప్రాంతాల నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి కూడా ప్రజలు ఇక్కడి అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం విశేషం. ఇంకా ఉత్సవాలలో పోతురాజుల నృత్యాలు, మహిళల దీపారాధనలు, పొంగలి నైవేద్యాలతో ఈ కట్టమైసమ్మ తల్లిని భక్తితో పూజిస్తారు.

maisamma thalliఇలా ఈ ఆలయంలోని తల్లి గొప్ప మహిమగల తల్లిగా భక్తుల హృదయాలలో నిండి ఉన్నదీ.

5 mahimagala kattamaisamma thalli

SHARE