Home Unknown facts గ్రామదేవతగా పూజలు అందుకుంటున్న కట్టమైసమ్మ తల్లి ఆలయ విశేషాలు

గ్రామదేవతగా పూజలు అందుకుంటున్న కట్టమైసమ్మ తల్లి ఆలయ విశేషాలు

0

మన తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా ప్రతి గ్రామంలో గ్రామదేవత గా వెలసిన అమ్మవారి ఆలయం అనేది తప్పకుండ ఉంటుంది. అయితే ఒక్కో ప్రాంతంలో వెలసిన అమ్మవారిని ఒక్కో పేరుతో పిలిస్తు భక్తులు పూజలు చేస్తుంటారు. మరి కట్టమైసమ్మ తల్లి కొలువై ఉన్న ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

maisamma thalliతెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, కుత్బుల్లాపూర్ మండలం, సూరారంలో శ్రీ కట్టమైసమ్మ ఆలయం ఉంది. ఇక్కడి భక్తులు ఈ తల్లిని గ్రామదేవతగా కొలుస్తారు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వెలసిన కట్టమైసమ్మ తల్లికి ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జాతర నిర్వహిస్తారు.

ఈ జాతరకు తండోపతండాలుగా లక్షలాది ప్రజలు దేశ నలుమూలల నుండి తరలివచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఈ అమ్మవారిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోయి సుఖసంతోషాలతో జీవితం హాయిగా సాగుతుందని భక్తుల్లో బలమైన నమ్మకం. ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని మనసారా దర్శించుకొని భక్తులు తమ మొక్కులను తీర్చుకుంటారు. ఎంతో నిష్ఠతో అమ్మవారిని స్మరించడం వల్ల కోరికలు తీరుతాయని భక్తులు భావిస్తారు.

ఈ ఆలయానికి చుట్టూ పక్కల ప్రాంతాల నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి కూడా ప్రజలు ఇక్కడి అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం విశేషం. ఇంకా ఉత్సవాలలో పోతురాజుల నృత్యాలు, మహిళల దీపారాధనలు, పొంగలి నైవేద్యాలతో ఈ కట్టమైసమ్మ తల్లిని భక్తితో పూజిస్తారు.

ఇలా ఈ ఆలయంలోని తల్లి గొప్ప మహిమగల తల్లిగా భక్తుల హృదయాలలో నిండి ఉన్నదీ.

Exit mobile version