కౌరవ పాండవ పుష్పం ప్రత్యేకత!!!

మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఒక ప్రముఖ ఘట్టం. ఈ యుద్ధం దాయాదులైన కౌరవులకు పాండవులకు మధ్య హస్తినాపుర సింహాసనం కోసం జరిగింది. ఈ యుద్ధం కురుక్షేత్రం అనే ప్రదేశంలో జరిగింది. మహాభారతం నేటికీ మనకు చాలా నేర్పిస్తుంది. ఈ నేపథ్యంలో మనిషికి ప్రకృతికి విడదీయలేని బంధం ఉంది. ఈ ప్రకృతిలో మనకు తెలిసిన అద్భుతాలు కొన్ని ఉంటె.. తెలియనివి ఎన్నో ఉన్నాయి.

kurukshetra warకొన్ని అద్భుతాలు మతపరమైన ప్రాముఖ్యతను కూడా కలిగివున్నాయి. హిందూ ధర్మంలో పంచమవేదంగా ఖ్యాతిగాంచిన మహాభారతం మొత్తం ఒక పుష్పంలో ఉందట.. ఎంతో అందంగా కనిపించి కనువిందు చేసే ఈ పువ్వులో అనేక రహస్యాలు దాగి ఉన్నాయట.. వాడుకభాషలో ఎక్కువ ఈ పుష్పాన్ని కౌరవ-పాండవ పువ్వు అని పిలుస్తారు. కృష్ణ కమలం అని కూడా మరో పేరు ఉంది.

మహాభారతాన్ని తెలియజేసే ఆ పువ్వు ఏంటి ? ఆ పువ్వు ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం… మన హిందూ ధర్మంలో పంచమవేదంగా ఎంతో ప్రసిద్ధి చెందిన మహాభారతం మొత్తం ఒక పువ్వులో ఏర్పడి ఉంది. చూడటానికి ఎంతో అందంగా కనిపించే ఈ పుష్పంలో ఎన్నో వింతలు ఉన్నాయి.

అంత విశిష్టత కలిగిన ఈ పుష్పాన్ని కృష్ణ కమలం అని పిలుస్తారు. వాడుక భాషలో ఈ పుష్పాన్ని కౌరవ పాండవ పుష్పం అని కూడా పిలుస్తారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ పుష్పం ఏడాది మొత్తం మనకు కనిపించదు. కేవలం మూడు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే పుష్పించడం ఈ కృష్ణ కమలం ప్రత్యేకత.

krishna kamalamకౌరవులు, పాండవులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ ఈ పుష్పం లోనే దాగి ఉన్నారని చెప్పవచ్చు.
చూడటానికి ఎంతో చిన్నగా తెలుపు రంగులో ఆహ్లాదంగా కనిపించే ఈ పుష్పంలో ఇంత సమాచారం ఇమిడి ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది పుష్పం చుట్టూ చిన్నని పుసన్నని తీగవంటి రేకులు కలిగి ఉంటాయి ఇవి మొత్తం 100 ఉండటంతో వీటిని కౌరవులుగా భావిస్తారు.

brahma vishnu shivవీటి పై భాగంలో ఐదు రెక్కలు కలిగి ఉంటాయి.
ఈ ఐదు రెక్కలను పాండవులకు సూచిక. ఈ ఐదు రెక్కల పై మూడు రెక్కలు కొలువై ఉంటాయి వీటిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా కొలుస్తారు.
వీటి కింద భాగంలో సుదర్శనచక్రాన్ని పోలిన ఆకారం ఉంటుంది. దీనిని శ్రీకృష్ణుడిగా భావిస్తారు.
ఇలా ఈ పుష్పంలో మహాభారత సమాచారం ఉండడం చేత ఈ పుష్పాన్ని కౌరవ పాండవ పుష్పం లేదా కృష్ణ కమలం అని కూడా పిలుస్తారు.

krishna kamalam

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR