కీటో డైట్ అంటే ఏంటి? ఎలా పాటించాలి?

ప్రస్తుత కాలంలో అందానికి ప్రాముఖ్యత పెరిగింది. మోడల్స్ మాత్రమే కాదు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ వరకు తమను తాము అందంగా తీర్చి దిద్దుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే వెయిట్ లాస్ అవడానికి చాలా రకాల డైట్​ లు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఈ మధ్య బాగా పాపులరైన డైట్.. కీటో డైట్. సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యులవరకూ చాలామంది బరువును తగ్గించుకోవడానికి ఈ డైట్ ఫాలో అవుతున్నారు.

keto dietకీటో డైట్ అంటే కీటో జెనిక్ ఫుడ్ అని అర్థం. ఈ డైట్ తీసుకుంటే కొవ్వు దానంతట అదే కరిగిపోతుంది. ఈ డైట్ ఫాలో అయితే బరువు తగ్గి స్లిమ్ గా తయారవుతారు. దీనివల్లే ఈ మధ్య కీటోడైట్ బాగా పాపులర్ అయింది. కీటో డైట్​లో కార్బొహైడ్రేట్ ఫుడ్ ను పూర్తిగా తొలగిస్తారు. దీంతో బాడీలో ఉండే కొవ్వే కరుగుతుంది తప్ప అదనంగా కొవ్వు ఏర్పడే ఛాన్స్ లేదు. దీనివల్ల నెమ్మది నెమ్మదిగా వెయిట్ లాస్ అవుతారు.

weight lossమనం తీసుకునే ఆహారంలో.. అతి తక్కువ కార్బోహైడ్రేట్స్‌, అధికంగా ప్రోటీన్లు, కొద్దిగా కొవ్వు పదార్థాలు తీసుకోవటమే కీటో డైట్‌ విధానం. సాధారణ పరిస్థితుల్లో మన శరీరం కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారం నుంచి ఉత్పత్తయ్యే గ్లూకోజ్ నుంచి శక్తిని పొందుతుంది. అదే గ్లూకోజ్ లేని సందర్భంలో కీటోసిస్ జరుగుతుంది. కీటోసిస్‌లో భాగంగా శక్తి కోసం శరీరం గ్లూకోజ్ బదులుగా కొవ్వు పదార్థాలను కరిగించుకుంటుంది. మనం కార్బోహైడ్రేట్లు తీసుకోకుంటే, కాలేయం కొవ్వును కరిగించి, దాని నుంచి శక్తిని పొందుతుంది. ఈ శక్తి ‘కీటోన్‘ అనే కణాల రూపంలో ఉంటుంది.

glucose vs ketonesఇలాంటి డైట్‌ను ప్రారంభించాలనుకుంటే, మొదట జనరల్ ఫిజీషియన్‌ను కలిసి, అది మీకు సురక్షితమేనా అన్నది నిర్ధారించుకోవాలి. మధుమేహం, మరీ ప్రత్యేకించి టైప్-1 మధుమేహంతో బాధపడేవారు కీటోజెనిక్ డైట్‌ను ప్రయత్నిస్తే సమస్యలు ఎదురు కావచ్చు. అందువల్ల మధుమేహం, బ్లడ్ షుగర్ సమస్యలు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు కీటోజెనిక్ డైట్ ఫలితాల గురించి డాక్టర్ సలహా తీసుకోవాలి. కీటో డైట్ లోకి మారడానికి ఒక వారం సమయం తీసుకోండి. ముందుగా ఒక ప్రణాళిక ను సిద్ధం చేసుకోండి. డైట్‌ను ప్రారంభించే ముందు లివర్‌కు సహకరించే వెల్లుల్లి, ఉల్లిలాంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకుని, చక్కెర, కెఫీన్, అల్కాహాల్ తగ్గించాలి.

ginger and garlicకీటో డైట్ లో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ, అంటే రోజుకి 20 గ్రాములకి మించి లేకుండా చూసుకోవాలి. కానీ మొదటి రోజే మీరు మొత్తం పిండిపదార్ధాలు/కార్బోహైడ్రేట్స్ ని 20 గ్రాములకు కట్ చేసి కొవ్వు తీసుకుంటే శరీరం కొద్దిగా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే ఒక్క రోజులో కాక వారం రోజుల్లో కొద్ది కొద్దిగా కట్ చేస్తూ 7 వ రోజు నుండి పూర్తి కీటో డైట్ లోకి మారాలి.

ఒకటవ రోజు — ఉదయం బ్రష్ చేసుకోగానే ఒక గ్లాసు నీళ్ళల్లో నిమ్మరసం పిండుకొని తాగాలి. తర్వాత 30 నిమిషాల వరకు ఏమి తినకూడదు తాగకూడదు. అరగంట తర్వాత ఒక కప్పు బ్లాక్ టీ కానీ బ్లాక్ కాఫీ కానీ తాగవచ్చు. ఉదయం 10.30 లేదా 11 గంటలకు మధ్యలో 2 గంటల పాటు నానబెట్టిన ఊదలు లేదా సామలు లేదా కొర్రలతో అన్నం వండుకుని 1 కప్పు కొలతతో అన్నం పెట్టుకోవాలి. అరకప్పు లేదా ఆకలి ఎక్కువగా ఉంటే కప్పు కూర పెట్టుకోవాలి. నాన్ వెజ్ తినే వారయితే ఒక ఉడికించిన గుడ్డు కూడా పెట్టుకోవాలి. కూరతో కలుపుకోగా అన్నం మిగిలితే పల్చని నీళ్ల లాంటి మజ్జిగ తో కలుపుకుని తినాలి.
ఇక మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఒక గ్రీన్ టీ విత్ నాన్ బెట్టిన బాదం పప్పులు, లేదా వాల్ నట్స్ (7-10) లేదా కీర దోసకాయ తినవచ్చు. సాయంత్రం 6.30 లేదా 7 గంటల ప్రాంతంలో మళ్ళీ అన్నం పొద్దున్న లాగానే తినాలి. ఇక ఆ తర్వాత మరుసటి రోజు 10.30 గంటల వరకు ఒక్క మంచి నీళ్లు తప్ప ఎటువంటి ఆహారం తీసుకోకూడదు.

green teaరెండవ రోజు — మొదటి రోజున పాటించిన విధంగానే పాటించాలి.
మూడవ రోజు — తినవలసిన ఆహారం ఇంకా సమయం పైన చెప్పిన విధంగానే తీసుకోవాలి. కాకపోతే ఒక్క చిన్న మార్పు. ఉదయం 10.30 గంటలకు ఇంకా రాత్రి 7 గంటకు మీరు తీసుకునే మిల్లెట్ రైస్ యొక్క పరిమాణాన్ని 1 కప్పు నుండి 1/2 కప్పుకు తగ్గించాలి. తగ్గిన పరిమాణం యొక్క లోటుని భర్తీ చేసేందుకు కూరను పెంచాలి.
నాల్గవ రోజు — కూడా మూడవ రోజు మాదిరిగానే పాటించాలి.
ఐదవ రోజు — తినాల్సిన ఆహరం, సమయం అన్నీ మూడవ రోజు లానే పాటించాలి కాకపోతే రాత్రి 7 గంటలకు తీసుకోవాల్సిన మిల్లెట్ రైస్ తీసుకో కూడదు. రాత్రి మానేయాలి. ఉత్తి కూర, ఒక గుడ్డు, పల్చని మజ్జిగ తీసుకోవాలి.

boiled eggఆరవ రోజు — కూడా ఐదవ రోజులానే పాటించాలి.
ఏడవ రోజు — పూర్తిగా మిల్లెట్ రైస్ మానేయాలి. ఆ మిల్లెట్ రైస్ స్థానంలో కీటో డైట్ కి సంబంధించిన ఆహారం మాత్రమే తీసుకోవాలి.

keto benefitsఏడవ రోజు నుండి మీరు పూర్తిగా కీటో డైట్ లోకి మారిపోయారు. నెమ్మదిగా కార్బోహైడ్రేట్స్ ను కట్ చేస్తూ రావడం వల్ల శరీరం నెమ్మదిగా ఇబ్బంది లేకుండా ఈ కొత్త డైట్ ను స్వీకరిస్తుంది. అయితే ఈ వారం రోజులలోనే బరువు తగ్గుతారని ఆశించవద్దు. మొదటి వారం చేసింది బరువు తగ్గించుకునేందుకు కాదు. శరీరానికి ఆరోగ్యకరమైన ఆహార శైలిని అలవాటు చేయడానికి. ఈ పద్ధతిని పాటిస్తుంటే నెమ్మదిగా బరువు తగ్గిపోతారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. ముందు మీరు ఆరోగ్యం గా ఉంటేనే బరువు తగ్గుతారు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR