గత 10 సంవత్సరాల నుండి ఖైరతాబాద్ వినాయకుడు ఎలా దర్శనమిచ్చాడో తెలుసా?

0
1564

తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లోని ఖైరతాబాద్ అనే ప్రాంతంలో ప్రతి సంవత్సరం వినాయకచవితి ని చాలా వైభవంగా జరుపుతారు. అయితే మొట్టమొదటగా 1954 వ సంవత్సరంలో ఖైరతాబాద్ లో ఒక్క అడుగు వినాయకుడి విగ్రహం తో వినాయక చవితి వేడుకలు అనే జరిపారు. ఈవిధంగా ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ వినాయకుడి కి ప్రతి సంవత్సరం భక్తులు పెరుగుతూ వచ్చారు. అయితే ఒక్క అడుగుతో ప్రారంభించిన ఖైరతాబాద్ వినాయకుడు ఆలా ప్రతి సంవత్సరం ఒక్కో అడుగు పెంచుతూ వచ్చారు. మరి గత 10 సంవత్సరాలుగా ఖైరతాబాద్ వినాయకుడు ఎలా దర్శమిచ్చాడనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఐదు తలల గణపతి – 2010

Khairthabad ganesh2010 వ సంవత్సరంలో ఖైరతాబాద్ వినాయకుడు ఇది తలలతో దర్శనమిచ్చాడు.

గరుడ వాహన గణపతి – 2011

Khairthabad ganesh2011 వ సంవత్సరంలో ఖైరతాబాద్ వినాయకుడు 18 తలల నీడలో గరుడ వాహనంపై దర్శనమిచ్చాడు. ఈ విగ్రహం 57 అడుగులు.

సర్వలోక మహాగణపతి – 2012

Khairthabad ganesh2012 వ సంవత్సరంలో ఖైరతాబాద్ వినాయకుడు సర్వలోక మహాగణపతిగా దర్శనమిచ్చాడు. ఈ విగ్రహం 58 అడుగులు. వినాయకుడి విగ్రహం పైన బ్రహ్మ, సరస్వతి, శివుడు, పార్వతి, విష్ణు, లక్ష్మీదేవిలు వినాయకుడిని ఆశీర్వదిస్తునట్లుగా ఉంటుంది.

 గోనాగ చతుర్ముఖ గణపతి – 2013

Khairthabad ganesh2013 వ సంవత్సరంలో ఖైరతాబాద్ వినాయకుడు గోనాగ చతుర్ముఖ రూపంలో దర్శనమిచ్చాడు. ఈ విగ్రహం ఎత్తు 59 అడుగులు.

శ్రీ కైలాస విశ్వరూప మహాగణపతి – 2014

Khairthabad ganesh2014 వ సంవత్సరంలో ఖైరతాబాద్ వినాయకుడు శ్రీ కైలాస విశ్వరూప మహాగణపతి గా దర్శనమిచ్చాడు. ఈ విగ్రహం 60 అడుగుల ఎత్తు కాగా తామరపువ్వుపై దశ బాహువులతో నిల్చున్న త్రిముఖ గణపతికి ఇరువైపులా శివపార్వతుల శిరసులు ఉంటాయి. వెనుక ఏడు తలల సర్పం, దానికి ఇరువైపులా కుమారస్వామి, అయ్యప్ప స్వామి ఉంటారు. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ఏర్పాటై 60 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా 2014 లో 60 అడుగుల వినాయకుడిని తయారుచేసారు.

త్రిశక్తిమయ మోక్ష గణపతి – 2015

Khairthabad ganesh2015 వ సంవత్సరంలో ఖైరతాబాద్ వినాయకుడు త్రిశక్తిమయ మోక్ష గణపతిగా దర్శనమిచ్చాడు. ఈ విగ్రహం ఎత్తు అడుగులు.

శ్రీ శక్తి పీఠ శివనాగేంద్ర మహాగణపతి – 2016

Khairthabad ganesh2016 వ సంవత్సరంలో ఖైరతాబాద్ వినాయకుడు శ్రీ శక్తి పీఠ శివనాగేంద్ర మహాగణపతి గా దర్శనమిచ్చాడు. ఈ విగ్రహం ఎత్తు 58 అడుగులు కాగా విష్ణు రూపంలో, వెనుక వైపు శివలింగంతో వినాయకుడు భక్తులకి దర్శనమిచ్చాడు.

శ్రీ చండీ కూమార అనంత మహాగణపతి – 2017

Khairthabad ganesh2017 సంవత్సరంలో ఖైరతాబాద్ వినాయకుడు శ్రీ చండీ కూమార అనంత మహాగణపతి రూపంలో దర్శనమిచ్చాడు. ఈ విగ్రహం ఎత్తు 57 అడుగులు కాగా 14 తలల ఆదిశేషుడి నీడలో, ఎనిమిది చేతులతో వినాయకుడు భక్తులకి దర్శనమిచ్చాడు.

 సప్తముఖ కాలసర్ప మహాగణపతి – 2018

Khairthabad ganesh2018 వ సంవత్సరంలో  సప్తముఖ కాలసర్ప మహాగణపతి గా దర్శనమిచ్చాడు. సప్త ముఖాలతో కాళ సర్ప దోష నివారకుడిగా 57 అడుగుల ఎత్తు, 27అడుగుల వెడల్పు తో విగ్రహం ఉంటుంది.

శ్రీద్వాదశాదిత్య మహాగణపతి – 2019

Khairthabad ganesh2019 వ సంవత్సరంలో 12 శిరస్సులు, 24 చేతులు, 12 సర్పాలు, 7 అశ్వాలతో కూడిన సూర్యరథంపైన వినాయకుడు శ్రీద్వాదశాదిత్య మహాగణపతి నామంతో కొలువుదీరాడు. ఈ విగ్రహం ఎత్తు 61 అడుగులు, 28 అడుగుల వెడల్పు, 50 టన్నుల బరువు.

SHARE