Meet The King Of Folk Songs And His Sensational Story Of Making His Mark In Movies

0
490

Written By: చింతపల్లి శివ సంతోష్

నాని నటించిన “కృష్ణార్జున యుద్ధం “ సినిమా లో పాట
“ దారి చూడు దుమ్ము చూడు మామ
దున్నపోతు ల బేరి చూడు “
అనే పాట తో తెలుగు వాళ్ళందరిని ఒక ఉపు ఉపారు పెంచల్ దాస్ గారు.
కడప జిల్లా, చీత్వేల్ మండలం,దేవమాసు పల్లి లో పుట్టారు దాస్ గారు.
గీసికున్న బొమ్మలు,
రాసుకున్న కధలు,
పాడుకున్న పాటలు,
పాత్రలు వేసిన నాటకాలు పుట్టి పెరిగిన ఊరు,తన చుట్టూ ఉండే పిల్లలు ఇదే పెంచల్ దాస్ గారి ప్రపంచం. తనకు ఊహ రాక ముందే తన తండ్రి చనిపోతే, రెండో అన్నయ్య చిన్నయ్య దాస్ తో జీవితం తో పాటు తన పాటలు,నాటకాలు, జానపద గేయలు తో ప్రయాణించారు. తన అన్నయ్యే తనకు జానపద గురువు అని చెపుతారు దాస్ గారు. పెంచల్ దాస్ గారు రచయిత,గాయకుడే కాదు చిత్రాకారుడు కూడా ఆయన గీసిన చిత్రాలు అమెరికాలో ప్రదర్శింపబడ్డాయి కూడా. జానపదం అంటే దాస్ గారికి చాలా ఇష్టం,తను సేకరించిన, రాసిన పాటలు రచయితల సమావేశంలో పాడుతూ ఉండేవారు. అలా ఒకసారి ఒక సమావేశంలో దాస్ గారు పాటను ఇష్టపడిన దర్శకుడు మేర్లపాక గాంధీ గారి నాన్న గారు సిపార్సు తో దాస్ గారికి ఎక్సప్రెస్ రాజా లో అవకాశం ఇచ్చారు గాంధీ గారు.కొన్ని అనారోగ్య కారణాలతో ఆ అవకాశాన్ని వదులుకున్నారు దాస్ గారు. ఆ తర్వాత గాంధీ గారు మళ్ళీ తన సినిమా “ కృష్ణార్జున యుద్ధం” లో మళ్ళీ అవకాశం ఇచ్చారు. అవకాశమే “ దారి చూడు దుమ్ము చూడు మామ “ పాట తో సినీ ప్రపంచంలోకి వచ్చారు దాస్ గారు.

ఆ తర్వాతే వెంట వెంటనే దాస్ గారికి అవకాశాలు రావటం మొదలైంది. యాత్ర సినిమా లో
“ మరుగైనావా రాజన్న…
కనుమరుగైనావా రాజన్న…
మా ఇంటి దేవుడివే…మా కంటి వెలుగువే రాజన్న”,

అరవింద సమేత వీర రాఘవ లో

“ఊరి కి ఉత్తరానా…దారికి దక్షిణాన
ని పెనీవిటి కులి నాడమ్మ రెడ్డమ్మ తల్లి…
చక్కనైన పెద్ద రెడ్డమ్మ…
నల్లరేగడి నేలలోనా…ఎర్రజొన్న చేలలోనా..
ని పెనీవిటి కాలినాడమ్మ..రెడ్డమ్మ తల్లి…
గుండెలు ఒరిసిపోయే కదమ్మ… “ అనే పాటతో పాటు కొన్ని మాటలను అందించారు దాస్ గారు.

“ సమాజం ఎంత ముందుకు పోయిన,నేను పుట్టిన మట్టి,నా నేలా ఇది. నేను ఇక్కడే ఉంటాను అని బతికేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వాళ్లలో పెంచల్ దాస్ గారు ఒక్కరు “ అని సినిమా విజయోత్సవ సభలో Jr.NTR మాటల్లో అర్ధమవుతుంది దాస్ గారు అంటే ఏమిటో మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ గారు, మా సినిమా వేరే స్థాయి కి తీసుకెళ్లిన వ్యక్తి పెంచల్ దాస్ గారు, సినిమాలో మేము రాసుకున్న రాయలసీమ మాటలకి సరి కొత్త సొగసును అద్ది మా సినిమా విజయం లో కీలకపాత్ర వహించారు.యాస అంటే మనం మాట్లాడే విధానమే కాదు అది మన ప్రాణం అని నమ్మే వ్యక్తి దాస్ గారు అన్న మాటల్లో దాస్ గారి గొప్పతనం పలకకపోదు.

ఇప్పుడు కొత్తగా శర్వానంద్ నటించిన “ శ్రీకారం” రాసి పాడిన పాట

“ వస్తానంటివో పోతానంటివో వగులు పలుకుతావే…
కట్ట మిందా…కట్ట మిందా పోయే అలకల సిలక
భలే గుంది బాలా…
దాని ఎద నా ఉండే పులా పులా రయిక భలే గుంది బాలా…”
అనే పాట ఇప్పుడు ట్రేండింగ్ లో ఉంది.

తెలుగువారమైన మనం మరిచిపోతున్న జానపదాన్ని, మన ముంగింట్లో కి వచ్చి ముద్దుగా కల్పి మనకి తినిపించి, జానపద మాధుర్యాన్ని మళ్ళీ తెలుపుతున్న, పెంచల్ దాస్ పాటలు మరెన్నో రావాలని… పెంచులకొన లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు పెంచలదాస్ గారికి ఉండాలని కోరుకుంటూ…..

SHARE