అర్థనారీశ్వర పీఠం గురించి తెలుసా?

  • భారత దేశం ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ గుడులు గోపురాలకు కొదువ లేదు. స్వయం భూ దేవాలయాలతో పాటు.. రాజ వంశీకుల కాలాల్లో అనేక మంది పాలకులు అనేక ఆలయాలను నిర్మించారు. ఈ విధమైనటువంటి ఆలయాలలో వింతలు, రహస్యాలు దాగి ఉంటాయి.
  • ఇలాంటి ఎంతో విశిష్ట త కలిగిన ఆలయాలలో ‘జలధీశ్వరస్వామి క్షేత్రం’ ఒకటిగా కనిపిస్తుంది. ఈ ఆలయానికి సుమారు 2 వేల సంవత్సరాల చరిత్ర ఉందని శాసనాలు చెబుతున్నాయి.
  • ఎంతో ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం కృష్ణా జిల్లా ‘ఘంటసాల’లో దర్శనమిస్తుంది. సిద్ధార్థుడు తనకెంతో ఇష్టమైన ‘ఘంటక’ మనే అశ్వం చనిపోగా, దాని పేరున ఇక్కడ ఒక స్థూపాన్ని ప్రతిష్టించగా రాను రాను ఘంటసాలగా మారింది.
3
  • ఈ ఆలయంలో ఉన్న జలనిధిని ఈశ్వరుడిగా భావించి జలధీశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. పాల రాయితో లింగాన్ని రూపొందించడం వల్ల ఈ లింగాన్ని శ్వేత లింగం అని కూడా పిలుస్తుంటారు.
  • సాధారణంగా మనం ఏదైనా శివాలయాన్ని దర్శించినప్పుడు గర్భగుడిలో పీఠంపై కేవలం మనకు శివలింగం మాత్రమే దర్శనం కల్పిస్తుంది. శివాలయం గర్భగుడి పక్కన అమ్మవారు కొలువై ఉండి అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తుంటారు. ఈ జలధీశ్వరాలయంలో అన్ని ఆలయాలకు భిన్నంగా ఒకే పీఠంపై శివలింగం, అమ్మవారు కొలువై ఉండి దర్శనం కల్పిస్తున్నారు.
2
  • ఈ విధంగా ఆది దంపతులిద్దరూ ఒకే పీఠంపై దర్శన భాగ్యం కల్పించడం వల్ల దీనిని అర్థనారీశ్వర పీఠమని పేర్కొంటారు. ఆది దంపతుల ఆజ్ఞ మేరకే అగస్త్యమహర్షి ఇక్కడ స్వామి వారిని ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతుంది. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించడం వల్ల అష్టాదశ శక్తిపీఠాలను, జ్యోతిర్లింగాలను దర్శించినంత పుణ్య ఫలం లభిస్తుందని చెబుతారు.
  • ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసిన నీటిని సర్వరోగ నివారిణిగా భక్తులు భావిస్తారు. పండుగల వంటి ప్రత్యేక దినాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని దర్శించడం కోసం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు.
1

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR