ప్రపంచంలో ఎక్కడ లేనివిధంగా ఆశ్చర్యాన్ని కలిగించే అద్భుత శివలింగం

0
6946

మన దేశంలో ఉన్న శివాలయాలలో ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కడ లేనివిధంగా ఇక్కడి ఆలయంలో ఉన్న శివలింగానికి నెయ్యి రాస్తే కొద్దిసేపటికి ఆ నెయ్యి వెన్నగా మారిపోతుంది. అయితే సాధారణంగా వెన్న నుండి నెయ్యి అనేది వస్తుంది కానీ ఇక్కడ విచిత్రంగా శివలింగంపైన నెయ్యి ని రాస్తే వెన్న రావడంతో ఇదంతా దైవ లీలగా చెబుతున్నారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది ? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Shiva Lingamకర్ణాటక రాష్ట్రం, తుమకూరు ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో శివ గంగ గంగాధరేశ్వర ఆలయం ఉంది.   ఇక్కడ శివగంగ అనే పర్వతం  2640 అడుగుల ఎత్తులో ఉండగా ఈ పర్వతం శివలింగం ఆకారంలో ఉండటం విశేషం. ఇంకా ఈ పర్వతం పై నుండి ఎప్పుడు జలపాతం కిందకు పారుతూ ఉంటుంది. ఈ జలపాతం శివుడి జటాజూటం నుండి పారుతున్న గంగాదేవిలా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఎన్నో ఆలయాలు అనేవి ఉండగా, ఒక కొండపైన ప్రత్యేకంగా ఉండే నంది విగ్రహం అందరిని ఆకట్టుకుంటుంది.

Shiva Lingamఇక ఈ ఆలయంలో అద్భుతం ఏంటంటే, శివలింగం పైన నెయ్యితో అభిషేకం చేస్తే  ఆ నెయ్యి కాస్త వెన్నగా మారుతుంది. అసలు నెయ్యి అనేది వెన్నగా మారడం అసాధ్యం అలాంటిది ఇక్కడ శివలింగం పైన నెయ్యి వెన్నలాగా ఎందుకు మారుతుందనేది చాలా మంది పరిశోధనలు చేసినప్పటికీ ఇది ఇప్పటికి ఎవరికీ అర్ధం కానీ మిస్టరీగానే మారింది.

Shiva Lingamఈ శివగంగ పర్వతం నాలుగు దిక్కుల నుండి నాలుగు ఆకారాలలో కనిపిస్తుందని చెబుతుంటారు. తూర్పు నుండి నంది ఆకారంలో, పశ్చిమ నుండి గణపతి ఆకారంలో, ఉత్తరం నుండి పాము ఆకారంలో, దక్షిణం నుండి శివలింగం ఆకారంలో కనిపిస్తుందని చెబుతుంటారు. ఇక గంగాధరేశ్వర ఆలయంలో ఉన్న శివలింగానికి నెయ్యితో అభిషేకం చేస్తే ఆ నెయ్యి వెన్నగా మారగా, అలా మారిన వెన్నని ఒంటికి రాసుకుంటే సర్వ రోగాలు నయం అవుతాయని భక్తుల నమ్మకం.

SHARE