సాధారణంగా ఏలినాటి శని ప్రభావం ఎలా ఉంటుందో, ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలుసా???

గ్రహాలలో శని గ్రహానికి కీలక పాత్ర ఉంది. శని శుభ, దుర్మార్గపు ప్రభావాలు.. వ్యక్తి విధి, దిశను నిర్ణయిస్తాయి. శని గ్రహం రవాణా రాశులన్నింటిపై ప్రభావం చూపిసట్లే.. శని దృష్టి వల్ల కూడా శుభ, అశుభ ప్రభావాలను తెలుసుకోవచ్చు. సాధారణంగా ఏలినాటి శని అంటే ఏడున్నర సంవత్సరాలు ఉంటుందని మన జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పుతున్నారు. ఏలినాటిని ఏడునాడు అని కూడా పిలుస్తారు.

navgrahaనాడు అంటే అర్ధభాగం అని అర్ధం. జాతకచక్రంలో ఉన్న 12 రాశులు, గ్రహాలు ఆయా రాశుల్లో ప్రవేశించినప్పుడు గృహ ప్రభావం ప్రారంభం అవుతుంది.12,1,2 స్థానాల్లో శని ప్రవేశించినప్పుడు శని గ్రహ ప్రభావం ప్రారంభం అవుతుంది. శని ప్రభావం ఒక్కో స్థానంలో రెండున్నర సంవత్సరాలు ఉంటుంది. మూడు స్థానాల్లో కలిపి ఏడున్నర సంవత్సరాలు శని ఉండటం వల్ల శని ప్రభావం ఉంటుంది.

jataka wheelశని గ్రహం ప్రభావం కారణంగా కష్టాలు కలుగుతాయి. ఆ కష్టాలు మాములుగా ఉండవు. విపరీతంగా ఉంటాయి.
శని గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు ప్రాణభయం, ధనం లేకపోవడం, ఒక వేళ వచ్చినా వెళ్లిపోవడం, మంచిస్థానం నుంచి అథ‌మ‌స్థానానికి వెళ్లిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని సార్లు శని గ్రహం మంచి పనులు జరగటానికి కూడా సహాయపడతాయి.

financially goodఆ పనులు పూర్తి కావటానికి కూడా అనేక ఇబ్బందులు పడవలసి ఉంటుంది. అయితే శని ప్రభావం తగ్గాలంటే విష్ణుసహస్రనామం, సుందరాకాండ పారాయణం, ఆదిత్యహృదయం, భగవంతుని ప్రార్థన చేయాల్సి వుంటుంది. ప్రతి శనివారం శనీశ్వరుడికి నువ్వులనూనెతో దీపాన్ని వెలిగించి పరమేశ్వరుని పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి.

shri vishnu sahasranama stotramకాకులకు ఆహారాన్ని వేయాలి. అలాగే నల్ల చీమలకు పంచదార వేయటం వంటివి చేస్తే శని ప్రభావం తగ్గుతుంది. ఎన్ని సమస్యలు వచ్చిన మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవటం చాలా ముఖ్యం.

crow food donate

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR