క్యాబేజీని తినే ముందు ఇది తెలుసుకోండి లేకపోతే ప్రాణాలకే ప్రమాదం!

మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చే ఆహరం కూడా ఒక్కోసారి అనారోగ్యానికి కారణం అవుతుంది. అందులో ఒకటి క్యాబేజి. దీన్ని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. క్యాబేజీని ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్, సలాడ్లు, చిరుతిళ్లలో ఉపయోగిస్తారు. అయితే మనం ఎంతో ఇష్టంతో తినే క్యాబేజీ కొన్నిసార్లు మన ప్రాణాలనే తీయవచ్చు. ఎందుకంటే అందులో టేప్‌వార్మ్‌ అనే పురుగు ఉంటుంది. ఈ పురుగు పశువుల వ్యర్థాల నుండి భూమిపైకి వస్తుంది. అలా ఎక్కడైనా వర్షపు నీటిలో ఈదుకుంటూ ఎక్కడ కూరగాయలు ఉన్నాయో అక్కడికి చేరుకుంటుంది. ఇది ఇతర కూరగాయలకంటే క్యాబేజీపైనే ఎక్కువగా కనిపిస్తుంది. అలా క్యాబేజీపై చేరి మన ఇంటికి చేరుకుంటుంది. సరిగా వండకుండా తింటే అది మన శరీరంలోకి ప్రవేశించే అవకాశము ఉందంటున్నారు నిపుణులు.

cabbageఅది మన శరీరానికి చాలా హానికరం. ఇవి కడుపులోకి వెళితే విపరీతంగా అభివృద్ధి చెందుతాయి. రక్త ప్రవాహంతో శరీరంలోని ఇతర భాగాలకు చేరుతాయి. కొన్నిసార్లు అవి మెదడుకు కూడా చేరే అవకాశం ఉంటుంది. గతంలో ఇలాంటి కేసులు చాలా నమోదయ్యాయి. క్యాబేజీని పచ్చిగా తినే వ్యక్తులలో టేప్‌వార్మ్ శరీరంలోకి చేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక రకమైన మైక్రోస్కోపిక్ వార్మ్. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రోగులు తీవ్రమైన తలనొప్పితో ఆసుపత్రికి వచ్చారు. అలాంటి సందర్భంలో వారికి మూర్ఛ వచ్చేది. దీంతో చాలా మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఎందుకంటే వారి శరీరంలో అప్పటికే అధిక సంఖ్యలో టేప్‌వార్మ్‌ చేరిపోయాయి..

టేప్‌వార్మ్‌లు మనకు రెండు విధాలుగా హాని చేస్తాయి. చాలా సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి అవి మనకు కనిపించవు. క్యాబేజీని సరిగ్గా కడిగిన తర్వాత కూడా అది ఆకుల మధ్యలో ఇరుక్కుపోతుంది. అటువంటి పరిస్థితిలో మనం పచ్చి క్యాబేజీని తీసుకున్నప్పుడు అది మన శరీరంలో చేరే అవకాశం అత్యధికంగా ఉంటుంది. టేప్‌వార్మ్ ద్వారా కలిగే రోగాన్ని టానియాసిస్ అంటారు. ఇది ఏదో ఒక శరీర భాగానికి చేరాక… అక్కడ గుడ్లు పెడుతుంది. ఆ ప్రాంతంలో తీవ్ర ఆనారోగ్యం వస్తుంది. ఈ పురుగుల్లో ప్రధానంగా 3 రకాలున్నాయి. అవి (1) తినే సాగినాటా, (2) తినే సోలియం (3) తినే ఎసియాటికా. ఇది కళ్లలో కూడా నివాసం ఏర్పాటుచేసుకోగలదు.

cabbageమన పొట్టలో ఆహారాన్ని ఈ పురుగులు తమ ఆహారంగా మార్చుకుంటాయి. ఈ పురుగు మెదడులో చేరిన వారికి తరచూ మూర్ఛ వస్తూ ఉంటుంది. మొదట్లో ఏ లక్షణాలూ కనిపించవు. క్రమంగా తలనొప్పి, అలసట, విటమిన్ల లోపం వస్తాయి. తర్వాత మూర్ఛ వస్తుంది. పురుగు మెదడులో గుడ్లు పెట్టిందంటే… పరిస్థితి మరింత చేయి దాటుతుంది. బ్రెయిన్ పనిచేయడం మానేస్తుంది. ఈ పురుగు ఒక్కోటీ 3.5 మీటర్ల నుంచి 25 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది ఒక్కోటీ 30 ఏళ్ల వరకూ బతికి ఉండగలదు. సమస్య తీవ్రంగా లేకపోతే మందుల వల్ల ఇది చనిపోతుంది. లేదంటే… సర్జరీ చేసి దీన్ని తొలగిస్తారు.

tapeworm toniasis diseaseకాబ‌ట్టి క్యాబేజీని అస్సలు ప‌చ్చిగా తిన‌కూడ‌ద‌ని సూచిస్తున్నారు డాక్టర్లు. మ‌నం క్యాబేజీని ఎంత సరిగ్గా కడిగిన కూడా ఆ పురుగులు ఆకుల మధ్యలో ఉండి ఎవ‌రికీ క‌నిపించ‌కుండా ఇరుక్కుపోయి ఉంటాయి. కాబ‌ట్టి వీటిని అస్సలు ప‌చ్చిగా తినొద్దు.సాధారణంగా క్యాబేజీ లోపలి భాగం శుభ్రంగా ఉంటుంది ఎందుకంటే బయటి పొర దానిని రక్షిస్తుంది, అయినప్పటికీ దానిని శుభ్రం చేయాలనుకుంటే, మందపాటి ఫైబరస్ బయటి ఆకులను తీసివేసి క్యాబేజీని ముక్కలుగా చేసి ఆపై నీటితో కడగాలి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,690,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR