కొమురవెల్లి మల్లన్న విగ్రహం నాభిలో పుట్టలింగం రహస్యం ఏంటి ?

0
9890

ఈ ఆలయంలోని స్వామి వారి విగ్రహం కొన్ని వందల సంవత్సరాల క్రితం పుట్ట మట్టితో చేసారు. ఈ విగ్రహం ఇప్పటికి చెక్కు చెదరకుండా భక్తులకి దర్శనమిస్తుంది. అయితే ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో మీకు తెలియని మరిన్ని విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

komaravelliతెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా, చేర్యాల మండలంలో కొమరవెల్లి అనే గ్రామంలో శ్రీ మల్లికార్జునస్వామి వారి ఆలయం కలదు. కొమరవెల్లి గ్రామములో “ఇంద్రకీలాద్రి” అను పర్వతం పైన 11 వ శతాబ్దంలో కొమరవెల్లి మల్లన్న అనే పేరుతో ఒక గ్రామదేవతగా వెలసినట్టు తెలుస్తున్నది. ఈ క్షేత్రంలో ఉన్న స్వామివారి విగ్రహం 500 సంవత్సరాల క్రితం పుట్ట మట్టితో తయారుచేసినది. అయినాను ఈ రోజు వరకు కూడా చెక్కుచెదరకుండా భక్తుల పూజలను అందుకుంటూ వారి కోర్కెలను తీరుస్తుంది. దీనికి కారణం ఈ మల్లన్న స్వామి విగ్రహమునకు గల నాభిలో పుట్టలింగం కలదని తెలియుచున్నది.

komaravelliఈ స్వామివారి విగ్రహం పైభాగాన ఏడూ శిరస్సుల నాగేంద్రుడు పడగలు విప్పిన దృశ్యం, స్వామివారు కోరమీసాలతో భీకర ఆకారంతో మనకు దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో రెండు వర్గాల పూజారులు మరియు పూజ విధానాలు ఉండటం మరో విశేషం. మల్లన్నస్వామి ఆలయంలో లింగబలిజలు వీరశైవ ఆగమ శాస్త్రప్రకారం అర్చనలు చేయుచుండగా, యాదవ కులస్థులు ఒగ్గు పూజారుల ద్వారా మల్లన్న స్వామికి పూజలు జరిపిస్తారు.

komaravelliఈ క్షేత్రంలో ఇంకో విశేషం ఏంటంటే, మల్లన్న స్వామి ఆలయం ఎదురుగ వెలసిన గంగిరేగు చెట్టు మరియు వొళ్ళు బండ ఉన్నవి. భక్తులు గంగిరేవు చెట్టుకి ప్రదిక్షణలు చేసి వొళ్ళు బండ వద్ద తమ కోరికలతో ప్రణమిల్లి గంగిరేగు చెట్టుకు ముడుపు కట్టిన ఎదల తమలోని సమస్త కోరికలు తీరుతాయని మరియు సంతాన భాగ్యం కలుగుతుందని భావిస్తారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు లక్షల సంఖ్యలో భక్తులు శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకుంటారు. సంక్రాంతి తరువాత మొదటి ఆదివారం లష్కర్ బోనాలు మొదలవుతాయి. అయితే ఈ జాతరలో బోనం , పట్నం అనే విశేషమైన మొక్కుబడులుంటాయి. బోనం అంటే, అలంకరించిన కొత్త కుండలో నైవేద్యం వండి స్వామివారికి నివేదిస్తారు.

komaravelliఈ విధంగా శ్రీ మల్లన్నస్వామిని ప్రార్దించే భక్తుల కోరికలు తీరుతాయి. అలా కోరిన కోరికలు తీరిన వారు వెంటనే శ్రీ మల్లన్నస్వామిని దర్శించుకొని కోడెను కట్టుట, శ్రీ స్వామివారి సేవ, టెంకాయ ముడుపు, బోనములు, తలనీలాలు మొదలగు మ్రొక్కుబడులు చెల్లించుకుంటారు.

komaravelli