పూజలు జరగని ఆలయం!!

చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాలకు మన దేశం పుట్టినిల్లు. ఈ ఆలయాలు మనకు సాంకేతిక నిధులు. అలాంటి వాటిలో కోణార్క్ దేవాలయం. పన్నెండేళ్ల పాటు 1200 మంది శిల్పులు కష్టపడి నిర్మించిన ఈ ఆలయ విశిష్టత ఏంటీ?. సూర్యుడికి రథంలా ఉండే ఈ ఆలయం కేవలం హిందువులకు సంబంధించింది మాత్రమే కాదు. ప్రపంచంలోని ప్రతి వ్యక్తి సందర్శించాల్సిన స్థలం. అద్భుతమైన విద్యని అందించే ఒక మహా విశ్వవిద్యాలయం అంటే అతిశయోక్తి కాదు.

sun temple konarkయునెస్కో వరల్డ్ హెరిటేజ్ గా గుర్తింపు పొందిన కోణార్క్ సూర్య దేవాలయం ముందుగా ఒడిశాలోని సముద్ర తీరాన నిర్మించారు కానీ కాల క్రమేణా సముద్రం వెనక్కి వెళ్ళింది. ఈ ఆలయాన్ని తూర్పు గంగదేవి వంశానికి చెందిన లాంగులా నరసింహదేవుడు నిర్మించారు.

ఈ ఆలయాన్ని నిర్మించడం కోసం 1200 మంది 12 సంవత్సరాలు పాటు కష్టపడ్డారు. ఇక ఈ ప్రాంతానికి కోణార్క్ అనే పేరు ఎలా వచ్చింది అనే దానిపై స్థానికంగా ప్రచారంలో ఉన్న కథలను చూద్దాం… మొదటి కథ ప్రకారం సూర్యడు అర్కుడు అనే రాక్షసుడిని ఈ ప్రాంతంలో సంహరించాడు. అలాగే ఒడిశాలో ఉన్న ఐదు పుణ్య క్షేత్రాల కోణంలో సూర్యుడు వెలసిన ప్రదేశం కనుక ఈ ప్రాంతానికి కోణార్క్ అనే పేరు వచ్చిందని అంటారు.

sun temple konarkఇక ఈ ఆలయ ప్రాసిస్త్యం తెలియజేసే విధంగా పురాణాల ప్రస్తావన ఉన్న ఓ కథను ఇప్పుడు చూద్దాం… శ్రీకృష్ణుడు, జాంబవతీ కుమారుడైన సాంబుడు చాలా అందగాడు. దీంతో ఆయనకు గర్వం ఎక్కువ అయ్యింది. అందువల్లనే సాంబుడు ఒకానొక సమయంలో నారద మహర్షిని అవమానించాడు.

jambavant krishna's sonసాంబుడి గర్వాన్ని అణచడానికి నారద మహర్షి ఒక ఉపాయం ఆలోచించాడు. అందులో భాగంగా నారద మహర్షి సాంబుడిని అంతఃపురం ఆడవాళ్ళు స్నానం ఆచరించే ప్రదేశానికి తీసుకెళ్ళాడు. సాంబుడు అక్కడున్న ఆడవారితో తప్పుగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న కృష్ణుడు వెంటనే అక్కడికి చేరుకొని సాంబుడిని కుష్టి వాడై పొమ్మని శపించాడు. తన తప్పు తెలుసుకున్న సాంబుడు శాపవిమోచన మార్గం అడగగా కృష్ణుడు ప్రస్తుత కోణార్క్ సూర్య దేవాలయం ఉన్న ప్రాంతంలో సూర్యుడి గురించి తపస్సు చేయమని చెప్పాడు.

దీంతో సాంబుడు ఈ క్షేత్రంలో చంద్రభాగంలో ఉన్న నదిలో స్నానం ఆచరించి సూర్యుడి గురించి 12 ఏళ్లు తపస్సు చేసి శాపవిమోచనం పొందారు. ఈ ఆలయం గర్భగుడి పైకప్పులో సుమారు 52 టన్నుల బరువైన అయస్కాంతాన్ని ఉంచి ఇక్కడున్న మూల విరాట్ ను ఇనుముతో తయారు చేసి సూర్య భగవానుడిని గాలిలో తేలేలా చేశారు. ఇక అప్పట్లో మన దేశానికి వచ్చిన కొందరు విదేశీ నావికులు ఈ ఆలయంలో ఉన్న అయస్కాంతం ప్రభావం వల్లనే సముద్రంలో ప్రయాణించే ఓడలు నావికా వ్యవస్థ పని చేయడం లేదని భావించిన వారు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు చరిత్రలు చెబుతున్నాయి.

sun dial - sun temple konarkఇక ఆలయాన్ని సందర్శించే వీక్షకులను ఆకట్టుకునే కొన్ని ఆసక్తికర విశేషాల విషయానికి వస్తే ఈ ఆలయాన్ని బ్లాక్ గ్రానైట్ తో నిర్మించారు. సూర్యుడు ఉదయించేటప్పుడు వచ్చే కిరణాలు ఇక్కడున్న మూల విరాట్ పైన పడతాయి. ఈ ఆలయాన్ని సూర్యుని రథం ఆకారంలో నిర్మించారు. సూర్య రశ్మిలోని ఏడు వర్ణాలకు ప్రతీకగా ఇక్కడ మనకి ఏడు గుర్రాలు కనిపిస్తాయి.ఇక్కడ మొత్తం 24 రథ చక్రాలు ఉన్నాయి. రోజులలో 24 గంటలకు ప్రతీకగా వీటిని చూస్తారు. ఇక్కడున్న రథ చక్రాలు సన్ డైల్స్ గా పని చేస్తాయి. ఈ గుడికి సంబంధించిన చిత్రాలను మనం పాత 10 రూపాయల నోట్లు పై చూడవచ్చు. ఇక్కడ స్వామి వారికి పూజలు జరగవు. దీనికి సంబంధించి బోలెడు కథలు ప్రచారంలో ఉన్న వాటిలో నిజం లేదని నిపుణులు తెలుస్తున్నారు. దీంతో ఇక్కడ పూజలు ఎందుకు జరగట్లేదు అనే దానిపై స్పష్టత కరువైంది

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,580,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR