ఈ ప్రాంతం బొమ్మల తయారీకి, చిత్ర పటాలకి చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడ వెలసిన దేవాలయంలో గిరిజనులు ఒక ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ ఉత్సవానికి అనేక ప్రాంతాల నుండి ప్రజలు తరలివస్తుంటారు. మరి కొండల నగరం అని పిలువబడే ఆ ప్రాంతం ఎక్కడ ఉంది? ఇక్కడి ప్రాంతం లోని మరిన్ని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాజస్తాన్ రాష్ట్రం లోని దుంగార్పూర్ దక్షిణ భాగంలో కొండల రాజ్యం ఉంది. ఇక్కడే బనేశ్వర్ దేవాలయం ఉంది. ఈ పట్టణం దున్గార్పూర్ జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రం గా వుంది. చారిత్రిక పత్రాల ప్రకారం ఇది ఇంతకు పూర్వం దుంగార్పూర్ రాజ్యానికి రాజధాని. ఈ జిల్లా లోని భిల్ జాతి వారు ఇక్కడి ప్రధాన, పురాతన నివాసులు, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారు. భిల్ జాతి ముఖ్య నాయకుడి నుంచి దుంగార్పూర్ ను వీర్ సింగ్ మహారాజు చేజిక్కించుకున్నాడు.
దుంగార్పూర్ లోని బనేశ్వర్ దేవాలయం లో నిర్వహించే గిరిజనుల ప్రసిద్ధ పండుగ బనేశ్వర్ ఉత్సవం. ఫిబ్రవరి లో వచ్చే పౌర్ణమి లేదా మాఘ శుక్ల పౌర్ణమి నాడు జరిగే ఈ ఉత్సవం చూడడానికి ఈ దేవాలయానికి అనేక మంది భక్తులు వస్తారు. ఈ పవిత్ర సమయంలో, గుజరాత్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ ల నుంచి మహి, సోమ నదుల సంగమంలో స్నానం చేయడానికి ఇక్కడికి భిల్లులు వస్తారు. తాంత్రిక వినాయకుడు, జింక చర్మ దారి అయిన బ్రహ్మ, వీణ చేపట్టిన శివుడు, పద్మిని, పద్మపాణి యక్షుడు, గరుడారూడ అయిన వైష్ణవి విగ్రహాలు ఇక్కడ చూడవచ్చు. ఈ పండుగలో ఈ ప్రాంతపు నృత్య రీతులు, సంగీతం రుచి చూడవచ్చు. హిందువుల ప్రసిద్ధ పండుగ హోలీ ని ఇక్కడ గిరిజన నృత్యాలతో జరుపుకుంటారు. దీపాల పండుగ దీపావళిని, దీపావళి తర్వాత జరిగే బార్ బ్రిజ్ ఉత్సవం ఈ ప్రాంతపు ప్రధాన పండుగలు.
ఇక్కడి దేశవాళీ బొమ్మల తయారీ కేంద్రం ఉంది. అయితే చెక్క నుంచి తయారయ్యే అందమైన బొమ్మలకు మెరుపులు అద్దడానికి లక్క ఉపయోగిస్తారు. అధిక భాగం బొమ్మలు మనుష్యులను జంతువులను పోలి వుంటాయి. వివిధ పండుగలు, సందర్భాల్లో ఈ బొమ్మలను విరివిగా ప్రదర్శిస్తారు. బొమ్మల తయారీకే కాక, దుంగార్పూర్ కంసాలి వారు తయారు చేసే చిత్ర పటాలకు కూడా ప్రసిద్ది.
దుంగార్పూర్ పట్టణం విస్తృత స్థాయి వారి సాగుకి, టేకు, మామిడి, ఖర్జూరాల ఉత్పత్తికి కూడా ప్రసిద్ది పొందింది. దుంగార్పూర్ లోని దట్టమైన అడవుల్లో పర్యాటకులు పర్వతారోహణ చేస్తూ తోడేళ్ళు, అడవి పిల్లులు, నక్కలు, ముళ్ళ పందులు, ముంగిసలు లాంటి జంతు జాతులను కూడా చూడవచ్చు. ఆకర్షణీయమైన బొమ్మలు, పండుగలు, వన్యప్రాణులకే కాక దుంగార్పూర్ రాజ ప్రాసాదాలకు, పురాతన ఆలయాలకు, మ్యూజియం లకు, సరస్సులకు కూడా ప్రసిద్ది చెంది౦ది. రాజపుత్ర నిర్మాణ శైలికి ప్రసిద్ది చెందింది ఉదయ విలాస్ భవనం. ఈ పెద్ద భవనాన్ని రాణీవాసం, ఉదయ విలాసం, కృష్ణ ప్రకాశం లేదా ఏక్ తంబియా మహల్ అనే మూడు విభాగాలుగా విభజించారు.
క్లిష్టమైన రీతిలో చెక్కిన వసారాలు, తోరణాలు, కిటికీలకు ప్రసిద్ది చెందిన ఈ ప్రాసాదం ఇప్పుడు ఒక వారసత్వ హోటల్ గా మారిపోయింది. గాజు, అద్దాల పనికి ప్రసిద్ది చెందిన జునా మహల్ ను కూడా పర్యాటకులు ఇక్కడ చూడవచ్చు. దుంగార్పూర్ లో మరో అద్భుత భవనం బాదల్ మహల్. గాయిబ్ సాగర్ సరస్సు ఒడ్డున వున్న ఈ భవనం విస్తారమైన నమూనాలకు, రాజపుత్ర, ముఘలాయి నిర్మాణ శైలుల మిశ్రమ శైలికి ప్రసిద్ది పొందింది.
దుంగార్పూర్ అనేక హిందూ, జైన ఆలయాలకు ప్రసిద్ది చెందింది. పర్యాటకులు ఈ ప్రాంతంలో ఉన్నపుడు వనేశ్వర్ ఆలయం, భువనేశ్వర్, సూర్పూర్ ఆలయం, దేవ్ సోమనాథ్ ఆలయం, విజయ్ రాజరాజేశ్వర్ ఆలయం, శ్రీనాథ్ జి ఆలయం చూడవచ్చు. దాని ఒడ్డున వున్న అనేక దేవాలయాలు, ప్రాసాదాల వల్ల గాయిబ్ సాగర్ సరస్సు ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణ గా మారింది.
Kondala nagaram ani piluvabade a pranthamlo girijanulu jaripe panduga
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.