Home Unknown facts కోరిన కోరికలు తీర్చే భద్రకాళి అమ్మవారి ఆలయ విశేషాలు

కోరిన కోరికలు తీర్చే భద్రకాళి అమ్మవారి ఆలయ విశేషాలు

0

ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో భద్రకాళి అమ్మవారి ఆలయం ఒకటిగా వెలుగొందుచున్నది. ఈ అమ్మవారు భక్తులకి కొంగుబంగారమై వారి కోర్కెలను నెరవేరుస్తుంది. మరి ఆ ఆలయం స్థల పురాణం ఏంటి? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.bhadrakaliతెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, వరంగల్ – హన్మకొండ ప్రధాన రహదారిలో భద్రకాళి చెరువు తీరమున గుట్టల మధ్య శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయం ఉంది. ఈ ఆలయం చాలా ప్రాచీనమైనదిగా చెబుతారు. అయితే ఈ ప్రాంతంలో సిద్ద సంచారం ఎక్కువగా ఉంటుందని అందుకే ఈ ప్రదేశంలో అడుగుపెట్టిన మానవులకు తాము తెలిసి, తెలియక చేసిన తప్పులన్నీ తొలగయిపోతాయని భక్తుల అపార నమ్మకం.ఆలయంలోని గర్భగుడిలో శ్రీ భద్రకాళీదేవి విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండుగగా అలరాలుతూ, పశ్చిమ ముఖంగా కూర్చుండి భక్తులకి దర్శనమిస్తుంది. అమ్మవారు పార్థివదేహం పైన కూర్చొని 8 చేతులతో, కుడి వైపు ఉన్న 4 చేతులలో ఖడ్గము, ఛురికా, జపమాల, ఢమరుకము. ఎడమవైపు ఉన్న 4 చేతులలో ఘంట, త్రిశూలము, నరికిన తల, పానపాత్రలు ఉన్నాయి.ఇక శ్రీరాముడు తన వనవాస సమయంలో సీతాలక్ష్మణ సమేతంగా దండకారణ్య ప్రాంతాన్ని ధాటి గోదావరి ప్రాంతాన కొంతకాలం ఉన్న సమయంలో ఇచట ఉన్న ఋషులు శ్రీరామునికి ఆతిధ్యమిచ్చి, తమ యజ్ఞయాగాదులకు ఆటంకం కలిగిస్తున్న రాక్షసులను సంహరించమని ఋషులు వేడుకొన్న దాని ప్రకారం పూర్వం ఈ ప్రాంతంలో రాక్షసులు నివసించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. అయితే ఈ ప్రాంతాలలో సుగ్రీవాది వానరులు నివసించినట్లు తెలుస్తుంది. అందువల్లనే ఈ ప్రాంతానికి హనుమకొండ వచ్చినట్లుగా చెబుతారు.ఈ ఆలయ నిర్మాణ విషయానికి వస్తే, రెండవ పులకేశి చక్రవర్తి క్రీ.శ. 625 ఆ ప్రాంతంలో నిర్మించి అందులో భద్రకాళి మాతను ప్రతిష్టించాడని తెలియుచున్నది. ఆ తర్వాత కాకతీయులు భద్రకాళి మాతను ఆరాధించారు. కాకతీయ గణపతి దేవుడు ఆలయం ప్రక్కన ఒక పెద్ద చెరువును తవ్వించి, ఆలయ నిర్వహణ కోసం భూమిని కూడా దానంగా ఇచ్చాడు. ఇక రాణిరుద్రమదేవి ఈ తల్లిని ఆరాదించనిదే భోజనము చేసేది కాదని ప్రతీతి.ఈ ఆలయ గొప్పతనం చెప్పే ఒక పురాణ కథ ఏంటంటే, ఒకనాడు సుదర్శన మిత్రుడు అనే పండితుడు నూరుగురు విద్వాంసులు కొలువగా ఏనుగుమీద ఎక్కి ఏకశిలానగరానికి వచ్చి ప్రతాపరుద్రుని కొలువుకు రాగ ఆష్టాన విద్వాంసులు అతడిని ఓడించి అవమాన పరిచి పంపగా, అహం దెబ్బతిన్న సుదర్శన మిత్రుడు ఆ విద్వాంసులను ఎలాగైనా జయించాలనే ఉద్దేశం తో ఈ వేళ కృష్ణచతుర్దశి, రేపు అమావాస్య, మీరు కాదంటారా? అని ప్రశ్నించాడట.అప్పుడు విద్వాంసులు ఇరకాటంలో పడ్డారు. ఎందుకంటే, ఔనంటే సుదర్శనమిత్రుని వాదం అంగీకరించినట్లు అవుతుంది. కాదంటేనే అతనిని ఓ డించినట్లవుతుంది అని నిర్ణయించి, రేపు పౌర్ణమి అని వాదించారట. విద్వాంసులు గెలవాలంటే మర్నాడు పౌర్ణమి కావాల్సి ఉండిది. ఆ సంకట స్థితి నుంచి తమను రక్షించుకోటానికి ఆ విద్వాంసుల లో ప్రధానుడైన శాఖవెల్లి మల్లికార్జున భట్టు ఆ రాత్రి హనుమకొండకు వెళ్ళి శ్రీ భద్రకాళీదేవిని పూజించి ఆ దేవిని 11 శ్లోకాలతో స్తుతించాడట. సంతుష్టురాలైన ఆ తల్లి ప్రత్యక్షమై నీ మాటనే నిలుపుతానని వరమిచ్చిందట. మరునాటి రాత్రి నిండు పున్నమిలాగా వెలుగొందిన చంద్రుని చూసి, సుదర్శనమిత్రుడు క్షమాపణ వేడుకొన్నాడట.అప్పుడు ఇది కేవలం దైవీశక్తి కాని, మానవశక్తి కాదని అంగీకరించి వెళ్ళిపోయాడట. ఆ విధంగా శ్రీ భద్రకాళీదేవి భక్తులను కటాక్షించటం ఆనాటి నుంచే కనిపిస్తుంది. ఈ వృత్తాంతంలో పేర్కొనబడిన శాఖవెల్లి మల్లికార్జున భట్టు ప్రతాపరుద్రుని ఆస్థానంలోనివాడు కనుక ప్రతాపరుద్రుని కాలంనాటికే భద్రకాళీ దేవాలయం ప్రసిద్దమై ఉండినట్లు స్పష్టమవుతుంది.పూర్వం అమ్మవారు వ్రేలాడుతున్న నాలుకతో రౌద్రరసం ఉట్టిపడుతూ భయంకరంగా ఉండేది. అలాంటి రౌద్రస్వరూపిణిని నోటిలో అమృత బీజాలు వ్రాసి భీకరమైన ముఖాన్ని 1950 లో పునరుద్దరించే భాగంలో ముఖాన్ని ప్రసన్నవదనంగా మార్పు చేయించారు. ఇందుకు కారణం ఏంటంటే, దక్షిణాచార సంప్రదాయం ప్రకారం అర్చింపబడే మూర్తి శాంత స్వరూపంగా ఉండాలనేది శాస్త్ర విధి. అంతేగాక అమ్మవారి గుడిలో శ్రీచండీయంత్ర ప్రతిష్ఠ చేసి, ప్రతి సంవత్సరమూ శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, ప్రతి నిత్యం దూపదీప నైవేద్యాదులు అనే సంప్రదాయాలను పునరుద్ధరించారు.గర్భాలయానికి రెండువైపులా రెండు చిన్న గదులు ఉన్నాయి. అవి బహుశా యోగులో సిద్ధులో తపస్సు చేసుకోటానికి ఉపయోగించేవేమో అనిపిస్తుంది. అమ్మవారి దేవాలయానికి దక్షిణ భాగాన ఒక గుహ ఉన్నది. అందులో యోగులు తపస్సు చేసుకుంటూ ఉండేవారని ప్రతీతి. అమ్మవారి గుడికి వెళ్ళేదారిలో, చెరువు ప్రక్కన ఉన్న ఒక పెద్ద కొండమీద గణపతి విగ్రహం ఒకటి ఉండేది కొండతో పాటు అది కూడా అంతరించిపోయింది.ఇలా ఎన్నో విశేషాలు కలిగిన ఈ భద్రకాళి అమ్మవారి దేవాలయానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version