కుబేరుడికి ఊరగాయలు అంటే ఎంతో ప్రీతి…

చాలా మంది ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. పౌర్ణమి రోజున ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే.. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. చేతినిండా డబ్బు సంపాదించినా పొదుపు చేయలేక బాధపడేవారు.. ఈ ఆధ్యాత్మిక చిట్కాలను పౌర్ణమి రోజున పాటిస్తే సరిపోతుంది.

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి నెలా వచ్చే పౌర్ణమి, అమావాస్యలను ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు.
ఈ రెండు రోజులు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

moneyఈ క్రమంలోనే వైశాఖ పౌర్ణమికి ఎంతో విశిష్టత కలిగి ఉంది. వైశాఖ పౌర్ణమిని బుద్ధ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. వైశాఖ శుక్ల చతుర్దశి రోజు బుద్ధుడు జన్మించడం వల్ల వచ్చిన బౌద్ధ మతస్తులు పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకుంటారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ వైశాఖ పౌర్ణమికి కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మన ఇంట్లో సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.

buddhaప్రతి ఒక్కరు మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలని శ్రీ మహాలక్ష్మికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా పౌర్ణమి రోజు కొన్ని చిట్కాలను పాటించడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుందని పండితులు చెబుతున్నారు.
ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజు డైమండ్ ఆకారంలో ఉన్నటువంటి కలకండ కామాక్షి దీపంలో వేసి వెలిగించడం ద్వారా లక్ష్మీ కటాక్షం పొందవచ్చు. ఈ విధంగా చేయడం పౌర్ణమిరోజు కుదరకపోతే మంగళ శుక్రవారాలలో చేసిన కూడా మంచి ఫలితాలను పొందవచ్చు.

kuberసంపదకు అధిపతి అయిన కుబేరుడిని కూడా పౌర్ణమి రోజు పూజించడంవల్ల మనకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కుబేరుడికి ఊరగాయలు అంటే ఎంతో ప్రీతికరం. అందుకోసమే కుబేరుడికి ఇష్టమైన ఊరగాయలను మన ఇంట్లో నిల్వ చేసుకోవడం వల్ల సంపద పెరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

pickleఅదేవిధంగా పౌర్ణమి రోజు మన ఇంటికి ముత్తైదువులను పిలిచి వారికి పసుపు, కుంకుమ, తాంబూలం ఇవ్వడం ద్వారా జన్మ జన్మ పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. వైశాఖ పౌర్ణమి రోజు ఈ విధంగా మహాలక్ష్మిని, కుబేరుడిని పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR